నామ్‌ను చంపిందెవరు..?

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యారు. అయితే ఎలాంటి పురోగతి లేకుండానే అర్థాంతరంగా ఆ చర్చలు ముగిశాయి. ఈ నేపథ్యంలో మూడో సమావేశం కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. ఇదిలా ఉంటే తాజాగా కిమ్ 2017లో తన సోదరుడు నామ్‌ను హత్య చేయించాడని ప్రచారం జరుగుతోంది. నామ్ కిమ్ కంటే పెద్దవాడని.. తన తండ్రికి ఆ దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ […]

నామ్‌ను చంపిందెవరు..?
Follow us
Pardhasaradhi Peri

|

Updated on: Jun 14, 2019 | 4:07 PM

అమెరికా అధ్యక్షుడు ట్రంప్, ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఇప్పటికే రెండు సార్లు భేటీ అయ్యారు. అయితే ఎలాంటి పురోగతి లేకుండానే అర్థాంతరంగా ఆ చర్చలు ముగిశాయి. ఈ నేపథ్యంలో మూడో సమావేశం కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ట్రంప్. ఇదిలా ఉంటే తాజాగా కిమ్ 2017లో తన సోదరుడు నామ్‌ను హత్య చేయించాడని ప్రచారం జరుగుతోంది. నామ్ కిమ్ కంటే పెద్దవాడని.. తన తండ్రికి ఆ దేశ మాజీ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఇల్‌కు నామ్ అంటే ఇష్టమని సమాచారం. కిమ్ కొరియాకు అధ్యక్షుడవుతాడన్న విషయం తెలిసి అజ్నాతంలోకి వెళ్లిపోయిన నామ్.. మకావ్‌లో బస చేశారని తనకు చైనా ఇంటెలిజెన్స్ వర్గాలు ఆర్ధిక సహకారం అందించినట్లు తెలుస్తోంది.

కిమ్ జాంగ్ నామ్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫ్ అమెరికాతో పనిచేసినట్లు సమాచారం. CIAకి నామ్ సమాచారం చేరవేసేవాడని కథనాలు ప్రచురితమయ్యాయి. కిమ్ జాన్ ఉంగ్ చైనాతో చర్చల సందర్భంగా..తన సోదరుడు నామ్ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాలతో పనిచేస్తున్నాడని చెప్పినట్లు కథనాలు వెలువడ్డాయి. కాగా, 2017లో మలేషియాకు వెళ్లిన నామ్.. కౌలాలంపూర్ ఎయిర్ పోర్టులో ఉన్న సమయంలో ఇద్దరు మహిళలు విష ప్రయోగం చేసి హత్య చేశారని కథనాలు ప్రచురించింది జపాన్ పత్రిక అసాహి. ఇక తాజాగా కిమ్ తనకో అందమైన లేఖ రాశారన్న ట్రంప్.. అందులో ఏముందో వెల్లడించలేదు. అది పూర్తిగా వ్యక్తిగతమని చెప్పారు. దీంతో మూడో సమావేశంపై ట్రంప్ వ్యాఖ్యల వెనుక వ్యూహమేంటన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.