US Midterm Election Results: అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ట్రంప్‌ పార్టీ సత్తా.. జో బైడెన్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?

|

Nov 10, 2022 | 5:00 AM

అమెరికా మిడ్‌టర్మ్‌ పోల్స్‌లో మాజీ అధ్యక్షుడు ట్రంప్‌ పార్టీ సత్తా చాటుకుంది. దిగువ సభలో రిపబ్లికన్ల సీట్లు పెరుగగా, దిగువ సభలో డెమోక్రాట్స్‌, రిపబ్లికన్స్‌ సమానంగా నిలిచారు..

US Midterm Election Results: అమెరికా మిడ్‌టర్మ్‌ ఎన్నికల్లో ట్రంప్‌ పార్టీ సత్తా.. జో బైడెన్ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చాయంటే..?
Joe Biden Donald Trump
Follow us on

అమెరికాలో హోరాహోరీగా సాగిన మిడ్‌టర్మ్ ఎన్నికల్లో అధ్యక్షుడు జోబైడెన్‌ పార్టీ అయిన డెమోక్రాట్లు వెనకబడ్డారు. మాజీ అధ్యక్షుడు డొనాల్ట్‌ ట్రంప్‌ పార్టీ రిపబ్లికన్లు సత్తాచాటారు. అమెరికా ప్రతినిధుల సభలోని మొత్తం 435 సీట్లలో విపక్ష రిపబ్లికన్లకు 198 సీట్లు, డెమొక్రాట్లకు 178 సీట్లు దక్కాయి. యూఎస్ లో డెమొక్రాట్ల ఆధీనంలో ఉన్న చాలా సీట్లు రిపబ్లికన్లకు దక్కడం చర్చనీయాంశమైంది. అయితే ఎగువసభ సెనెట్‌లో రెండుపార్టీలకు చెరో 48 సీట్లు వచ్చాయి. ఈ ఎన్నికల ఫలితాలు అధ్యక్షుడు బైడెన్‌కు కాస్త షాకింగ్‌గా ఉంటాయని ముందుగానే ఊహించారు. అసంతృప్తి ఉన్నప్పటికీ.. మధ్యంతర ఎన్నికలలో డెమొక్రాట్లు ఆశ్చర్యకరమైన బలాన్ని ప్రదర్శించారని పేర్కొంటున్నారు.

ఇప్పటి వరకూ ప్రతినిధుల సభలో డెమోక్రాట్స్‌ ఆధిక్యత ఉండేది. అధ్యక్షుడు బైడెన్‌ తీసుకున్న నిర్ణయాలకు ఆమోద ముద్ర వేయడంలో, చట్టాలను రూపొందించడంలో పెద్దగా ఇబ్బంది ఉండేది కాదు.. ఇప్పుడు రిపబ్లికన్లు సభలో ఆధిక్యతలోకి రావడం బైడెన్‌కు కాస్త ఇబ్బందికరమే.. ఆయన నిర్ణయాలకు రిపబ్లికన్లు అడ్డుతగిలే అవకాశాలు పెరిగాయి. ద్రవ్యోల్బణం, అబార్షన్‌పై తీర్పు, గన్‌ పాలసీ, అక్రమ వలసల విషయంలో బైడెన్‌ తీసుకున్న నిర్ణయాలు అమెరికన్లకు అసంతృప్తి కలిగించినట్లు ఈ ఎన్నికల ఫలితాలు చెబుతున్నాయి.

రిపబ్లికన్లు పుంజుకోవడంతో 2024 అధ్యక్ష ఎన్నికల్లో మళ్లీ పోటీ చేసేందుకు సిద్దమవుతున్న మాజీ అధ్యక్షుడు ట్రంప్‌లో సరికొత్త ఆశలు చిగురించాయి. ఈ నెల 14న ఈ విషయంలో కీలక ప్రకటన చేయబోతున్నట్లు ట్రంప్‌ ముందుగానే ప్రకటించారు. బైడెన్‌ వైఫల్యాలను ఎండగట్టడం ద్వారా ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు ట్రంప్‌.

ఇవి కూడా చదవండి

మధ్యంతర ఎన్నికల ఫలితాల అనంతరం ఈ రోజు అధ్యక్షుడు జో బిడెన్ మీడియాతో మాట్లాడతారని వైట్ హౌస్ తెలిపింది. డెమోక్రటిక్ పార్టీ ఊహించిన దాని కంటే మెరుగైన ఫలితాలను కనబరిచిందని.. అధ్యక్షుడు బైడెన్ మీడియాతో మాట్లాడేందుకు సిద్ధంగా ఉన్నారని వైట్ హౌస్ తెలిపింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..