AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కరోనా టీకా తీసుకున్న జో బైడెన్.. ప్రజల్లో లేనిపోని అపోహాలు పోగొట్టేందుకే ఈ టీకా తీసుకున్నా..

అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. డెలవర్ లోని క్రిస్టియానా ఆస్పత్రిలో 78 ఏళ్ల జో బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు....

కరోనా టీకా తీసుకున్న జో బైడెన్.. ప్రజల్లో లేనిపోని అపోహాలు పోగొట్టేందుకే ఈ టీకా తీసుకున్నా..
Subhash Goud
|

Updated on: Dec 22, 2020 | 8:34 AM

Share

అమెరికా కొత్త అధ్యక్షుడుగా ఎన్నికైన జో బైడెన్ సోమవారం కరోనా టీకా తీసుకున్నారు. డెలవర్ లోని క్రిస్టియానా ఆస్పత్రిలో 78 ఏళ్ల జో బైడెన్ ఫైజర్ టీకా మొదటి డోసు తీసుకున్నారు. బైడెన్ వ్యాక్సినేషన్ ను అమెరికా ఛానళ్లు ప్రత్యక్ష ప్రసారం చేశాయి. ఈ సందర్భంగా బైడెన్ మాట్లాడుతూ.. ప్రజల్లో లేనిపోని అపోహాలు పోగొట్టేందుకు ఈ టీకా వేయించుకున్నానని అన్నారు. టీకా గురించి ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. ప్రజలు టీకా వేయించుకునేందుకు సిద్ధంగా ఉండాలి. నేను టీకా రెండో డోసు తీసుకునేందుకు ఎదురు చూస్తున్నాను.. అని అన్నారు. అయితే టీకా తీసుకుంటున్న సమయంలో బైడెన్ సతీమణి జిల్ బైడెన్ ఆయన పక్కనే ఉన్నారు. ఆమె ముందు రోజు టీకా తీసుకున్నారు. అయితే వ్యాక్సిన్ల సమర్ధత సన్నగిల్లుతోంది. వ్యాక్సిన్ తీసుకోవడం అనేది సురక్షిమని తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉందని బైడెన్ పేర్కొన్నారు.

కాగా, ఫైజర్ వ్యాక్సిన్ను అమెరికా, ఔషధ నియంత్రణ అనుమతి లభించిన నేపథ్యంలో టీకా కార్యక్రమం ప్రారంభమైంది. గత వారం నుంచే అమెరికా పెద్ద ఎత్తున కోవిడ్ టీకాను ఫ్రంట్ లైన్ వర్కర్లు అయిన ఆరోగ్య సిబ్బందికి ఇస్తున్నారు. కరోనా మహమ్మారి కారణంగా అమెరికాలో సుమారు మూడు లక్షల 20 వేల మంది మృతి చెందారు. కాగా, అమెరికాలో క‌రోనా మ‌హ‌మ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. క‌రోనా క‌ట్ట‌డికి ఎన్ని చ‌ర్య‌లు చేప‌ట్టినా పాజిటివ్ కేసుల సంఖ్య, మ‌ర‌ణాల సంఖ్య పెరిగిపోతోంది. వైర‌స్‌కు అడ్డుక‌ట్ట వేసేందుకు ప‌లు వ్యాక్సిన్లు ప్ర‌యోగ ద‌శ‌లో ఉన్నాయి.

అమెరికా తరువాత ఫైజర్ వ్యాక్సిన్ కి ఈయూ ఆమోదం, తాజా డేటా సమర్పణకై సూచన, ఇక 27 దేశాల్లో వినియోగం

బ్రిటన్ కరోనావైరస్ మరీ అంత ప్రమాదకరమైనది కాదట, ఇండో-అమెరికన్ డాక్టర్ వివేక్ మూర్తి విశ్లేషణ , వేచి చూడాలని వ్యాఖ్య

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్