World Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం.. పనిచేసేవారు లేక కష్టాలు పడుతోంది!

World Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ ను చెబుతారు. ఈ దేశం ఉత్తమ జీవన ప్రమాణాలు, సౌకర్యాలు, అత్యుత్తమ వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది.

World Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశం.. పనిచేసేవారు లేక కష్టాలు పడుతోంది!
Worlds Happiest Country
Follow us

|

Updated on: Jun 24, 2021 | 1:45 PM

World Happiest Country: ప్రపంచంలో అత్యంత సంతోషకరమైన దేశంగా ఫిన్లాండ్ ను చెబుతారు. ఈ దేశం ఉత్తమ జీవన ప్రమాణాలు, సౌకర్యాలు, అత్యుత్తమ వ్యవస్థలకు ప్రసిద్ధి చెందింది. సంతోషంగా లేనివారు ఇక్కడ ఒక్కరు కూడా లేరని ఎన్నో సర్వేలు చెబుతున్నాయి. అటువంటి సంతోషకరమైన ప్రజలు ఉన్న ఫిన్లాండ్ ప్రస్తుతం ఒక విషయం గురించి ఆందోళన చెందుతోంది. అదే ఆదేశ వృద్ధ జనాభా. దీని కారణంగా ఫిన్లాండ్ కార్మికుల కొరతతో పోరాడుతోంది. ఇక్కడ చాలా సంస్థల్లో పనిచేయడానికి ఉద్యోగులే దొరకడం లేదట. అంతేకాదు.. ప్రభుత్వ ఉద్యోగాలూ చాలా వరకూ ఖాళీగా ఉండిపోయాయట. అటువంటి ఇబ్బందికర పరిస్థితుల్లో, ఇతర దేశాల ప్రజలు ఇక్కడకు వచ్చి స్థిరపడాలని ఫిన్లాండ్ కోరుకుంటోంది.

ఫిన్లాండ్ అకాడమీలో పరిశోధనా సహచరుడు చార్లెస్ మాథీస్ ఇలా అంటున్నారు.. “వ్యాపారం, ప్రభుత్వం చాలా సంవత్సరాల నిష్క్రియాత్మకత తరువాత ఫిన్లాండ్ పరిస్థితి ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. ఇక్కడి జనాభా చాలావరకూ వృద్ధులు. దీంతో పరిస్థితిని మార్చలేకపోతున్నాం. మాకు యువ ప్రజలు కావాలి.” టాలెంటెడ్ సొల్యూషన్స్ రిక్రూటర్ సాకు టిహ్వెరెన్ మాట్లాడుతూ ”దేశంలో మాకు పెద్ద సంఖ్యలో ప్రజలు అవసరం. వృద్ధాప్య జనాభాను కవర్ చేయడానికి, భర్తీ చేయడానికి మాకు యువత అవసరం.” అన్నారు. అయితే, ఇక్కడ పని చేయాలంటే పని చాలా తేలికగా దొరుకుతుంది అని అక్కడికి వలస వచ్చిన వారు చెబుతున్నారు. కానీ, ఇక్కడ ఉన్న నిబంధనల వల్ల ఎవరూ ఇక్కడికి రావడానికి ఇష్టపడటం లేదని హేలిన్స్కి మేయర్ జాన్ వాపావురి అంటున్నారు. ఎందుకంటే, ఇక్కడకు ఏ దేశం నుంచి వచ్చినవారైనా నివాసం ఉండవచ్చు. తమ దేశంలో సంతోషంగా పనిచేసుకుంటూ కాలం గడపవచ్చు. అయితే, ఇక్కడకు ఉద్యోగం కోసం వచ్చేవారు ఒంటరిగా రావాల్సి ఉంటుంది. జంటగా వచ్చేవారికి ఇక్కడ ఉద్యోగాలు దొరకవు అంటున్నారు. ఈ కారణంగా ప్రజలు ఫిన్లాండ్ లో ష్టిరపడటానికి ఇష్టపడరు.

ఇక్కడ 2013 లో 8 మందిలో 5 మంది స్పానిష్ నర్సులను వాసా నగరంలో నియమించారు. కొన్ని నెలల తరువాత ద్రవ్యోల్బణం, శీతల వాతావరణం, అక్కడి భాష సమస్యలను చూపిస్తూ త్వరలోనే ఉద్యోగం, దేశం వదిలి వెళ్ళిపోయారు. ఇటువంటి ఉదంతాలు చాలానే ఉన్నాయి. అందుకే ఈ దేశంలో పని చేయడానికి వెళ్ళే వారు తగ్గిపోయారు. ఇన్ని ఇబ్బందుల మధ్య ఈ సంతోషకర దేశంలో ఉద్యోగం చేయడానికి ఎవరు ముందుకొస్తారో? కానీ, ఫిన్లాండ్ మాత్రం దేశంతో సంబంధం లేకుండా తమ దేశంలో స్థిరమైన ఉద్యోగం చేయడం కోసం ఆహ్వానం పలుకుతోంది.

వరుసగా నాలుగేళ్ళుగా..

‘వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్’లో ఫిన్లాండ్ వరుసగా నాలుగోసారి మొదటి స్థానంలో నిలిచింది. అయితే, ఐక్యరాజ్యసమితి ప్రకారం, ఫిన్లాండ్‌లో పనిచేసే ప్రతి 100 మంది పనివారిలో 39.2% మంది 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు గలవారు. వృద్ధుల జనాభాలో ఫిన్లాండ్ జపాన్ తరువాత రెండవ స్థానంలో ఉంది. 2030 నాటికి వృద్ధాప్య ఆధారపడటం నిష్పత్తి 47.5 కి పెరుగుతుంది.

Also Read: Strawberry Moon 2021: అందాల చందమామ స్ట్రాబెర్రీ మూన్ గా కనువిందు చేసేది ఈరోజే.. మన దేశంలో ఎప్పుడు ఎలా కనిపిస్తుంది

Indian Driving License: భారతీయ డ్రైవింగ్‌ లైసెన్స్‌ చెల్లుబాటు అయ్యే దేశాలు ఏంటో తెలుసా..? ఆ నిబంధనలు తప్పనిసరి