Usha Chilukuri Vance: అమెరికా ఉపాధ్యక్ష రేసులో ఉషాపతి.. రిపబ్లికన్ పార్టీ నుంచి ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఆంధ్రా అల్లుడు..!
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైంది. మిల్వాకీలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. మరోసారి తమ పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరును అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు.
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ పేరు ఖరారైంది. మిల్వాకీలో సోమవారం జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి ఏకగ్రీవంగా ఆమోదించారు. మరోసారి తమ పార్టీ తరుఫున అధ్యక్ష అభ్యర్థిగా ట్రంప్ పేరును అధికారికంగా ప్రకటించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహాయో సెనేటర్ జె.డి.వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. మిడిల్‌టన్‌లో జన్మించిన జె.డి.వాన్స్ మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలందించారు. అనంతరం అనూహ్యంగా రాజకీయంగా ట్రంప్‌నకు దగ్గరయ్యారు.
39 ఏళ్ల వాన్స్ తండ్రి చిన్నప్పుడే వారిని వదిలి వెళ్లిపోయారు. తల్లి మాదకద్రవ్యాలకు బానిసయ్యారు. దీంతో వాన్స్ తన తాతయ్య పెరిగి అంచెలంచెలుగా ఎదిగారు. ఒహాయో స్టేట్ యూనివర్సిటీ, యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. యేల్ లా జర్నల్‌కు సంపాదకుడిగా కూడా కొనసాగుతున్నారు. ఆయన రచించిన ‘హిల్‌బిల్లీ ఎలెజీ’ పుస్తకం అత్యధికంగా పాపులారిటీ తెచ్చిపెట్టింది. ఈ కథనం ఆధారంగా సినిమాగా కూడా రూపొందింది. సాంకేతికత, ఆర్థిక రంగాల్లో ఆయన విజయవంతమైన వ్యాపారవేత్త ఎదిగారు. 2022లో అమెరికా సెనేట్‌కు ఎన్నికైన వాన్స్, మొదట్లో ట్రంప్ విధానాలను విమర్శిస్తూ వచ్చి చివరకు ఆయనకే విధేయుడిగా మారారు.
జేడీ వాన్స్ సతీమణి భారత సంతతికి చెందిన వ్యక్తి కావడం విశేషం. ఆమె పేరు ఉషా చిలుకూరి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఆమె తల్లిదండ్రులు అమెరికాలోని శాన్ డియాగోలో స్థిరపడ్డారు. ఉషా చిలుకూరి యేల్ వర్సిటీ నుంచి హిస్టరీలో బ్యాచిలర్ డిగ్రీ పొందారు. కేంబ్రిడ్జి వర్సిటీ నుంచి ఫిలాసఫీలో మాస్టర్స్ పూర్తి చేశారు. న్యాయ సంబంధమైన విబాగాల్లో సుదీర్ఘంగా పని చేసిన అనుభవం ఆమె సొంతం. 2014లో ఆమె డెమోక్రాటిక్ పార్టీ కార్యకర్తగా తన పేరును నమోదు చేసుకోవటం విశేషం. యేల్ లా స్కూల్ లోనే జేడీ వేన్స్‌ను ఉషా తొలిసారి కలిశారు. ఆ తర్వాత వారి పరిచయం ప్రేమగా మారింది. చివరకు 2014లో కెంటకీలో వారు పెళ్లి చేసుకున్నారు. వీరి వివాహం హిందూ సంప్రదాయంలో జరిగింది. వారికి ముగ్గురు పిల్లలు.. అయితే అప్పటివరకు డెమొక్రాట్లకు సపోర్ట్ చేస్తూ వచ్చిన ఉషా.. పెళ్లి తరువాత రిపబ్లిక్ పార్టీలో జాయిన్ అయ్యారు. తన ఎదుగుదలలో ఉషా పాత్ర ఎనలేనిదని వేన్స్ పలు ఇంటర్వ్యూల్లో చెప్పారు.
మెరైన్ విభాగంలో అమెరికాకు సేవలు అందించిన జేడీ వేన్స్ ఒహాయో స్టేట్ వర్సిటీ.. యేల్ లా విశ్వవిద్యాలయం నుంచి పట్టభద్రుడయ్యారు. అంతేకాదు.. యేల్ లా జర్నల్ కు ఎడిటర్ గా వ్యవహరించారు. జేడీ వేన్స్ మంచి రచయిత కూడా.. ఆయన ఫ్యామిలీ రిలేషన్స్‌పై రాసిన పుస్తకం అమెరికాలో బాగా పాపులర్ అయ్యింది. కుటుంబవిలువలు, సంస్కృతిలో వస్తున్న సంక్షోభంపై “హిల్‌బిల్లీ ఎలెజీ” అనే పుస్తకాన్ని ఆయన రాశారు. 2020లో ఇది ఇంటర్నేషనల్‌గా బెస్ట్ సెల్లర్‌గా నిలిచింది. ప్రస్తుతం యూఎస్‌లో హాట్ టాపిక్‌గా మారిపోయారు ఉషా చిలుకూరి.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…