Joe Biden Orders : 90 రోజుల్లో కొవిడ్ మూలాలపై నివేదిక అందించాలి.. ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించిన అమెరికా ప్రెసిడింట్..
Joe Biden Orders : రాబోయే మూడు నెలల్లో కోవిడ్ -19 మూలాల గురించి నివేదిక సమర్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా
Joe Biden Orders : రాబోయే మూడు నెలల్లో కోవిడ్ -19 మూలాల గురించి నివేదిక సమర్పించాలని అమెరికా అధ్యక్షుడు జో బిడెన్ అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీలను ఆదేశించారు. చైనాలో మొదట ఉద్భవించిన కోవిడ్ -19 వైరస్ జంతు వనరు నుంచి వచ్చిందా లేదా ప్రయోగశాల ప్రమాదం నుంచి వచ్చినదా నివేదించాలని బిడెన్ ఏజెన్సీలను ఆదేశించారు. ఇంటెలిజెన్స్ వర్గాలలో ఎక్కువమంది చెబుతున్న సమాధానాలు పొంతనలేకుండా ఉన్నాయని అన్నారు. దర్యాప్తునకు సహకరించాలని ఆయన యుఎస్ జాతీయ ప్రయోగశాలలను ఆదేశించారు.
మహమ్మారి మూలాల గురించి అంతర్జాతీయ పరిశోధకులకు సహకరించాలని చైనాకు పిలుపునిచ్చారు. పూర్తి పారదర్శక, సాక్ష్య-ఆధారిత, సంబంధిత డేటా, సాక్ష్యాలకు అందించడానికి అంతేకాకుండా చైనాను ఒత్తిడి చేయడానికి యునైటెడ్ స్టేట్స్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భాగస్వాములతో కలిసి పని చేస్తుందని గుర్తు చేశారు. అంతర్జాతీయ పరిశోధనలకు సహకరించడానికి చైనా ప్రభుత్వం పూర్తిగా నిరాకరించడంతో అసలు నిజాలు ఎప్పటికి తెలియకపోవచ్చని అన్నారు. కోవిడ్ -19 మూలాలపై దర్యాప్తును ఇప్పటికి అడ్డుకుంటూనే ఉందని ఆరోపించారు.
దర్యాప్తు సంస్థలు సమాచార ప్రయత్నాలను రెట్టింపు చేయాలన్నారు. విశ్లేషణాత్మక వివరాలను సేకరించాలన్నారు. ఖచ్చితమైన నిర్ధారణకు 90 రోజుల్లో తిరిగి నివేదికి సమర్పించాలని ఇంటిలిజెన్స్ వర్గాలను ఆదేశించారు. బిడెన్ ప్రకారం.. గత సంవత్సరంలో ఏర్పడిన వైరస్ మూలాలపై పరిశోధన చేయడానికి ఏజెన్సీలు రెండుగా విభజించబడ్డాయి. ఈ వైరస్ వల్ల ఇప్పటికే 3.4 మిలియన్లకు పైగా ప్రజలు మరణించారు.