USA vs North Korea: కిమ్‌తో కయ్యానికి కాలుదువ్వుతోన్న అమెరికా.. దక్షిణ కొరియాతో కలిసి..

కిమ్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది అగ్రరాజ్యం అమెరికా. దక్షిణ కొరియాతో కలిసి జాయింట్‌ మిలిటరీ డ్రిల్స్‌ నిర్వహిస్తోంది. వందల కొద్దీ యుద్ధవిమానాలు

USA vs North Korea: కిమ్‌తో కయ్యానికి కాలుదువ్వుతోన్న అమెరికా.. దక్షిణ కొరియాతో కలిసి..
Usa And South Korea
Follow us
Shiva Prajapati

|

Updated on: Oct 31, 2022 | 10:53 PM

కిమ్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది అగ్రరాజ్యం అమెరికా. దక్షిణ కొరియాతో కలిసి జాయింట్‌ మిలిటరీ డ్రిల్స్‌ నిర్వహిస్తోంది. వందల కొద్దీ యుద్ధవిమానాలు ఈ విన్యాసాల్లో పాల్గొన్నాయి. కొంత కాలంగా ఈస్ట్‌ ఏసియా మీద ఫోకస్‌ పెంచింది అమెరికా. ఇందులో భాగంగా సౌత్‌ కొరియాతో కలిసి సంయుక్తంగా సైనిక విన్యాసాలు చేపట్టింది. అమెరికా-దక్షిణ కొరియా వాయు సేనలు సోమవారం అతి పెద్ద సంయుక్త యుద్ధ విన్యాసాలను మొదలు పెట్టాయి. విజిలెంట్‌ స్ట్రామ్‌ పేరిట శుక్రవారం వరకు జరిగే ఈ విన్యాసాల్లో 240 యుద్ధ విమానాలు 16వందల సార్టీలు నిర్వహిస్తున్నాయి. ఈ వార్షిక కార్యక్రమంలో ఇన్ని సార్టీలు నిర్వహించడం ఇదే తొలిసారి. ఈ యుద్ద విన్యాసాల కోసం అమెరికా 35, దక్షిణ కొరియా 140 యుద్ద విమానాలను రంగంలోకి దింపుతున్నాయి. అయితే ఈ యుద్ధ విన్యాసాలను ఉత్తర కొరియా ఖండించింది. ఇవి తమ దేశంపై దాడికి సన్నాహాలుగా పేర్కొంది.

వాషింగ్టన్‌, సియోల్‌ అనుసరిస్తున్న దుందుడుకు విధానాలను ఇది తెలియజేస్తోందని మండిపడింది. అయితే ఇటీవలే జపాన్‌తో కలిసి విన్యాసాలు నిర్వహించింది అమెరికా. దీనికి ప్రతిగా ఉత్తర కొరియా కూడా క్షిపణీ పరీక్షలను నిర్వహిస్తోంది. అసలు తగ్గేదేలే అంటూ ఈ ఏడాది అక్టోబరు వరకు 40కి పైగా క్షిపణి పరీక్షలు జరిపింది. కొద్ది రోజుల క్రితం ఒక క్షిపణిని కొరియా ద్వీపకల్పానికి, జపాన్‌కు మధ్యనున్న సముద్ర జలాల్లోకి ప్రయోగించింది. ఆపైన సముద్రంలోకి ఫిరంగి గుళ్లను పేల్చింది. దక్షిణ కొరియా సరిహద్దుల సమీపంలోకి యుద్ధ విమానాలనూ పంపింది. ఉత్తర, దక్షిణ కొరియాల మధ్య సముద్ర, భూ సరిహద్దుల వెంబడి విమానాలు ఎగరకూడదంటూ గతంలో కుదిరిన ఒప్పందాన్ని ఉత్తర కొరియా యథేచ్ఛగా ఉల్లంఘించింది. దీంతో కిమ్‌తో కయ్యానికి కాలుదువ్వుతోంది అమెరికా. గట్టి జవాబు ఇచ్చేందుకు దక్షిణ కొరియాతో కలిసి జాయింట్‌ మిలిటరీ డ్రిల్స్‌ చేపట్టింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
మాది లవ్‌ ఎట్‌ ఫస్ట్‌ సైట్‌! పీవీ సింధు సిగ్గు మొగ్గలేస్తుందిగా.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
కుప్పకూలిన విమానం.. ఘటన సమయంలో విమానంలో 72 మంది.!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
మన్యంలో మెరుస్తున్న రోడ్లు.! రోడ్ల మరమ్మతులు, నిర్మాణాలపై ఫోకస్‌!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వాటర్‌ బాటిల్‌తో చేపలు ఇట్టే పట్టేశారే.. ఐడియా అదిరిందిగా.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
వీళ్లు మహా కంత్రీగాళ్లు.. నిమిషంలో లక్షలు కొల్లగొట్టారు.!
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
ఎవరీ బేబీ 81.. ఏంటా కథ.? ప్రపంచం దృష్టిని ఆకర్షించిన బేబీ 81’ కథ.
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డిప్ చాయ్ తాగే వాళ్లకు షాకింగ్ న్యూస్.టీ కలిపేటప్పుడు చాలజాగ్రత్త
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
డ్రగ్ స్మగ్లర్ హత్య.. చంపి పగ తీర్చుకున్న బిష్ణోయ్ గ్యాంగ్.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!
మీ శరీరంలో ఈ లక్షణాలు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చెయ్యద్దు.!