World Record: 10 రోజులకే మరణం అంచులకు వెళ్ళిన రోమియో.. నేడు తన ఎత్తుతో గిన్నిస్ బుక్‌లో చోటు..
నిజానికి 6 ఏళ్ల హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా ఖ్యతిగాంచింది. అమెరికాలోని ఒరెగాన్‌లోని ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే రోమియో చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ఈ ఎద్దుని చూడగానే భయపడిపోతారు. అయితే ఈ ఎద్దు స్వతహాగా చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
ప్రపంచ రికార్డులు మనుషులు , పండ్లు పేర్ల మీదనే కాదు.. కొన్ని సార్లు జంతువుల పేర్ల మీద కూడా రికార్డులు నమోదు అవుతాయని తెలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. ప్రస్తుతం గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో ఎద్దు పేరు నమోదు కావడం చర్చనీయాంశమైంది. నిజానికి 6 ఏళ్ల హోల్‌స్టెయిన్ స్టీర్ రోమియో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దుగా ఖ్యతిగాంచింది. అమెరికాలోని ఒరెగాన్‌లోని ఓ జంతు సంరక్షణ కేంద్రంలో నివసించే రోమియో చాలా పొడవుగా, వెడల్పుగా ఉంటుంది. ఈ ఎద్దుని చూడగానే భయపడిపోతారు. అయితే ఈ ఎద్దు స్వతహాగా చాలా ప్రశాంతంగా, సౌమ్యంగా ఉంటుందని పేర్కొన్నారు.
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ట్విట్టర్‌లో ఒక వీడియోను కూడా షేర్ చేసింది. అందులో ‘1.94 మీటర్ల (6 అడుగుల 4.5 అంగుళాలు) ఎత్తుతో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన ఎద్దు రోమియోని కలవండి. రోమియో తన యజమాని మిస్టీ మూర్‌తో కలిసి వెల్‌కమ్ హోమ్ యానిమల్ శాంక్చురీలో నివసించే 6 ఏళ్ల హోల్‌స్టెయిన్ ఎద్దు. ఈ నల్లటి ఎద్దుకు ఓ మహిళ అరటిపండు తినిపిస్తున్న దృశ్యాన్ని వీడియోలో చూడవచ్చు.
వీడియో చూడండి
Meet Romeo, the world’s tallest steer at a height of 1.94 metres (6 ft 4.5 in) ✨
Romeo is a 6-year-old Holstein steer who lives at Welcome Home Animal Sanctuary with his human, Misty Moore. pic.twitter.com/MZqCB7fkgM
— Guinness World Records (@GWR) May 22, 2024
గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ ప్రకారం, రోమియో ఆహారాన్ని ఇష్టపడుతుంది. ముఖ్యంగా ఆపిల్, అరటిపండ్లు అంటే చాలా ఇష్టం. ప్రతిరోజూ 100 పౌండ్ల (45 కిలోగ్రాముల) ఎండుగడ్డి, ధాన్యం, ఇతర వస్తువులను తింటుంది. దీని భారీ పరిమాణం కారణంగా సౌకర్యవంతమైన రవాణా, పెద్ద జంతు శాల కూడా అవసరం. రోమియోకు కేవలం 10 రోజుల వయస్సు ఉన్నప్పుడు వధించడానికి కబేళాకు తీసుకువెళుతున్నారు. అప్పుడు తాను దానిని మరణం నుంచి కాపాడినట్లు మిస్తీ చెప్పింది. దీని తరువాత రోమియోను తన ఇంటికి తీసుకువెళ్ళి స్వయంగా పెంచడం ప్రారంభించినట్లు వెల్లడించింది.
అయితే రోమియోను పెంచడంలో మిస్తీ చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఈ ఎద్దు చాలా భారీగా ఉంటుంది. కనుక ఇది తినే ఆహారం కూడా ఎక్కువే. అలాంటి పరిస్థితిలో మిస్తీకి రోమియో ఆహారం కోసం డబ్బు సేకరించడం చాలా కష్టంగా మారింది. దీంతో ఎద్దుని పోషించడానికి నిధులు సేకరించవలసి వచ్చింది. ఫలితంగా ఈ ఎద్దు పేరు ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది.
మరిన్ని ట్రెండింగ్ వీడియో వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..