Viral Video: ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు

సాధారణంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కోడి, బాతు, నెమలి లేదా ఇతర పక్షుల గుడ్లు ఎక్కువగా తింటూ ఉంటారనే విషయం మనందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఆక్టోపస్ గుడ్డు తిన్నారా? అది కూడా పచ్చిగా తిన్నారా? బాబోయ్‌.. ఏం మాట్లాడుతున్నారు? అని ఏవగించుకోకండి.. తలచుకుంటేనే కడుపులో దేవినట్లు అవుతుంది కదా! కానీ ఓ రెస్టారెంట్‌లో పచ్చి అక్టోనప్‌ గుడ్డును స్పెషల్‌ డిష్‌ పేరిట కస్టమర్లకు సర్వ్‌ చేస్తున్నారు. ఓ జపనీస్ రెస్టారెంట్ తన మెనూలో ఈ వింత వంటకాన్ని..

Viral Video: ఛీ.. ఇదేం వంటకం! స్పెషల్‌ డిష్‌ పేరిట రెస్టారెంట్‌ నిర్వాకం.. ఫైర్‌ అవుతున్న నెటిజన్లు
Raw Octopus Eggs
Follow us
Srilakshmi C

|

Updated on: May 10, 2024 | 7:36 PM

సింగపూర్‌, మే 10: సాధారణంగా ప్రపంచంలోని వివిధ దేశాల్లో కోడి, బాతు, నెమలి లేదా ఇతర పక్షుల గుడ్లు ఎక్కువగా తింటూ ఉంటారనే విషయం మనందరికీ తెలుసు. కానీ మీరు ఎప్పుడైనా ఆక్టోపస్ గుడ్డు తిన్నారా? అది కూడా పచ్చిగా తిన్నారా? బాబోయ్‌.. ఏం మాట్లాడుతున్నారు? అని ఏవగించుకోకండి.. తలచుకుంటేనే కడుపులో దేవినట్లు అవుతుంది కదా! కానీ ఓ రెస్టారెంట్‌లో పచ్చి అక్టోనప్‌ గుడ్డును స్పెషల్‌ డిష్‌ పేరిట కస్టమర్లకు సర్వ్‌ చేస్తుంది. ఓ జపనీస్ రెస్టారెంట్ తన మెనూలో ఈ వింత వంటకాన్ని చేర్చింది. సింగపూర్ ప్రజలు సదరు రెస్టారెంట్‌ మెనూలో దీనిని చూసి నాలుక కరచుకుంటున్నారు. సోషల్ మీడియాలో ఈ రెస్టారెంట్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. అయితే ఇన్ని విమర్శలు రావడంతో కొందరు ఔత్సాహికులు ఈ వింత వంటకాన్ని ఒక్కసారైనా తినాలని ఉవ్విళ్లూరుతున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌ అవుతోంది. ఆ కహానీ ఏంటో మీరే చూడండి..

‘కోజీ సుషీ బార్’ అనే జపనీస్‌ రెస్టారెంట్‌ సింగపూర్‌లో బాగా ఫేమస్‌. ఈ రెస్టారెంట్‌ మెనూలో ‘ఈ టకో టమాగో’ అనే వంటకాన్ని సాంప్రదాయ జపనీస్ వంటకంగా దాని కస్టమర్లకు అందిస్తుంది. ఈ వంటకం చూసేందుకు కాస్త విచిత్రంగా ఉంది. పైన సన్నన పొర ఉంటుంది. దానిపై సన్నని మంటతో బ్లో టార్చ్‌ సహాయంతో లేతగా కాల్చడంతో చిన్న రంధ్రం పడింది. అంతే.. అందులో నుంచి వందలాది దీర్ఘచతురస్రాకార గుడ్లు లాంటి అంటుకునే ద్రవం బయటికి రావడం వీడియోలో చూడొచ్చు. ప్లేట్‌లో పరుచుకున్న వందలాది ఆక్టోపస్ గుడ్లు వీడియోలో చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

దీనిని ఆ రెస్టారెంట్‌ సోయా సాస్‌తో వడ్డిస్తుంది. సాల్మన్ రో లాగా రుచిగా ఉంటుంది. రెస్టారెంట్ తన ఇన్‌స్టా హ్యాండిల్‌లో ఈ వీడియోను షేర్ చేసింది. అందులో ఆక్టోపస్ గుడ్లు పచ్చిగా వడ్డిస్తున్నట్లు చూపించారు. అయితే సింగపూర్ వాసులు తొలుత ఈ వంటకాన్ని అస్సలు ఇష్టపడలేదట.అయితే, ఇది సీజనల్ డిష్ అని, ఇది మే మధ్యకాలం వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని రెస్టారెంట్ సదరు ఇన్‌స్టా పోస్ట్‌లో పేర్కొంది. అయితే విచిత్రంగా ఈ వంటకంపై వచ్చిన విమర్శలే దీనికి విపరీతంగా పాపులారిటీ తెచ్చి పెట్టింది. దీంతో టాకో టమాగో రుచి చూసేందుకు అనేక మంది ఆ రెస్టారెంట్‌కు వరుసకట్టారు. దీనిని తిన్నవారు ఆహా ఓహో అంటున్నట్లు రెస్టారెంట్ చెబుతోంది. పైగా ఈ వంటకంలో ప్రోటీన్, ఒమేగా 3, విటమిన్ B12 వంటి పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయట. ఇది సమతుల్య, పోషకమైన ఆహారం అని రెస్టారెంట్‌ ప్రచారం చేసుకుంటోంది. మరికొంత మంది నెటిజన్లు మాత్రం రెస్టారెంట్ చర్యను తీవ్రంగా తప్పుబడుతోంది. పోషకాలు పొందాలంటే ఇలా పచ్చి అక్టోపస్‌ గుడ్లు తినాల్సిన అవసరం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా ఈ వంటకం జపాన్‌లో ఫేమస్‌ వంటకం. ముఖ్యంగా ఆ దేశంలో హక్కైడో వంటి ప్రాంతాల్లో ఇవి ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
ప్రజలకు గుడ్ న్యూస్.. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంపై కీలక అప్డేట్
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
హెల్మెట్, సీట్ బెల్ట్ పెట్టుకోకపోతే.. మీ వాహనం సీజ్ చేస్తారా.?
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
ముఖంపై ముడతలతో ఇబ్బంది పడుతున్నారా..? ఈ ప్యాక్ వేస్తే సరి..!
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
క్రిస్మస్‌కి ఇంటికి వచ్చే గెస్టులకు ఈజీగా చేసే ఈ టోస్ట్ పెట్టండి
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
కేంద్రం కీలక నిర్ణయం.. పలు రాష్ట్రాలకు గవర్నర్ల నియామకం
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
ఎన్నికల సంఘంపై సుప్రీంలో కాంగ్రెస్‌ పిటిషన్‌.. ఏ విషయంలోనంటే
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
మీ పిల్లలకు ఫోన్ చూపిస్తూ అన్నం తినిపిస్తున్నారా? అయితే ఈ సమస్యలు
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
'కాలేజీ రోజుల్లో నేనూ వైల్డ్ ఫైరే'.. బాలయ్య టాక్ షోలో వెంకీ మామ
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
ఖాళీ కడుపుతో ఉసిరికాయ రసం తాగితే ఎన్ని లాభాలో తెలుసా..?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?
జియో నుంచి 98 రోజుల వ్యాలిడిటీ ఉండే ప్లాన్‌ గురించి మీకు తెలుసా?