Watch Video: ఇంట్లో ఒక్కసారిగా పేలిన బాంబు.. ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు
అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. పిట్స్‌బర్గ్‌లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చనిపోయినవారిలో నలుగురు యువకులతో పాటు ఓ చిన్నారి కూడా ప్రస్తుతం ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పిట్స్‌బర్గ్‌లో మధ్యాహ్నం సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో పేలుడు అకస్మాత్తుగా జరగడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది.

అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. పిట్స్‌బర్గ్‌లోని ఓ ఇంట్లో భారీ పేలుడు సంభవించడం కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. చనిపోయినవారిలో నలుగురు యువకులతో పాటు ఓ చిన్నారి కూడా ప్రస్తుతం ఈ పేలుడుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. పిట్స్‌బర్గ్‌లో మధ్యాహ్నం సమయంలో ఈ భారీ పేలుడు సంభవించింది. ఓ ఇంట్లో పేలుడు అకస్మాత్తుగా జరగడం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. ఈ ప్రమాదం సమయంలో పక్కనే ఉన్నటువంటి నలుగురు యువరుకులతో పాటు ఓ చిన్నారి మంట్లలో కాలిపోయి మృతి చెందారు. ఈ బాంబు పేలుడు సంభవించినప్పుడు ఇంటి శిథిలాలు కూడా ఆకాశంలో చాలావరకు ఎగిరిపడ్డాయి. ఇక్కడ మరో విషయం ఏంటంటే పేలుడు జరిగినటువంటి ఇంటికి పక్కనే ఉన్న మూడు ఇళ్లు కూడా పాక్షికంగా దెబ్బతిన్నాయి.
మరో విషయం ఏంటంటే ఈ భారీ పెలుడు జరిగిన ప్రదేశంలో ఉన్నటువంటి మరో ముగ్గరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిని అక్కడి స్థానికులు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరికి అక్కడ చికిత్స కొనసాగుతోంది. అయితే గాయపడినవారిలో ఒకరి పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కసారిగా పేలుడు జరగడంతో అక్కడున్న స్థానికులు భయబ్రాంతులకు గురయ్యారు. పెద్దఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ఘటనపై పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో పోలీసులు ఘటనాస్థలానికి వెంటనే చేరుకున్నారు. ఆ తర్వాత సహాయక చర్యలు చేపట్టారు. అయితే ఆ ఇంట్లో అసలు బాంబు ఎందుకు పేలింది, ఎవరూ పెట్టారు అనే విషయాలు ఇంకా తెలియదని పోలీసులు తెలిపారు. దీనివెనుక ఏదైన ఉగ్రవాద కుట్ర ఉందా లేక మరైదైనా ఉందా అని అక్కడి వారు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.




Four Adults And A Child Have Passed Following A House Explosion In Pennsylvania. Three People From Surrounding Homes Were Rushed To Hospitals, One Of Which Is Currently In Critical Condition. 😳🤯 pic.twitter.com/LYyw5QZDDD
— 🚘BrutalCams🎥 (@BrutalCams) August 15, 2023
ఇదిలా ఉండగా ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించి విషయంపై దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. అయితే ఈ భారీ పేలుడుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిపోతుంది. నెటీజన్లు విభిన్న రీతిలో తమ కామెంట్లు చేస్తున్నారు. ఆ వీడియోను చూస్తేనే ఒళ్లు జలదరించేలా ఉంటుంది. ఇక వీడియోను గమిస్తే ప్రశాంతంగా ఉన్నటువంటి ప్రాంతంలో ఓ ఇంట్లో సారిగా భారీ బాంబు పేలుడు జరుగుతుంది. దీంతో ఆ ఇంట్లోని శిథిలాలు చాలాఎత్తువరకు ఎగిసిపడ్డాయి. పెద్ద ఎత్తున మంటలు చెలరేగడంతో పోలీసులు, సహాయక బృందాలు ఘటనాస్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అయితే ఈ బాంబు ఎవరు పెట్టారనేదానిపై ఇంకా స్పష్టత రాలేదని త్వరలోనే నిందితులను పట్టుకుంటామని పోలీసులు పేర్కొన్నారు.
