పొడవులో రెండడుగుల వ్యత్యాసం… గిన్నెస్ బుక్ రికార్డులకెక్కిన అరుదైన జంట…

తమ మధ్య పొట్టి..పొడవు వ్యత్యాసం ఉన్నా ఆ జంట వెనుకంజ వేయలేదు. తమ పొడవులోని తేడాను పట్టించుకోకుండా ధైర్యంగా పెళ్లి చేసుకున్నారు..

  • Publish Date - 5:43 pm, Thu, 24 June 21 Edited By: Phani CH
పొడవులో రెండడుగుల వ్యత్యాసం... గిన్నెస్ బుక్ రికార్డులకెక్కిన  అరుదైన జంట...
Couple With Height Differen

తమ మధ్య పొట్టి..పొడవు వ్యత్యాసం ఉన్నా ఆ జంట వెనుకంజ వేయలేదు. తమ పొడవులోని తేడాను పట్టించుకోకుండా ధైర్యంగా పెళ్లి చేసుకున్నారు.. ఈ సమాజానికి అసలు భయపడలేదు. బ్రిటన్ లోని ఈ జంట విషయానికి వస్తే..జేమ్స్ అనే వ్యక్తి ఎత్తు మూడు అడుగుల ఏడు అంగుళాలు మాత్రమే.. అతని భార్య క్లో లస్టెడ్ పొడవు 5 అడుగుల 4 అంగుళాలు… అంటే వీరి ఎత్తు మధ్య తేడా సుమారు 2 అడుగులు ఉంది.. ఇలా హైట్ మధ్య ఎక్కువ తేడా ఉన్న భార్యాభర్తల జంట ఎక్కడైనా ఉందా అని ప్రపంచ గిన్నెస్ బుక్ రికార్డుల వారు ఆరా తీస్తే ఈ జంట విషయం తెలిసింది. వెంటనే జూన్ 2 న తమ రికార్డుల్లో వీరి పేర్లను వారు చేర్చేశారు. ఎముకలపై ప్రభావం చూపే అరుదైన డయాస్ట్రోసిక్ డిస్ ప్లేసియా అనే రుగ్మతతో బాధ పడుతున్న జేమ్స్ ఇంతకు మించి ఎత్తు పెరగలేకపోయాడు. తను పొట్టిగా ఉన్నా చింత లేదని, తాను ప్రతిదాన్నీ డిఫరెంట్ గా చేయగలనని ఆయన అంటున్నాడు. ప్రతివారిలాగే తానూ ఉండాలనుకుంటున్నానని చెప్పాడు. ఇక క్లో …మొదట తనకన్నా ఎత్తుగా ఉన్న వ్యక్తిని పెళ్లి చేసుకోవాలనుకున్నానని, కానీ 2012 లో జేమ్స్ తనను కలిసిన అనంతరం తన అభిప్రాయాలు మారిపోయాయని చెప్పింది.

2014 లో జేమ్స్ తనకు ప్రపోజ్ చేశాడని, అందుకు తాను అంగీకరించానని ఆమె వెల్లడించింది. కొంతమంది తమ జంటను చూసి హేళన చేశారని..కానీ తాము పట్టించుకోలేదని పేర్కొంది. వీరి వెడ్డింగ్ జరిగి ఇప్పటికి ఐదేళ్లు అయ్యాయి. ఈ జంటకు రెండేళ్ల కూతురు ఒలీవియా ఉంది.. ఆమెను అల్లారుముద్దుగా చూసుకుంటున్నారు.

 

మరిన్ని ఇక్కడ చూడండి: AP Corona Cases: ఆంధ్రప్రదేశ్‌లో తగ్గిన కరోనా కేసులు.. తాజాగా 4,981 పాజిటివ్ కేసులు నమోదు..

Viral Photo: ‘ఫొటో ఆఫ్ ది డే’ అంటూ అభిమానుల కామెంట్లు.. కోహ్లీ భుజంపై వాలిన కివీస్ కెప్టెన్! వైరలవుతోన్న ఫొటో

Click on your DTH Provider to Add TV9 Telugu