ట్రంప్‌కు మరో దెబ్బ..క్షిపణి పరీక్షకు సిద్ధమైన కొరియా

ఎప్పుడూ క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో ఉండే నార్త్‌ కొరియా..రానున్న రోజుల్లో మరో ప్రయోగానికి రెడీ అయింది. యూఎస్‌ తీరాలకు చేరుకోగల ఒక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది‌. కొరియా అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ను ఒప్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని..ఇప్పటికే అభిశంసనకు గురైన ట్రంప్‌కు ఇది మరో ఎదురుదెబ్బని అంటున్నారు. ఈ ఏడాది చివరిలోగా అమెరికాతో ఎటువంటి ఒప్పందం కుదరకపోతే ట్రంప్‌కు క్రిస్మస్‌ కానుక ఇస్తానన్న కిమ్‌..ఆ […]

ట్రంప్‌కు మరో దెబ్బ..క్షిపణి పరీక్షకు సిద్ధమైన కొరియా
Follow us

|

Updated on: Dec 23, 2019 | 8:12 PM

ఎప్పుడూ క్షిపణి ప్రయోగాలతో వార్తల్లో ఉండే నార్త్‌ కొరియా..రానున్న రోజుల్లో మరో ప్రయోగానికి రెడీ అయింది. యూఎస్‌ తీరాలకు చేరుకోగల ఒక ఖండాంతర బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షకు సిద్ధమవుతోంది‌. కొరియా అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఆ దేశాధ్యక్షుడు కిమ్‌ను ఒప్పించడానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయని..ఇప్పటికే అభిశంసనకు గురైన ట్రంప్‌కు ఇది మరో ఎదురుదెబ్బని అంటున్నారు. ఈ ఏడాది చివరిలోగా అమెరికాతో ఎటువంటి ఒప్పందం కుదరకపోతే ట్రంప్‌కు క్రిస్మస్‌ కానుక ఇస్తానన్న కిమ్‌..ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.
తమ దేశం మీద విధించిన ఆంక్షలను గణనీయంగా సడలిస్తూ కొత్త అణస్త్ర నిరాయుధీకరణ ఒప్పందంతో ఈ ఏడాది చివరిలోగా చర్చలకు రావాలని.. లేదంటే తాము ”కొత్త మార్గం” ఎంచుకుంటామని ఉత్తర కొరియా గడువు విధించింది. ఐతే ఉత్తరకొరియాపై ఆంక్షలు తొలగించేందుకు ట్రంప్‌ నిరాకరించారు. దీంతో చర్చల విషయంలో అమెరికా తన వైఖరిని మార్చుకోకపోతే, తాము దీర్ఘ శ్రేణి క్షిపణి పరీక్షలను మళ్లీ మొదలుపెట్టే అవకాశం ఉందని ఇప్పటికే ప్రకటించారు నార్త్‌ కొరియా ఉప విదేశాంగ మంత్రి రి థే సాంగ్. క్రిస్టమస్‌కు ఏ కానుక ఎంచుకోవాలో అమెరికా ఇష్టమన్నారు. ఇందులో భాగంగానే క్షిపణి ప్రయోగాన్ని క్రిస్మస్‌కు ముందు ప్రయోగిస్తామా..లేదంటే న్యూ ఇయర్‌ తర్వాతైనా పరీక్షించొచ్చని తెలిపారు. ఉత్తర కొరియా అణ్వాయుధ కార్యక్రమం అంతర్జాతీయంగా ఆందోళనకు దారి తీస్తున్న నేపథ్యంలో అణ్వాయుధాలకు స్వస్తి చెప్పేలా ఉత్తర కొరియాను ఒప్పించడానికి ట్రంప్‌ ప్రయత్నించారు. ఇందులో భాగంగా గత ఏడాది సింగపూర్‌లో రెండు దేశాల అధినేతలు సమావేశమయ్యారు. అది విఫలమయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్‌లు వియత్నాంలో మళ్లీ చర్చలు జరిపారు. ఆ చర్చలు కూడా ఫలప్రదం కాలేదు.హనోయ్లో ట్రంప్-కిమ్ శిఖరాగ్ర సమావేశం ఎలాంటి ఒప్పందం లేకుండా ముగిసిన అనంతరం ఇరు దేశాల మధ్య దౌత్య పరమైన ఉద్రిక్తతలు నెలకొన్నాయి. అనంతరం ఇరు దేశాల మధ్య ఇప్పటివరకు ఎలాంటి సంప్రదింపులు లేవు.తాజాగా దేశ సైనిక సామర్థ్యాన్ని పెంపొందించే చర్యలపై నిర్ణయం తీసుకోవడానికి ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ కీలక అధికార పార్టీ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ ఏడాది చివరి నాటికి వాషింగ్టన్‌ తన డిమాండ్స్‌ను అంగీకరించకపోతే దౌత్యం నిలిపివేసి సుదూర క్షిపణిని ప్రయోగించడంపై కిమ్‌ అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశం మొత్తం సాయుధ దళాలను పెంచడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలనే అంశంపైనే చర్చించినట్లు సమాచారం.  వేగంగా మారుతున్న పరిస్థితులు, అభివృద్ధి చెందుతున్న కొరియాకు ఇది కీలకమైన సమయమని పేర్కొన్నారు కిమ్‌. దీంతో 2017లో అమెరికాను చేరుకోగల ఆరు అణు పరీక్షలను నిర్వహించిన ఉత్తర కొరియా..మళ్లీ బాలిస్టిక్‌ క్షిపణి పరీక్షకు సిద్ధమైనట్లు తెలుస్తోంది.

కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కుర్ర హీరో సినిమాలో మంచు మనోజ్.. హీరోనా.? విలన్ గానా.?
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
కెన్యాలో కుప్పకూలిన మిలిటరీ హెలికాఫ్టర్‌.. 9 మంది సైనికులు మృతి
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
ఫోన్‌ను మడత పెట్టి.. బెస్ట్‌ ఫోల్డబుల్‌ ఫోన్స్‌పై ఓ లుక్కేయండి..
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
జక్కన్న సినిమా కోసం ఆ విషయంలో శిక్షణ తీసుకుంటున్న మహేష్
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
మర్రి చెట్టు తొర్రలో రూ.64 లక్షల నోట్ల కట్టలు.. ఎలా వచ్చాయంటే?
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
కొండమీదనుంచి కింద పడ్డ ఎన్టీఆర్ హీరోయిన్.. బ్రయిన్ డామేజ్..!
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
వాట్సాప్‌లో ఇంట్రెస్టింగ్‌ ఫీచర్‌.. ఆన్‌లైన్‌లో ఎవరు ఉన్నారో
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
నీట్‌ పీజీ 2024 ఆన్‌లైన్‌ దరఖాస్తులు ప్రారంభం.. పరీక్ష తేదీ ఇదే!
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ప్రారంభమైన తొలిదశ పోలింగ్‌.. పోలింగ్‌ స్టేషన్లకు క్యూ కడుతోన్న..
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
ఇంటర్‌ విద్యార్ధులకు అలర్ట్.. వచ్చే వారంలోనే ఫలితాలు!
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
మూడు రోజులు మాడు పగిలే ఎండలు.. ఆ జిల్లాలకు ఎల్లో అలర్ట్‌
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
పిల్లవాడిని ఫుట్‌రెస్ట్‌పై నిలబెట్టి.. స్కూటీపై ప్రయాణం..
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
తరచూ గొంతులో నొప్పి, జ్వరంగా ఉంటోందా ?? ప్రాణాంతకం కావచ్చు
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
మత్తెక్కిస్తున్న మిల్క్‌ షేక్‌.. స్మగ్లర్లు రూటు మార్చారా ??
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కౌంటర్‌ వద్దకు వెళ్లకుండానే ట్రైన్‌ టికెట్‌.. బుక్‌ చేయడం ఎలా?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
కేవలం రూ.150కే విమాన టికెట్.. ఈ స్కీం గురించి మీకు తెలుసా..?
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
ఆదివారం హైదరాబాద్‌లో మటన్‌ షాపులు బంద్‌
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
దేశ చరిత్రలోనే అతిపెద్ద కుంభవృష్టి.. విమానాలు రద్దు.. ఎక్కడంటే ??
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
పాలపుంతలో అతిపెద్ద బ్లాక్ హోల్.. సూర్యునికన్నా 33 రెట్లు పెద్దగా
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!
ఓవైపు AI, మరోవైపు డ్రై ప్రమోషన్‌..ఉద్యోగులకు అన్నీ కష్టాలే !!