AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch Video: అమ్మబాబోయ్.. ఆ సముద్రగర్భంలో కోట్ల సంపద గుర్తింపు .. పొందితే కుబేరులు అయినట్టే..

కరేబియన్ సముద్రంలో కోట్ల విలువైన నిధి ఉన్నట్లు గుర్తించారు కొలంబియా అధికారులు. కరేబియన్‌ సముద్రంలో మునిగిన శాన్‌జోస్‌ అనే పురాతన నౌకను కనుగొనేందుకు తాము పరిశోధనలు మొదలుపెట్టినట్లు కొలంబియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సాధారణంగా చరిత్ర చాల గొప్పది అంటూ ఉంటారు మేధావులు. కానీ దానిని ఇప్పుడు కాస్త మార్చి చరిత్ర చాల విలువైనది, సుసంపన్నమైనది అని చెప్పాల్సిన అవసరం ఉంది.

Watch Video: అమ్మబాబోయ్.. ఆ సముద్రగర్భంలో కోట్ల సంపద గుర్తింపు .. పొందితే కుబేరులు అయినట్టే..
Colombia
Srikar T
|

Updated on: May 26, 2024 | 3:05 PM

Share

కరేబియన్ సముద్రంలో కోట్ల విలువైన నిధి ఉన్నట్లు గుర్తించారు కొలంబియా అధికారులు. కరేబియన్‌ సముద్రంలో మునిగిన శాన్‌జోస్‌ అనే పురాతన నౌకను కనుగొనేందుకు తాము పరిశోధనలు మొదలుపెట్టినట్లు కొలంబియా ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. సాధారణంగా చరిత్ర చాల గొప్పది అంటూ ఉంటారు మేధావులు. కానీ దానిని ఇప్పుడు కాస్త మార్చి చరిత్ర చాల విలువైనది, సుసంపన్నమైనది అని చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుంకంటే స్పెయిన్ నుంచి ప్రయాణిస్తున్న 300ఏళ్ల కాలం నాటి పడవ కరేబియన్ సముద్రంలో మునిగిపోయింది. అందులో టన్నుల కొద్దీ బంగారం, వజ్రాల రాళ్లు, వెండి వస్తువులు ఉన్నట్లు గుర్తించారు. దీని కోసం వేట కొనసాగిస్తున్నారు. శాన్ జోస్ గ్యాలియన్ పనామాలోని పోర్టోబెలో నుండి బయలుదేరిన 14 వర్తక నౌకలు నీట మునిగిపోయాయి. 1708లో బ్రిటిష్ వారితో జరిగిన వాగ్వివాదంలో మూడు స్పానిష్ యుద్ధనౌకలు పేలుడుకు గురయ్యాయి.

ఈక్రమంలో స్పెయిన్‎కు చెందిన నౌక దాదాపు 200 టన్నుల బంగారం, వెండి, వజ్రాలను తీసుకొని కొలంబియాకు బయల్దేరింది. ఈ క్రమంలో జరిగిన దాడుల్లో దాదాపు అందులో ప్రయాణిస్తున్న 600 మంది ప్రాణాలు కోల్పోయారు. మరికొందరు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బయటపడ్డారు. ఈ క్రమంలో 64 భారీ రాగి తుపాకులు కూడా సముద్రంలో పడిపోయాయి. కొలంబియా ప్రభుత్వం విడుదల చేసిన వీడియోలో బంగారు నాణేలు కూడా బయటపడ్డాయి. అవి  3,100 అడుగుల నీటిలో మునిగిపోయాయని తెలిపారు కొలంబియా పరిశోధకులు. 16, 18వ శతాబ్దాల మధ్య యూరప్ – అమెరికాల మధ్య పర్యటనలు చేసిన అనేక స్పానిష్ గ్యాలియన్‌లలో ఇది ఒకటి. అప్పటి డిన్నర్ సెట్ తో పాటు పింగాణీ పాత్రలు, కుండలు, గాజు సీసాలు కూడా బయటపడ్డాయి. అయితే దీనిపై దశాబ్దాలుగా శోధనలు జరుగుతున్నప్పటికీ వీటిని వెలికి తీసేందుకు కొలంబియా ప్రభుత్వం ముందుకు వచ్చింది.

దీనిపై పలు దేశాలు తమకు హక్కులు ఉన్నాయంటూ వాదిస్తున్నాయి. అమెరికన్ రీసెర్చ్ కంపెనీ, గ్లోకా మోర్రా, తాను 1981లో శాన్ జోస్‌ను కనుగొన్నానని చెబుతోంది. ఓడను వెలికితీసిన తర్వాత సగం వాటా తమకు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. అందుకునే కొన్ని షరతులపై కొలంబియన్‌లకు ఈ నిధికి సంబంధించి కోఆర్డినేట్‌ చేయమని సూచించినట్లు తెలిపింది. అయితే దీనిని 2015లో కొలంబియా అప్పటి అధ్యక్షుడు జువాన్ మాన్యుయెల్ శాంటోస్ దీనిని తప్పుబట్టారు. సముద్రగర్భంలో యూఎస్ శాస్త్రవేత్తలు గుర్తించి చోట కాకుండా వేరే ప్రదేశంలో తమ నౌకాదళం సంపదతో కూడిన పడవను గుర్తించిందని చెప్పారు. అందుకోసం US-కొలంబియా ట్రేడ్ ప్రమోషన్ లో భాగంగా ఎస్‌ఎస్‌ఏ సంస్థ పర్మినెంట్‌ కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌లో 10 మిలియన్ డాలర్లు దావా వేసింది. ఇదిలా ఉంటే ఇందులో తనకు హక్కు ఉందంటూ స్పెయిన్, పెరూ ప్రభుత్వాలు కూడా పోటీ పడుతున్నాయి. ఇవన్నీ ఎలా ఉన్నా కొలంబియా మాత్రం తనకు నిధి ఉందని గుర్తించిన ప్రాంతాన్ని మాత్రం ఎవరికీ చెప్పకుండా గోప్యంగా ఉంచింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..