అమెరికాలో రేపటి నుంచి ‘టిక్కు’మనని ‘టాక్’ ?

అమెరికాలో రేపటి నుంచి టిక్ టాక్,వి-చాట్ లను యాప్ స్టోర్స్ నుంచి నిషేధిస్తున్నారు. చివరి క్షణంలో అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఇక వీటి బ్యాన్ తప్పనట్టే ! ఏ యాప్ స్టోర్ నుంచి అయినా వీటిని డౌన్ లోడ్ చేసుకోవడాన్ని బ్యాన్ చేస్తున్నామని అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది.

అమెరికాలో రేపటి నుంచి 'టిక్కు'మనని 'టాక్' ?
Follow us

| Edited By: Anil kumar poka

Updated on: Sep 19, 2020 | 2:47 PM

అమెరికాలో రేపటి నుంచి టిక్ టాక్,వి-చాట్ లను యాప్ స్టోర్స్ నుంచి నిషేధిస్తున్నారు. చివరి క్షణంలో అధ్యక్షుడు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే తప్ప ఇక వీటి బ్యాన్ తప్పనట్టే ! ఏ యాప్ స్టోర్ నుంచి అయినా వీటిని డౌన్ లోడ్ చేసుకోవడాన్ని బ్యాన్ చేస్తున్నామని అమెరికా వాణిజ్య శాఖ ప్రకటించింది. ఈ కంపెనీలు తమ దేశ భద్రతకు ముప్పుగా పరిణమించాయని ట్రంప్ ప్రభుత్వం ఆందోళనను వ్యక్తం చేస్తోంది. ఆదివారం నుంచి వి-చాట్ న నిషేధిస్తున్నప్పటికీ ప్రజలు టిక్ టాక్ ను నవంబరు 12 వరకు వినియోగించుకోవచ్చునని కూడా అంటున్నారు. ప్రభుత్వ ఉత్తర్వులను తాము కోర్టులో సవాలు చేస్తామని టిక్ టాక్ చెబుతుండగా, మేం మాత్రం ప్రభుత్వంతో చర్చలు కొనసాగిస్తామని విచాట్ సంస్థ టెంసెంట్ పేర్కొంది. తామేమీ అమెరికా వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడడంలేదని ఈ రెండు సంస్థలూ ఢంకా బజాయించి చెబుతున్నాయి.