అంగారక గ్రహంపై ఒకప్పుడు మానవులు జీవించారా ? టిక్ టాక్ థియరీ కొత్త కథనం ! నమ్మాలా ?
అరుణ గ్రహంపై ఒకప్పుడు మానవులు జీవించారా ? ఆ తరువాత అణు యుధ్ధం జరిగి అంతమై పోయారా ? ఓ టిక్ టాక్ యూజర్ మాత్రం నిజమేనంటున్నాడు. వరుసగా జరిగిన పరిణామాలు ఈ గ్రహం మీద...
అరుణ గ్రహంపై ఒకప్పుడు మానవులు జీవించారా ? ఆ తరువాత అణు యుధ్ధం జరిగి అంతమై పోయారా ? ఓ టిక్ టాక్ యూజర్ మాత్రం నిజమేనంటున్నాడు. వరుసగా జరిగిన పరిణామాలు ఈ గ్రహం మీద న్యూక్లియర్ వార్ కి దారి తీశాయని, ఫలితంగా ఇది అరుణ వర్ణం (ఎర్రని) గ్రహంగా మారిందని అంటూ ఆ యూజర్ రూపొందించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘క్రాక్ హెడ్ జో డర్ట్ అని తనను’ చమత్కారంగా తాను చెప్పుకున్న ఆ యూజర్ దీన్ని ఓ కాన్స్పిరేసీ థియరీగా వ్యవహరించాడు. అరుణ గ్రహం ఎర్రగా మారిందంటే అందుకు ఇదే కారణమంటున్నారు. కొన్ని కోట్ల సంవత్సరాల తరువాత ఇది తన రంగును మార్చుకుందన్నది ఆయన వాదన. ఇలాగే ఇన్నేసి సంవత్సరాల క్రితం ఈ ప్లానెట్ లో నీటి జాడలు, సహజ వనరులు ఉండేవని, ఇందుకు సాక్ష్యాధారాలు ఉన్నాయని శాస్త్రజ్ఞులు ఈ మధ్య ప్రకటించారు కూడా. అంగారక గ్రహం మొదట్లో మామూలుగా ఉండేదని, కానీ ఆ తరువాతే ఈ విధంగా మారిందని ఈ యూజర్ పేర్కొన్నాడు.
అయితే ఇది ఎరుపు రంగును సంతరించుకోవడానికి కారణం న్యూక్లియర్ వేస్ట్ కాదని, దీని ఉపరితలంపై ఐరన్ ఆక్సైడ్ రస్ట్ పేరుకుపోవడమేనని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. గాలితో కలిసి ఈ రస్ట్ పరమాణువులు వాతావరణంలో ఎగిరిపోయాయని రీసెర్చర్లు అంటున్నారు. ఈ ప్లానెట్ పై కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మానవ ఆవాసాలు ఉండేవనడానికి ఆధారాలు లేవని వారు పేర్కొంటున్నారు. అరుణ గ్రహం చాలా చిన్నదని, గురుత్వాకర్షణ శక్తి తక్కువని నాసా పరిశోధకులు స్పష్టం చేస్తున్నారు. టిక్ టాక్ థియరీలు ఊహాజనితాలని వారు అభిప్రాయపడ్డారు. అయితే ఈ యూజర్ రూపొందించిన వీడియో మాత్రం హాట్ హాట్ గా హల్చల్ చేస్తోంది. మార్స్ గురించి ఎవరు, ఎన్ని థియరీలు చెప్పినా అవి ఎప్పటికప్పుడు కొత్తగా ఉంటాయని నెటిజన్లు సైతం పేర్కొంటున్నారు. మరిన్ని చదవండి ఇక్కడ :సూపర్ మార్కెట్ లో చిలిపిదొంగ..పట్టపగలు అందరూ చూస్తుండగానే దొంగతనం..వైరల్ అవుతున్న వీడియో..:Bird thief video.