తూర్పు తీరంలో అమెరికా నౌక
విశాఖ తీరంలో అమెరికా సముద్రయాన యుద్ధనౌక సందడి చేసింది. అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పి.ముర్తా మూడు రోజుల కోసం విశాఖ తీరానికి వచ్చింది. యూఎస్ కాన్సుల్ జనరల్‌తో పాటు భారత నౌకాదళ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికాల మధ్య పరస్పర సహకారంలో భాగంగా ఈ నౌక విశాఖపట్నానికి వచ్చిందని అధికారులు తెలిపారు. అధికారులు ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నౌకను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నౌక మూడు […]
విశాఖ తీరంలో అమెరికా సముద్రయాన యుద్ధనౌక సందడి చేసింది. అమెరికా నౌక యూఎస్ఎస్ జాన్ పి.ముర్తా మూడు రోజుల కోసం విశాఖ తీరానికి వచ్చింది. యూఎస్ కాన్సుల్ జనరల్‌తో పాటు భారత నౌకాదళ అధికారులు ఈ నౌకకు స్వాగతం పలికారు. ఇండో పసిఫిక్ ప్రాంతంలో భారత్-అమెరికాల మధ్య పరస్పర సహకారంలో భాగంగా ఈ నౌక విశాఖపట్నానికి వచ్చిందని అధికారులు తెలిపారు. అధికారులు ఎంపిక చేసిన విద్యార్థులకు ఈ నౌకను సందర్శించే అవకాశం కల్పిస్తున్నారు. ఈ నౌక మూడు రోజుల పర్యటన సందర్భంగా విశాఖలో పలు కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.