Bryan Johnson: వందల కోట్లున్నాయి.. అయినా భాగస్వామి దొరకడం అతనికి కష్టంగా మారింది
45 సంవత్సరాలు దాటినా కూడా అసలు వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండేందుకు ఓ సంపన్నుడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయం ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందినటువంటి బ్రియాన్ జాన్సన్.. 18 ఏళ్ల యువకుడిలా కనిపించడం కోసం ప్రతి సంవత్సరం దాదాపు 16 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడు. దీంతో అతను చేస్తున్న వినూత్న ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అయితే ఇప్పుడు ఆయనకు మరో చిక్కు పడింది.

45 సంవత్సరాలు దాటినా కూడా అసలు వృద్ధాప్య ఛాయలు కనిపించకుండా ఉండేందుకు ఓ సంపన్నుడు కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్న విషయం ఇటీవల వార్తల్లో నిలిచిన విషయం తెలిసిందే. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందినటువంటి బ్రియాన్ జాన్సన్.. 18 ఏళ్ల యువకుడిలా కనిపించడం కోసం ప్రతి సంవత్సరం దాదాపు 16 కోట్ల రూపాయల వరకు ఖర్చు పెడుతున్నాడు. దీంతో అతను చేస్తున్న వినూత్న ప్రయత్నం ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. అయితే ఇప్పుడు ఆయనకు మరో చిక్కు పడింది. ఇంతవరకు ఎలా ఉన్నా కూడా.. బ్రియాన్ జాన్సన్‌కు ఒక భాగస్వామి దొరకడం కష్టంగా మారిందట. ప్రస్తుతం ఆయన పెట్టిన షరతులను చూసి ఏ ఒక్కరు కూడా ఆయనతో కలిసి ఉండేందుకు ముందుకు రావడం లేదట. ఇటీవలే బ్రియాన్ ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో తన అనుభవాలను పంచుకున్నాడు. ప్రస్తుతం ఒంటరిగానే ఉన్నానని భాగస్వామం దొరకడం కష్టతరమైన విషయం వాస్తవమేనని ఒప్పుకున్నాడు.
అయితే రాత్రి 8,30 గంటల సమయానికే పడుకోవడం.. మళ్లీ ఉదయం 6 గంటల నుంచి 11 గంటల లోపు కేవలం 2250 కెలోరీలనిచ్చే ఆహార పదార్థాలను మాత్రమే తినడం.. అలాగే ఏకాగ్రత కోసం సుమారు 4 నుంచి 5 గంటల వరకు కేటాయించడం వంటివి తన దినచర్యలో భాగమని అన్నాడు. తాను ఇంకా ఒంటరినేనని.. డేటింగ్ చేసేందుకు ప్రయత్నించేటప్పుడు ముందుగా నేను తయారుచేసుకున్న ఓ జాబితాను వారి ముందు పెడతానని చెప్పాడు. కానీ వాటిని చూసి అసలు నాకు భాగస్వామి దొరకడం అసాధ్యమని అనిపిస్తోందని పేర్కొన్నాడు. ఒకవేళ భాగస్వామి దొరికినా కూడా తనకు దూరంగానే ఉంటానని బ్రియాన్ చెప్పాడు. అందుకు గల కారణాలకు కూడా అతడు వివరించాడు. తాను ముడుచుకొని పడుకోవడం అలవాటు చేసుకున్నానని అన్నాడు. కానీ భాగస్వామి ఉన్నప్పుడు అలా ఉండలేమని చెప్పాడు.
అలాగే ఇప్పటివరకు మద్యం సేవించే అలవాటు ఉండేదని.. అయినా కూడా వాటిని తాగడం వల్ల అదనపు కెలోరీలు వస్తున్నాయని దూరంగా ఉంటున్నానని చెప్పాడు. అంతేకాదు రోజుకు దాదాపు 111 వరకు టాబ్లెట్లు వేసుకుంటానని అన్నాడు. ఇదిలా ఉండగా వయసు మీద పడుతున్నా కూడా యవ్వనంగా ఉండాలనే ఉద్దేశంతో బ్రియాన్ జాన్సన్ ప్రస్తుతం ప్రత్యేక వైద్య చికిత్స తీసుకుంటున్నాడు. ఇందుకోసం ప్రతి ఏడాది దాదాపు 16 కోట్ల వరకు ఖర్చు పెట్టడం గమనార్హం. 18 ఏళ్ల వయసులో తాను ఎలా కనిపించేవాడో తిరిగి ఇప్పుడు ఆ రూపాన్ని తెచ్చుకునేందుకు అనేక ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇందుకోసం ఓ వైద్యుల బృందం అతనికి ప్రత్యేకంగా చికిత్స అందిస్తోంది. శరీర దారుఢ్యం, ఊపిరితిత్తుల సామర్థ్యం, గుండె పని తీరు, చర్మం నిగారింపు వంటివి యుక్త వయస్సులో ఉన్న వ్యక్తిలో ఉండేలా కనిపిస్తున్నట్లు బ్రియాన్ చెప్పడం మరో విశేషం.



