Guinness World Records: గిన్నిస్ బుక్ ఎక్కిన అతిపెద్ద మ్యాజిక్ క్యూబ్..ఎక్కడ ఎలా తయారు చేశారో తెలుసా?

Guinness World Records: ప్రపంచం నలుమూలలా ఎప్పుడూ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో పేరు చూసుకోవాలని ఎంతో మంది ఔత్సాహికులు ఎదో ఒక ప్రయత్నం చేస్తుంటారు.

Guinness World Records: గిన్నిస్ బుక్ ఎక్కిన అతిపెద్ద మ్యాజిక్ క్యూబ్..ఎక్కడ ఎలా తయారు చేశారో తెలుసా?
Guinness World Records Rubik's Cube
Follow us

|

Updated on: Jun 24, 2021 | 5:13 PM

Guinness World Records: ప్రపంచం నలుమూలలా ఎప్పుడూ గిన్నిస్ వరల్డ్ రికార్డుల్లో పేరు చూసుకోవాలని ఎంతో మంది ఔత్సాహికులు ఎదో ఒక ప్రయత్నం చేస్తుంటారు. చాలామంది అదే లక్ష్యంగా నిరంతరం కష్టపడతారు. ఒక్కోసారి దానికోసం చాలా రిస్క్ కూడా చేస్తారు. గిన్నిస్ బుక్ కు ఉన్న క్రేజ్ అటువంటిది. ప్రపంచంలో గొప్పవారిగా నిలబడాలి.. తమ పేరు ప్రపంచంలో ముఖ్యమైనదిగా ఉండాలి అనేదే ఇటువంటి వారి కోరికగా ఉంటుంది. ఈ గిన్నిస్ రికార్డుల కోసం కొంతమంది ప్రాణాల మీదకు తెచ్చుకునే సాహసాలను ఎన్నుకుంటారు. కొంతమంది తమ బుర్రకు పదును చెప్పి ప్రజలతో ఆహా అనిపించుకునేలా ఏదైనా ఆవిష్కరించాలని ప్రయత్నిస్తుంటారు. గిన్నిస్ బుక్ వాళ్ళు అందరికీ అవకాశం ఇస్తారు. ఎవరు ఏ రంగంలో ఎటువంటి పని చేసినా సరే, అది చక్కనిది.. ఇంతకు ముందు ప్రపంచంలో ఎవరూ ఆ స్థాయికి చేరుకోనిదీ అయితే, వెంటనే రికార్డుల్లోకి ఎక్కించేసి భుజం తడుతుంది. ఇదిగో ఇప్పుడు అలాంటి రికార్డ్ గురించి చెప్పబోతున్నాం.

మీకు మ్యాజిక్ క్యూబ్ (రూబిక్స్ క్యూబ్) తెలుసు కదా. రంగు రంగుల చదరాలు ఒక క్యూబ్ లో సెట్ చేసి ఉంటాయి. ఆ క్యూబ్ ముఖాలు ఒకే రంగులో కనబడేలా ఆ చదరాలను సర్దాలి. ఇది చాలా ఫేమస్. స్ట్రెస్ రిలీఫ్ కోసం ఈ మ్యాజిక్ క్యూబ్ చాలామంది ఉపయోగిస్తారు. అది మన చేతిలో పట్టేంత ఉంటుంది. అయితే, ఈ మ్యాజిక్ క్యూబ్ ను ప్రపంచంలో ఎక్కడా లేనంత పెద్దగా తయారు చేశారు కొందరు. దీంతో ఆ అతిపెద్ద మ్యాజిక్ క్యూబ్ గిన్నిస్ బుక్ లోకి ఎక్కింది. ప్రతిసారీ, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ (జిడబ్ల్యుఆర్) తన అధికారిక సోషల్ మీడియా ఖాతాలలో వేర్వేరు రికార్డ్ సృష్టించే వీడియోలను పంచుకుంటుంది. అందులో భాగంగా ఈ పెద్ద మ్యాజిక్ క్యూబ్ ను పరిచయం చేశారు. ఈ మ్యాజిక్ క్యూబ్ ను ఎలా తయారు చేశారో ఓ వీడియో విడుదల చేశారు. అది ఇక్కడ మీరు చూడొచ్చు..

ఈ అతిపెద్ద రూబిక్స్ క్యూబ్ 2.503 మీ x 2.505 మీ x 2.502 మీ. కొలతలతో ఉంది. దీనిని మార్చి 28, 2021 న చైనాలోని హాంకాంగ్ SAR లో నినా మాల్ తయారు చేసింది అని గిన్నిస్ బుక్ పేర్కొంది. ఈ వీడియోను ఫేస్‌బుక్‌లో గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ పోస్ట్ చేసింది. పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఈ క్లిప్ అన్ని రకాలుగా వైరల్ అయ్యింది. దాదాపు 2.7 మిలియన్ మంది ఈ వీడియోను ఇప్పటివరకూ చూశారు. ఇంకా చూస్తూనే ఉన్నారు.

Also Read: World Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం.. పనిచేసేవారు లేక కష్టాలు పడుతోంది!

Viral Video: ఒకే చొక్కాతో ఏకంగా 264 జూమ్ మీటింగ్స్..ఎవరూ గమనించలేదంటే నమ్మగలరా? ఈ వైరల్ వీడియో చూడండి..