AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఇంటి తలుపుకు పింక్‌ కలర్ పెయింట్ వేసినందుకు రూ.20 లక్షల జరిమానా..!

ఇళ్లకు ఇష్టం వచ్చిన రంగులను పెయింట్‌ చేసుకోవడం ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిషేధం. ఐతే ఓ మహిళ మాత్రం తనకు నచ్చిన పింక్‌ కలర్‌ను ఇంటి తలుపుకు వేయించుకుంది. అంతే.. వెంటనే అధికారులు వచ్చి..

ఇంటి తలుపుకు పింక్‌ కలర్ పెయింట్ వేసినందుకు రూ.20 లక్షల జరిమానా..!
Scottish Scotland fined Rs.19 lakh for painting door
Srilakshmi C
|

Updated on: Oct 31, 2022 | 8:54 PM

Share

ఇళ్లకు ఇష్టం వచ్చిన రంగులను పెయింట్‌ చేసుకోవడం ప్రపంచంలోని వివిధ దేశాల్లో నిషేధం. ఐతే ఓ మహిళ మాత్రం తనకు నచ్చిన పింక్‌ కలర్‌ను ఇంటి తలుపుకు వేయించుకుంది. అంతే.. వెంటనే అధికారులు వచ్చి వెంటనే తలుపు రంగు మార్చాలని, లేదంటే రూ.20 లక్షలు జరిమానా కట్టవలసి వస్తుందని హుకుం జారీ చేసింది. వివరాల్లోకెళ్తే..

స్కాట్లాండ్‌లోని ఎడిన్‌బర్గ్‌కు చెందిన మిరాండా డిక్సన్ (48)కు ఆమె తల్లిదండ్రులు వారసత్వంగా సంక్రమించిన ఈ ఇంటిని 2019లో అప్పగించారు. దీంతో డిక్సన్ గత రెండేళ్లుగా దానికి మరమ్మత్తులు నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఇంటికి పెయింట్‌ వేయించింది. ఫైనల్‌ టచ్‌గా ఇంటి ప్రధాన ద్వారానికి పింక్‌ కలర్ వేయించింది. చూడ్డానికి చాలా అందంగా ఉండటంతో ఆ ఇంటి ముందు నుంచి వెళ్లే వారు డోర్‌ ముందు నిలబడి ఫొటోలు తీసుకోవడంతో అనతికాలంలోనే సదరు పింక్‌ కలర్‌ డోర్‌ ఫేమస్‌ అయ్యింది. ఐతే సిటీ ఆఫ్ ఎడిన్‌బర్గ్ కౌన్సిల్ పింక్‌ కలర్‌పై అభ్యంతరం వ్యక్తం చేసింది. వెంటనే తెలుపు రంగుతో పెయింట్ వేయవల్సిందిగా డిక్సన్‌ను ఆదేశించింది. సిటీ కౌన్సిల్ నిబంధనల ప్రకారం బూడిద, నలుపు, తెలుపు వంటి మ్యూట్‌ రంగుల్లో మత్రమే ఇళ్లకు పెయింట్ వేసుకోవాలి. ఇతర రంగుల్లో పెయింట్‌ వేసుకోవడం నిషేధం.

యూకేలోని బ్రిస్టల్‌, నాటింగ్‌హిల్‌, హారోగేట్‌ నగరాల్లో ఇంటి ముందు తలుపులు ముదురు రంగులో ఉన్నాయని, తన ఇంటి తలుపు మాత్రం భిన్నమైన రంగులో ఉండటం వల్ల చాలా ఆకర్షణీయంగా కనిపిస్తుందని, అనేక మంది ఫొటోలు సైతం దిగుతున్నారని కౌన్సిల్‌కు నచ్చజెప్పేందుకు ప్రయత్నించింది. ఐతే కౌన్సిల్‌ మాత్రం వెంటనే తలుపుకు తెలుపు రంగు మార్చాలని, లేదంటే రూ.19.10 లక్షలు ఫైన్‌ కట్టవలసి వస్తుందని హెచ్చరించింది. చేసేదిలేక వేరే కలర్‌ వేసేందుకు నిశ్చయించుకున్నట్లు డిక్సన్ మీడియాకు తెల్పింది.

మరిన్ని తాజా వార్తల కోసం క్లిక్ చేయండి.