US Tornadoes: అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడోలు.. దాదాపు 100మందికి పైగా మృత్యువాత!

US Kentucky Tornadoes: అమెరికాలో ఈశాన్య రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సన్ని సృష్టించాయి.. కెంటకీలో దాదాపు వంద మంది వరకూ మృత్యవాత పడ్డారు.

US Tornadoes: అమెరికాలో బీభత్సం సృష్టించిన టోర్నడోలు.. దాదాపు 100మందికి పైగా మృత్యువాత!
Us Tornadoes
Follow us
Balaraju Goud

|

Updated on: Dec 11, 2021 | 6:37 PM

US Tornadoes: అమెరికాలో ఈశాన్య రాష్ట్రాల్లో టోర్నడోలు బీభత్సన్ని సృష్టించాయి.. కెంటకీలో దాదాపు వంద మంది వరకూ మృత్యవాత పడ్డారు. ఈ సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉంది.. వేలాది ఇళ్లు, వ్యాపార సముదాయాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. కెంటకీ చరిత్రలో అత్యంత దుర్భర దినంగా పేర్కొన్న రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బెషీర్‌, అత్యవసర పరిస్థితిని ప్రకటించారు. ఓ క్యాండిల్ ఫ్యాక్టరీలో పైకప్పు కుప్పకూలటంతో భారీగా ప్రాణ నష్టం జరిగినట్లు చెప్పారు. పెద్ద ఎత్తున సహాయక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు..

అమెరికా ఈశాన్య రాష్ట్రాలపై ప్రకృతి పగపట్టింది.. కెంటకీ, ఆర్కాన్సాస్, టెన్నెస్సీ, మిస్సోరి, ఇల్లినాయిస్‌ రాష్ట్రాలపై టోర్నడోలు విరుచుకుపడ్డాయి.. ముఖ్యంగా కెంటకీలో భారీ విధ్వసం సృష్టించాయి టోర్నడోలు.. ఈ భీకర సుడిగాలుల తాడికిడి పెద్ద సంఖ్యలో ఇళ్లు, భవనాలు దెబ్బతిన్నాయి. ఇంటిపైకప్పులు ఎగిరిపోయాయి. చెట్లు పెద్ద సంఖ్యలో నేలకూలాయి.. వాహనాలు కూడా దెబ్బతిన్నాయి.. ఎక్కడ చూసిన బీభత్స వాతావరణం కనిపించింది..

టోర్నడోల ధాటికి కెంటకీలోని గ్రేవ్స్‌ కౌంటీలో అపారనష్టం జరిగింది.. మేఫీల్డ్‌ ప్రాంతంలోని క్యాండిల్‌ ఫ్యాక్టరీ తీవ్రంగా దెబ్బతిన్నది.. ఆ సమయంలో అందులో 100 మంది వరకూ ఉన్నారని సమాచారం. పలు ప్రాంతాల్లో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. 50 వేల మంది ప్రజలు చిమ్మ చీకట్లో కాలం గడుపుతున్నారు.

కెంటకీలో వరుస టోర్నడోలతో వంద మంది వరకూ చనిపోయినట్టు రాష్ట్ర గవర్నర్‌ ఆండీ బెషహర్‌ ప్రకటించారు. కెంటకీ చరిత్రలో ఇలాంటి టోర్నడోలు చూడలేదన్నారు. క్యాండిల్‌ తయారీ ఫ్యాక్టరీ లోనే ఎక్కువ మంది చనిపోయినట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితి విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయ చర్యల కోసం 180 మంది సిబ్బందిని రంగంలోకి దించామని తెలిపారు. పోలీసులు, ప్రభుత్వం ఉద్యోగులు సహాయక చర్యల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. శిథిలాల తొలగింపు కొనసాగుతున్నట్లు చెప్పారు. రాష్ట్రానికి తగిన సాయం అందించాలని ఫెడరల్​ ప్రభుత్వాన్ని కోరారు గవర్నర్‌.

హాప్‌కిన్స్ కౌంటీలో వీచిన గాలుల తీవ్రతకు రైలు పట్టాలు తప్పింది.. దీంతో ఈ టోర్నడోల తీవ్రత ఏ స్థాయిలో ఉందో ఊహించుకోవచ్చు.. ఇల్లినాయ్‌లో అమెజాన్‌ గోడౌన్‌ కూడా టోర్నడోల ధాటికి ధ్వంసమయ్యింది. గోడౌన్‌లో చిక్కుకున్న వాళ్లను సహాయక సిబ్బంది కాపాడారు. 100 మంది వరకు సిబ్బంది అమెజాన్‌ గోడౌన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ టోర్నడోలపై అమెరికా వాతావరణ శాఖ కెంటకీ, ఆర్కాన్సాస్, టెన్నెస్సీ, మిస్సోరి, ఇల్లినాయిస్‌ రాష్ట్రాలను ముందుగానే హెచ్చరించింది.

కెంటనీ చరిత్రలో అత్యంత తీవ్రమైనదిగా ఆ రాష్ట్ర గవర్నర్ అభివర్ణించారు. శుక్రవారం సంభవించిందిన టోర్నడో బీభత్సానికి అధికారులు అలర్ట్ అయ్యారు. రాష్ట్రవ్యాప్తంగా అత్యవసర పరిస్థితిని విధిస్తున్నట్లు ప్రకటించారు. సహాయక చర్యల కోసం సిబ్బంది రంగంలోకి దిగారు. కెంటకీలో సుమారు 180 మంది సహాయక చర్యలను చేపడుతున్నారు.