ఆస్ట్రేలియాలో ఫేస్ బుక్ న్యూస్ ‘మాయం’, బ్లాక్ అయిన మీడియా కంటెంట్, ప్రధాని స్కాట్ ఫైర్
ఆస్ట్రేలియన్లు గురువారం న్యూస్ ఫీడ్స్ లేని ఖాళీ ఫేస్ బుక్ చూసి అవాక్కయ్యారు. ప్రభుత్వంతో తలెత్తిన వివాదం కారణంగా ఆశ్చర్యకరంగా ఈ దేశంలో ఫేస్ బుక్ మీడియా సమాచారాన్నంతటినీ బ్లాక్ చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తులో ఆన్ లైన్ ప్రచురణల విషయంలో ఇది ఓ రకంగా టెస్ట్ గా భావిస్తున్నారు. ఫేస్ బుక్ తీసుకున్న చర్యను ప్రధాని స్కాట్ మారిసన్ సహా న్యూస్ ప్రొద్యూసార్లు, మానవ హక్కుల లాయర్లు, మేధావులు అంతా తీవ్రంగా విమర్శించారు. అధికారిక హెల్త్ […]
ఆస్ట్రేలియన్లు గురువారం న్యూస్ ఫీడ్స్ లేని ఖాళీ ఫేస్ బుక్ చూసి అవాక్కయ్యారు. ప్రభుత్వంతో తలెత్తిన వివాదం కారణంగా ఆశ్చర్యకరంగా ఈ దేశంలో ఫేస్ బుక్ మీడియా సమాచారాన్నంతటినీ బ్లాక్ చేసేసింది. ప్రపంచ వ్యాప్తంగా భవిష్యత్తులో ఆన్ లైన్ ప్రచురణల విషయంలో ఇది ఓ రకంగా టెస్ట్ గా భావిస్తున్నారు. ఫేస్ బుక్ తీసుకున్న చర్యను ప్రధాని స్కాట్ మారిసన్ సహా న్యూస్ ప్రొద్యూసార్లు, మానవ హక్కుల లాయర్లు, మేధావులు అంతా తీవ్రంగా విమర్శించారు. అధికారిక హెల్త్ పేజీలు, ఎమర్జెన్సీ సేఫ్టీ వార్నింగులు, వెల్ ఫేర్ నెట్ వర్కులు అన్నీ న్యూస్ తో బాటు ఈ సాధనం నుంచి మాయమయ్యాయి. ఇది తమ దేశానికి శత్రుత్వ ధోరణి వంటిదని, హెల్త్, ఎమర్జెన్సీ సర్వీసులనుంచి ముఖ్యమైన సమాచారాన్ని బ్లాక్ చేయడం అత్యంత విచారకరమని స్కాట్ మారిసన్ తన సొంత ఫేస్ బుక్ పేజ్ లో పేర్కొన్నారు. ప్రభుత్వాల కన్నా తామే పెద్దవారమని, తమకు నిబంధనలు వర్తించబోవనే తరహాలో ఉన్న బడా కంపెనీల ప్రవర్తన పట్ల పలు దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయన్నారు.
కాగా న్యూస్ కంటెంట్ కు సంబంధించి ఆస్ట్రేలియా రూపొందించిన ముసాయిదా చట్టం సరైన నిర్వచనం ఇవ్వడంలేదని, పైగా తప్పుడు సమాచారాన్ని నిరోధిస్తామన్న హామీకి కట్టుబడి ఉన్నట్టు కనిపించలేదని ఫేస్ బుక్ ఆరోపించింది. అందువల్లే మీడియా కంటెంట్ ని నిలిపివేశామని వివరించింది.
మరిన్ని చదవండి ఇక్కడ :