బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోనే ఉండాలట……భూమికి తిరిగి రావద్దంటున్న నెటిజన్లు …ఇదెక్కడి వింత ..?

తన సోదరుడు మార్క్ బెజోస్ తో కలిసి బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి ప్రయాణిస్తాడన్న వార్త అమెరికాలో హాట్ హాట్ టాపిక్ గా...

బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోనే ఉండాలట......భూమికి తిరిగి రావద్దంటున్న నెటిజన్లు ...ఇదెక్కడి వింత ..?
Jeff Bezos
Umakanth Rao

| Edited By: Phani CH

Jun 21, 2021 | 7:29 PM

తన సోదరుడు మార్క్ బెజోస్ తో కలిసి బిలియనీర్ జెఫ్ బెజోస్ అంతరిక్షంలోకి ప్రయాణిస్తాడన్న వార్త అమెరికాలో హాట్ హాట్ టాపిక్ గా ..అదోరకమైన వెరైటీ సెటైరిక్ న్యూస్ గా మారుతోంది. చాలామంది నెటిజన్లు ఆయన అంతరిక్షంలోనే ఉండాలని, భూమికి తిరిగి రాకూడదని కోరుతున్నారు. ఈ మేరకు ‘ఛేంజ్ ..ఆర్గ్’ పై గల ఓ పిటిషన్ మీద 30 వేలమందికి పైగా సంతకాలు చేశారు. ‘డు నాట్ అలౌ జెఫ్ బెజోస్ టు రిటర్న్ టు ఎర్త్’ అనే పేరిట ఈ పిటిషన్ ని నిక్..జి. అనే యూజర్ రూపొందించాడు. బిలియనీర్లు ఈ భూమి మీద లేదా అంతరిక్షంలో ఉండరాదని, కానీ వాళ్ళు తల్చుకుంటే పైనే ఉండాలని..అలా వారు నిర్ణయం తీసుకోవాలని ఈయన అంటున్నాడు. త్వరలోనే ఈ పిటిషన్ పై ఇంకా చాలామంది సంతకాలు చేసే అవకాశాలు ఉన్నాయని, ఇది 50 వేల సంతకాలతో కూడినదై ఉండాలన్నది తమ లక్ష్యమని ఆయన పేర్కొన్నాడు. ఇలాంటిదే మరో పిటిషన్ కూడా తయారైంది. జెఫ్ ఈ భూతలం పై కాలు మోపరాదని మరికొందరు కోరుతున్నారు.

ఈ రెండో పిటిషన్ లో బెజోస్ ని సూపర్ మ్యాన్ చిత్రంలోని విలన్…… లెక్స్ లూథర్ తో పోల్చారు. అమెజాన్ ఫౌండర్ అయిన ఈయన.. బ్లూ ఆరిజిన్ అనే సంస్థను కూడా ఏర్పాటు చేశాడు. ఇది స్పేస్ ఎక్స్ ప్లోరేషన్ సంస్థ .. తమ యజమానిని రోదసీలోకి పంపే యత్నాల్లో ఉంది.

మరిన్ని ఇక్కడ చూడండి: Bullet Train Start : వారణాసి, హౌరా మధ్య బుల్లెట్ ట్రైన్..! 680 కిలోమీటర్ల ప్రయాణం కేవలం మూడు, నాలుగు గంటల్లోనే..

Minister Srinivas Goud: ఏపీ సర్కార్ తీరుపై ఫైర్ అయిన మంత్రి శ్రీనివాస్ గౌడ్.. మా ప్లాన్ మాకుందంటూ వార్నింగ్..

లేటెస్ట్ న్యూస్ హైలెట్స్ చూడండి

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu