AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Avian Influenza: అమెరికాను భయపెడుతోన్న బర్డ్‌ ఫ్లూ.. కోళ్ల పరిశ్రమకు లాక్‌డౌన్..

అమెరికాను బర్డ్‌ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి.

Avian Influenza: అమెరికాను భయపెడుతోన్న బర్డ్‌ ఫ్లూ.. కోళ్ల పరిశ్రమకు లాక్‌డౌన్..
Us Bird Flu
Shaik Madar Saheb
|

Updated on: Jan 29, 2024 | 10:01 AM

Share

అమెరికాను బర్డ్‌ ఫ్లూ భయపెడుతోంది. ఏవియెన్‌ ఇన్‌ఫ్లూయెంజా అని పిలిచే ఈ వ్యాధి కాలిఫోర్నియాలోని పక్షుల్లో శరవేగంగా వ్యాప్తి చెందుతోంది. దీంతో కాలిఫోర్నియాలో కోళ్ల పరిశ్రమ ఏకంగా లాక్‌డౌన్‌ ప్రకటించింది. అడవి పక్షులకు ఈ వ్యాధి సోకుతుండటంతో ఆకాశంలో ఎగురుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోతున్నాయి. అయితే ఈ బర్డ్ ఫ్లూ వ్యాధి కేవలం పక్షులకేనా మనుషులకు, వారి పెంపుడు జంతువులకు కూడా వస్తుందా అనే విషయంలో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మనుషులకు ఈ వైరస్‌ సోకే అవకాశాలు తక్కువే ఉన్నప్పటికీ పక్షులతో దగ్గరగా మెలిగే వారికి గతంలో ఈ వ్యాధి సోకిన సందర్భాలున్నాయి. మనుషుల్లో హెచ్‌7ఎన్‌9,హెచ్‌5ఎన్‌1 వైరస్‌ రకాలు బర్డ్‌ ఫ్లూ వ్యాధికి కారణంకానున్నాయి.

సాధారణంగా పక్షుల లాలాజలం, వ్యర్థాల ద్వారా బర్డ్‌ ఫ్లూ వైరస్‌ బయటికి విడుదలవుతుంది. ఈ వైరస్‌ గాలిలో ఉన్నపుడు ఆ గాలిని మనుషులు పీల్చుకోవడం లేదా వైరస్‌ ఉన్న ప్రదేశాన్ని తాకి అవే చేతులతో కళ్లు, ముక్కు, నోరు తాకినపుడు వైరస్‌ మనుషుల శరీరాల్లోకి ప్రవేశిస్తుందని చెప్తున్నారు వైద్య నిఫుణులు. ఇప్పటికే బర్డ్ ఫ్లూ సోకిన కొందరిలో లక్షణాలు కనిపించకపోయినప్పటికీ.. స్వల్ప అనారోగ్యం చోటుచేసుకుంది. మరికొన్ని కేసుల్లో కళ్లు ఎరుపెక్కడం, జ్వరం, దగ్గు, ముక్కు కారడం, ఒళ్లు నొప్పులు, కండరాల నొప్పులు, తల నొప్పి, అలసట, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు, అలసట, డయేరియా వంటి లక్షణాలతో పాటు.. ఒక్కోసారి వ్యాధి తీవ్రంగా ఉంటే మరణించే చాన్స్ లేకపోలేదంటున్నారు వైద్యులు.

బర్డ్‌ ఫ్లూ సోకిన వారు లక్షణాలను గమనించి వెంటనే డాక్టర్‌ను సంప్రదించాలని.. వ్యాధి తీవ్రతను బట్టి హోమ్‌ లేదా హాస్పిటల్‌ ఐసోలేషన్‌లో ఉండాలని సూచిస్తున్నారు వైద్యులు. శరీరంలో వైరస్‌ పూర్తిగా లేకుండా పోయిందని నిర్ధారించుకునేంత వరకు చికిత్స తీసుకుంటునే ఉండాలని చెప్తున్నారు ఆరోగ్యశాఖ అధికారులు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..