AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షికాగోలో పేలిన తుపాకీ.. 13 మందికి గాయాలు..

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకులు మోత మొగింది. ఆదివారం షికాగాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ ఈవెంట్‌లో భాగంగా యువకుల మధ్య చెలరేగిన వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి.. కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 13మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్లు.. పెట్రోలింగ్ చీఫ్‌.. ఫ్రెడ్‌ వాలర్‌ పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడ్డ […]

షికాగోలో పేలిన తుపాకీ.. 13 మందికి గాయాలు..
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Dec 23, 2019 | 9:51 AM

Share

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి తుపాకులు మోత మొగింది. ఆదివారం షికాగాలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఓ ఈవెంట్‌లో భాగంగా యువకుల మధ్య చెలరేగిన వివాదం.. చిలికిచిలికి గాలివానలా మారి.. కాల్పులకు దారితీసింది. ఈ ఘటనలో 13మందికి గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే గాయపడ్డ వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటన ఆదివారం మధ్యాహ్నం చోటుచేసుకున్నట్లు.. పెట్రోలింగ్ చీఫ్‌.. ఫ్రెడ్‌ వాలర్‌ పేర్కొన్నారు. కాల్పుల్లో గాయపడ్డ వారంతా.. 16 నుంచి 48 మధ్య వయస్సు వారేనని తెలిపారు. కాగా, ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. కాల్పులకు పాల్పడిన వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Follow Us