అమెరికాలో టిక్ టాక్, నో ప్రాబ్లమ్ ! డోనాల్డ్ ట్రంప్

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలకు అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ తో డీల్ ని తాను అంగీకరిస్తున్నానన్నారు. ఒరాకిల్, వాల్ మార్ట్ ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తాయని

  • Publish Date - 10:27 am, Sun, 20 September 20 Edited By: Anil kumar poka
అమెరికాలో టిక్ టాక్, నో ప్రాబ్లమ్ ! డోనాల్డ్ ట్రంప్

అమెరికాలో టిక్ టాక్ కార్యకలాపాలకు అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. టిక్ టాక్ మాతృక సంస్థ బైట్ డాన్స్ తో డీల్ ని తాను అంగీకరిస్తున్నానన్నారు. ఒరాకిల్, వాల్ మార్ట్ ఓ కొత్త సంస్థను ఏర్పాటు చేస్తాయని, టిక్ టాక్ గ్లోబల్ పేరిట దేశంలో ఇవి ఆపరేషన్స్ నిర్వహిస్తాయని ఆయన వైట్ హౌస్ లో మీడియాకు తెలిపారు. యుఎస్ యూజర్ డేటాను రక్షించే సెక్యూరిటీ బాధ్యత ఒరాకిల్ సంస్థదేనని యుఎస్ ట్రెజరీ శాఖ స్పష్టం చేసింది. ఈ టిక్ టాక్ గ్లోబల్ లో యుఎస్ షేర్ హోల్డర్లు 53 శాతం, చైనీస్ ఇన్వెస్టర్లు 36 శాతం వాటాను కలిగి ఉంటారు. ఒరాకిల్, వాల్ మార్ట్ రెండూ పూర్తిగా టిక్ టాక్ పై ఆధిపత్యాన్ని కలిగి ఉంటాయని ట్రంప్ చెప్పారు. టెక్సాస్ లో టిక్ టాక్ ఇక 25 వేల మంది ఉద్యోగులతో పనిని ప్రారంభించనుంది. ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల టిక్ టాక్ హర్షం వ్యక్తం చేసింది. తాము అమెరికా ప్రయోజనాలకు అనుకూలంగా పని చేస్తామని, ఈ దేశ భద్రతకు ఎలాంటి ముప్పును తేబోమని పేర్కొంది.