Airline: ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో పడుకుని దిగనని మారం! ఆ తర్వాత జరిగిందిదే

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒకప్పుడు మనుషులకు అసాధ్యం అనిపించినవి ఇప్పుడు సాధ్యమయ్యాయి. అందుకు అతిపెద్ద ఉదాహరణ విమానం..! చాలా మంది ప్రజలు కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచ నలుమూలలా చుట్టేసి వస్తున్నారు. ఈ కారణంగానే ప్రతి ఒక్కరికీ ఈ రవాణా సులువై పోయింది. అయినప్పటికీ ప్రయాణాలలో ఎక్కువ సమయం వృధా చేయడానికి చాలా మంది పెద్దగా ఆసక్తి చూపరు. ప్రయాణ సమయాన్ని..

Airline: ఎయిర్‌లైన్‌ విమానంలో మహిళ వింత ప్రవర్తన.. లగేజీ లాకర్లో పడుకుని దిగనని మారం! ఆ తర్వాత జరిగిందిదే
US Woman Climbs Into Overhead Bin Of Plane
Follow us
Srilakshmi C

|

Updated on: May 10, 2024 | 7:56 PM

సైన్స్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే.. ఒకప్పుడు మనుషులకు అసాధ్యం అనిపించినవి ఇప్పుడు సాధ్యమయ్యాయి. అందుకు అతిపెద్ద ఉదాహరణ విమానం..! చాలా మంది ప్రజలు కొన్ని గంటల వ్యవధిలోనే ప్రపంచ నలుమూలలా చుట్టేసి వస్తున్నారు. ఈ కారణంగానే ప్రతి ఒక్కరికీ ఈ రవాణా సులువై పోయింది. అయినప్పటికీ ప్రయాణాలలో ఎక్కువ సమయం వృధా చేయడానికి చాలా మంది పెద్దగా ఆసక్తి చూపరు. ప్రయాణ సమయాన్ని వృధాగ గడిపే బదులు కమ్మగా ఓ కునుకు తీద్దాం అని ఓ ప్రయాణికురాలు భావించి చేయకూడని పని చేసి అందరితో చావాట్లు పడింది. అసలేం జరిగిందంటే..
సౌత్‌వెస్ట్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానంలో ఓ యూఎస్‌ మహిళ కూడా ఎక్కింది. అయితే అందరూ తమ సీట్లలో కూర్చుంటుంటే.. ఆమె మాత్రం విమానంలోని ఓవర్‌హెడ్ లగేజీ లాకర్‌లోకి ఎక్కి ఎంచక్కా పడుకుంది. అందులోనే నిద్ర పోతానని మొండిపట్టు పట్టింది. రైలు బెర్త్ లాగా పడుకుని కిందకు దిగడానికి ససేమిరా అనసాగింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే విమానం లగేజీ లాకర్‌ పడుకున్న మహిళ ప్రయాణీకురా లేదా విమాన సిబ్బందా? అనే విషయం ఇంకా స్పష్టంగా తెలియరాలేదు. అసలామే సామాను కంపార్ట్‌మెంట్‌లో ఎందుకు పడుకోవాలని నిర్ణయించుకుంది అనే విషయం కూడా వెల్లడించలేదు. అయితే సదరు మహిళ చేసిన పనికి అక్కడ ఉన్న ఇతర ప్రయాణికులందరూ చూసి ఇదేం.. విడ్డూరం అంటూ చెవులు కొరుక్కున్నారు.

ఈ వీడియో మొదట టిక్‌టాక్‌లో షేర్ చేశారు. దీనికి మిలియన్ల కొద్ది వీక్షణలు వచ్చాయి. ఈ వీడియో క్లిప్‌ని చూసిన కొందరు నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు. ‘ఇలాంటి ఐడియాలు ఎలా వస్తాయో.. మొత్తానికి ధైర్యం చేసి ఎక్కేసింది’ అని ఒకరు, ‘అసలామె అక్కడికి ఎలా చేరుకుంది?’ అంటూ కామెంట్ సెక్షన్‌ పేర్కొన్నారు. అధిక మంది ఈ మహిళ చేసిన పనిని ఎగతాళి చేస్తూ కామెంట్లు పెట్టారు.