అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు ముఖేశ్ శివాజీవార దేశ్ నార్త్ కరోలినాలో నివశిస్తున్నారు. ర్యాలిష్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ముఖేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య మౌనిక, కూతురు మూడేళ్ల దివిజ కారులో వెళుతుండగా విల్లింగ్‌టన్‌కు 70 మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. వీరు కారు ఒక ట్రాక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముఖేశ్‌తో పాటు కూతురు దివిజ […]

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. భారతీయులు మృతి
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jun 14, 2019 | 3:00 PM

అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన తండ్రీ కుమార్తెలు మృత్యువాత పడ్డారు. కర్ణాటకలోని బీదర్‌కు చెందిన సాఫ్ట్‌వేర్ నిపుణుడు ముఖేశ్ శివాజీవార దేశ్ నార్త్ కరోలినాలో నివశిస్తున్నారు. ర్యాలిష్‌లోని ఓ ఐటీ కంపెనీలో పని చేస్తున్నారు. ముఖేశ్ దేశ్‌ముఖ్, ఆయన భార్య మౌనిక, కూతురు మూడేళ్ల దివిజ కారులో వెళుతుండగా విల్లింగ్‌టన్‌కు 70 మైళ్ల దూరంలో ప్రమాదం చోటుచేసుకుంది. వీరు కారు ఒక ట్రాక్కును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ముఖేశ్‌తో పాటు కూతురు దివిజ అక్కడికక్కడే మరణించారు. మౌనిక తీవ్రంగా గాయపడటంతో ఆస్పత్రికి తరలించారు. ముఖేశ్ ఆయన కూతురి మరణం స్థానిక ప్రవాస భారతీయులను కలిచివేసింది. శుక్రవారం దివిజ మూడో పుట్టినరోజు కావడంతో ఈ ఘటనను తలచుకుని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.