AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అతిథులను ఆకర్షిస్తున్న బంగారు హోటల్

కరోనాతో కుదేలైన అతిథ్య రంగం పర్యాటకులను ఆకర్షించే పనిలో పడ్డాయి. అమెరికాకు చెందిన ఓ హోటల్ యాజమాని పసిడి అందాలతో జిగేల్ మనిపించే అందాల భవనంతో ఆకర్షిస్తున్నారు. వియత్నాం క్యాపిటల్ హనోయ్ అనే హోటల్ మేనేజ్ మెంట్ అతిథులను అట్రాక్ట్ చేయడానికి చాలా ఖరీదైన ప్లాన్ వేసింది. బంగారపు ప్లేట్లతో బాత్‌టబ్‌లు, బేసిన్లు, టాయిలెట్లు అన్నీ బంగారపుమయం చేశారు.

అతిథులను ఆకర్షిస్తున్న బంగారు హోటల్
Balaraju Goud
|

Updated on: Jul 06, 2020 | 6:35 PM

Share

కరోనాతో కుదేలైన అతిథ్య రంగం పర్యాటకులను ఆకర్షించే పనిలో పడ్డాయి. అమెరికాకు చెందిన ఓ హోటల్ యాజమాని పసిడి అందాలతో జిగేల్ మనిపించే అందాల భవనంతో ఆకర్షిస్తున్నారు. వియత్నాం క్యాపిటల్ హనోయ్ అనే హోటల్ మేనేజ్ మెంట్ అతిథులను అట్రాక్ట్ చేయడానికి చాలా ఖరీదైన ప్లాన్ వేసింది. బంగారపు ప్లేట్లతో బాత్‌టబ్‌లు, బేసిన్లు, టాయిలెట్లు అన్నీ బంగారపుమయం చేశారు.

మూడు నెలల కరోనా వైరస్ లాక్‌డౌన్ తర్వాత వియత్నాంలోని డాల్సి హనోయ్ గోల్డెన్ లేక్ హోటల్ తెరుచుకుంది. దీంతో పోయిన ఆదాయాన్ని రాబట్టుకునేందుకు, కస్టమర్లకు ఆకట్టుకునేందుకు అందంగా ముస్తాబవుతోంది. హోవా బిన్ గ్రూపుకు చెందిన హోటల్ ను అమెరికాకు చెందిన వ్యంధం హోటల్స్ ఎండ్ రిసార్ట్స్ ఇన్‌క్లూజివ్ నిర్వహిస్తోంది. అయితే, ప్రపంచంలో మరే హోటల్ లేనంతగా దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దామని చైర్మన్ హూ డాంగ్ అంటున్నారు. హోటల్ ను పూర్తిగా 24 క్యారెట్ ల బంగారంతో ఇన్ఫినిటీ‌పూల్‌ను రూఫ్ టాప్ మీద ఏర్పాటు చేశామని వెల్లడించారు.హోటల్ గోడలకు కూడా బంగారపు ప్లేట్లతో కవర్ చేసేశారు. దీని కోసం దాదాపు ఒక టన్ను బంగారం అవసరమైందట.

హోటల్ గదులన్నింటిని బంగారంతో రూపుదిద్దారు. గెస్ట్ రూంల లోపల, బాత్రూమ్ లలో బంగారంతో నింపేశారు. ఈ హోటల్ లో ఉండాలంటే ముందుగానే బుక్ చేసుకోవల్సి ఉంటుది. ఖరీదైన అందాలను ఆస్వాదించాలంటే ఒక్క రాత్రికి 250 అమెరికన్ డాలర్లు అంటే రూ.18వేల 716 ఖర్చు చేయాల్సిందే. సిటీలో లగ్జరీ అకమెడేషన్ అందించే హోటళ్లకు సమానం ఛార్జిలను నిర్ణయించారు. ఇతర లగ్జరీ హోటళ్లు మార్బుల్స్ వాడతాయి. కానీ, ఇక్కడ ప్రతీది గోల్డెన్ ప్లేటెడ్ గా ఉంటుందని నిర్వహకులు తెలిపారు. కరోనా మహమ్మారి దాపరించకపోతే హోటల్ పూర్తిగా విదేశీ అతిథులతో నిండిపోయేదని అంటున్నారు. ఇదేకాకుండా వియత్నాం సిటీలో మరో గోల్డ్ ప్లేటెడ్ ప్రాజెక్ట్ చేయాలని హో చి మిన్ అనుకుంటున్నారట