Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరికొన్ని గంటల్లో అమెరికాలో ఎన్నికలు.. భారత్‌ సహా ప్రపంచదేశాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయంటే..!

మరికొన్ని గంటల్లో అమెరికా అధ్యక్షుడు ఎవరు అన్నది తెలియనుంది.. నవంబర్ 5వ తేదీ మంగళవారం అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ అమెరిక అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌ గెలుస్తారా లేక మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ గెలుస్తారా..! వీరిద్దరి విజయం భారత్‌తో పాటు ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపుతుందనేది ప్రస్తుతం అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న

మరికొన్ని గంటల్లో అమెరికాలో ఎన్నికలు.. భారత్‌ సహా ప్రపంచదేశాలపై ఎలాంటి ప్రభావం చూపనున్నాయంటే..!
Us Presidential Election 2024
Follow us
Surya Kala

|

Updated on: Nov 04, 2024 | 1:21 PM

నవంబర్ 5 వ తేదీన అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరికొన్ని గంటల్లోనే అమెరికా ప్రజలు తమ తదుపరి అధ్యక్షుడిని ఎన్నుకోనున్నారు. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రస్తుత ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ మరోసారి ఎన్నికల రంగంలో తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో కమలా హారిస్ గెలిస్తే అమెరికా తొలి మహిళా అధ్యక్షురాలిగా, డొనాల్డ్ ట్రంప్ గెలిస్తే రెండోసారి అధ్యక్ష పీఠాన్ని అధిష్టించనున్నారు.

రిపబ్లికన్ పార్టీకి చెందిన డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ పార్టీకి చెందిన కమలా హారిస్ అమెరికా అద్యక్ష పదివి కోసం హోరాహోరీగా తలపడుతున్నారు. దీంతో యుఎస్ అధ్యక్ష ఎన్నికలు మరోసారి చారిత్రాత్మక ఘట్టంగా ఉద్భవించాయి. గత ఎన్నికలతో పోలిస్తే ఈసారి పరిస్థితి భిన్నంగా ఉంది. 2020 సంవత్సరంలో బిడెన్, ట్రంప్ ముఖాముఖిగా తలపడినప్పుడు కోవిడ్ -19 మహమ్మారి అతిపెద్ద సమస్య. అయితే ఇప్పుడు జరుగుతున్న ఎన్నికలు భిన్నంగా ఉన్నాయి.. ఆ దేశ సమస్యలు, వ్యూహాలు భిన్నంగా ఉన్నాయి.

అమెరికన్ పబ్లిక్ ఎన్నికల సమస్యలు

అమెరికా భిన్నత్వం కలిగిన దేశం. బయటి చూసే వారికీ ఈ దేశం వైట్ హౌస్, కాపిటల్ హిల్ ,న్యూయార్క్ లో ప్రసిద్ధ స్కైలైన్ రూపంలో కనిపిస్తుంది. అయితే చాలా మంది అమెరికన్ ప్రజలు ఉపాధి, విద్య, ఆరోగ్యం , రుణమాఫీ వంటి వారి రోజువారీ సమస్యలకు ప్రాముఖ్యతనిస్తారు. చాలా మంది ఓటర్లు రిపబ్లికన్ లేదా డెమోక్రటిక్ పార్టీకి చెందిన నమోదిత ఓటర్లు. వీరు తమ పార్టీకి విధేయులుగా ఉంటారు. అలాంటి కొన్ని స్వింగ్ స్టేట్స్ లోని ఓటర్లు ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తారు. అమెరికాలో అబార్షన్, ఇమ్మిగ్రేషన్ వంటి సున్నితమైన సమస్యలు కూడా ప్రజలపై ప్రభావం చూపుతాయి.

ఇవి కూడా చదవండి

అభ్యర్థుల వ్యూహం

అభ్యర్థులిద్దరూ ఒకరిపై ఒకరు వ్యక్తిగత, రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. కమలా హారిస్ విజయం సాధిస్తే అమెరికాలో వలసదారులే ఆధిపత్యం చెలాయిస్తారని ట్రంప్ చెబుతుండగా.. మహిళల అబార్షన్ హక్కులకు భంగం వాటిల్లుతుందనే భయాన్ని మహిళలకు చూపుతూ కమలా హారిస్ మద్దతు కూడగడుతున్నారు. అటువంటి పరిస్థితిలో ఈ వివాదాస్పద అంశాలు ఓటర్లను ప్రలోభపెట్టడానికి ప్రధాన ఎన్నికల అస్త్రాలుగా మారాయి.

ప్రపంచంపై ఎలాంటి ప్రభావం చూపించనున్నాయంటే

నవంబర్ 5న జరిగే ఎన్నికల తర్వాత కమలా హారిస్ లేదా ట్రంప్ గెలిచినా.. ప్రపంచంపై అమెరికా విధానాల ప్రభావం అంతంత మాత్రమే. అమెరికా ప్రయోజనాలే ప్రధానమైనవి. అమెరికా తన ముద్రతో ప్రపంచంలో బలోపేతం అవ్వడానికే ప్రాధాన్యతనిస్తుంది. ట్రంప్ గెలిస్తే చైనా లేదా ఇరాన్ అమెరికాకు శత్రువుగా మారవచ్చు, హారిస్ అధ్యక్షురాలైతే రష్యా సవాళ్లను ఎదుర్కోవాల్సి రావచ్చు. ఈ ఎన్నికలు ప్రపంచ శాంతిలో మార్పు తీసుకురాదు. కేవలం సంఘర్షణ.. సరిహద్దులను మార్చవచ్చు.

భారతదేశానికి ఈ ఎన్నికలు ఎలా ప్రభావం చూపిస్తాయంటే

ఇప్పుడు అమెరికా ఎన్నికలు భారతదేశంపై ఎలా ప్రభావం చుపిస్తాయనే ప్రశ్న తలెత్తుతుంది. అయితే అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం నేరుగా భారతదేశాన్ని ప్రభావితం చేయదు. అయితే ఈ ఎన్నికల ఫలితాల ద్వారా భారతదేశం-యుఎస్ సంబంధాలలో స్థిరత్వం, వ్యూహాత్మక భాగస్వామ్యం బలపడుతుంది. ఎవరు గెలిచినా భారత్‌తో వాణిజ్యం, సైనిక భాగస్వామ్యాలు స్థిరమైన థీమ్‌గా ఉంటాయి. ముఖ్యంగా ఆసియాలో చైనా పెరుగుతున్న శక్తిని దృష్టిలో ఉంచుకుని.. భారత్ తో తమ బంధాన్ని బలపరుచుకునే విధంగా ఆలోచనలతో అడుగులు వేస్తారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..