Engine Failure: అమెరికాలో గాల్లోనే విమాన ఇంజన్ ఫెయిల్యూర్, నగరంలో పడిన శిథిలాలు, ప్రయాణికులు క్షేమం
అమెరికాలో డెన్వర్ నుంచి హోనోలూలుకు వెళ్తున్న విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానం ఎగురుతుండగా గాల్లోనే హఠాత్తుగా దీని ఇంజన్..
అమెరికాలో డెన్వర్ నుంచి హోనోలూలుకు వెళ్తున్న విమానం తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడింది. విమానం ఎగురుతుండగా గాల్లోనే హఠాత్తుగా దీని ఇంజన్ మండిపోతూ ఫెయిలయింది. ఆ సందర్భంగా ఈ ప్లేన్ నుంచి కొన్ని భాగాలు డెన్వర్ శివార్లలోని బ్రూమ్ ఫీల్డ్ ..లో కింద పడిపోయాయి. ఓ భారీ శిథిలం ఒకరి ఇంటిపై పడడంతో అక్కడ రంధ్రం ఏర్పడింది. అయితే విమానంలోని 231 మంది ప్రయాణికులు, 10 మంది సిబ్బంది క్షేమంగా ఉన్నారు. ఎవరూ గాయపడలేదు. పైలట్ వెంటనే విమానాన్ని తిరిగి డెన్వర్ కి తీసుకువఛ్చి అత్యవసర మరమ్మతులు చేయించాడు. తామిక మరణించినట్టే భావించామని, భయంతో తన భార్య చేతులను తాను గట్టిగా పట్టుకున్నానని డేవిడ్ అనే ప్రయాణికుడు తెలిపాడు. కాగా విమానం నుంచి కింద పడిన శిథిలాలను ఎవరూ ముట్టుకోరాదని, దూరంగా ఉండాలని యూఎస్ ఎయిర్ లైన్స్ అధికారులు హెచ్చరించారు.
Incredible photos and video coming from Colorado where United Airlines flight 328 landed safely at Denver International Airport following engine failure shortly after taking off for Honolulu. pic.twitter.com/E32tFl7lOm
— Bob Inderbitzen NQ1R (@BobInderbitzen) February 20, 2021
Flight UA328 from Denver to Honolulu experienced an engine failure shortly after departure, returned safely to Denver and was met by emergency crews as a precaution. There are no reported injuries onboard. We are in contact with the FAA, NTSB and local law enforcement.
— United Airlines (@united) February 20, 2021
Read More:
కేసులో నన్ను అన్యాయంగా ఇరికించారు, నేరం ‘ఆయనదే’, బెంగాల్ బీజేపీ యువ మోర్చా నేత పమేలా గోస్వామి