శ్రీ జగన్నాథ్ సొసైటీ UK లండన్‌లో ఆలయాన్ని నిర్మించేందుకు ఒక ఆధ్యాత్మిక స్వచ్ఛంద సంస్థ నిధులు సేకరించేందుకు కృషి చేస్తోంది. ఈ నేపథ్యంలో ఒడిశాకు చెందిన ఒక వ్యాపారవేత్త ఈ ప్రయత్నానికి సహాయం చేయడానికి ఉదారంగా 250 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు. భారతదేశం వెలుపల విదేశాల్లో నిర్మిస్తున్న ఆలయానికి ఇంత భారీ మొత్తంలో విరాళం రావడం ఇదే తొలిసారి. బ్రిటన్ లో ఉంటున్న బిలియనీర్ బిశ్వనాథ్ పట్నాయక్, బ్రిటన్ లో మొట్టమొదటి జగన్నాథ ఆలయాన్ని నిర్మించడానికి నిధులను సేకరిస్తున్న స్వచ్ఛంద సంస్థకు రూ. 250 కోట్లు ఇచ్చాడు. పట్నాయక్ ఒడిశానుంచి బ్రిటన్ కు వచ్చారు. ఈ మొత్తాన్ని అక్షయ తృతీయ సందర్భంగా గత ఆదివారం అందజేసినట్టుగా లండన్ స్వచ్ఛంద సంస్థ ప్రకటించింది.
బ్రిటన్ లో బిశ్వనాథ్ పెట్టుబడుల సంస్థ ఫిన్ నెస్ట్ కంపెనీ స్థాపించారు. ప్రస్తుతం ఆయనే ఆ కంపెనీకి ఛైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దాదాపు లండన్ శివారులో జగన్నాథ్ స్వామి ఆలయం నిర్మించేందుకు అక్కడి స్థానికులు శ్రీ జగన్నాథ సొసైటీ యూకే అనే ఓ సంఘాన్ని ఏర్పాటు చేశారు. దాని ద్వారా దేశ వ్యాప్తంగా ప్రజల నుంచి విరాళాలు సేకరిస్తోంది. లండన్ శివార్లలోని 15 ఎకరాల స్థలంలో ఆలయాన్ని నిర్మించాలని ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపు 70 కోట్ల రూపాయల వసూళ్లతో ఆలయ నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నాయి. మొదటి దశ నిర్మాణం 2024 చివరి నాటికి పూర్తవుతుందని భావిస్తున్నారు.
Gajapati Maharaj Dibyasingha Deb felicitating India’s Deputy High Commissioner to UK Sujit Ghosh at the First Jagannatha Convention in London on Akshaya Trithiya 23rd April. Also seen with Amish Tripathy, @authoramish Minister of Culture and Director, The Nehru Centre London. pic.twitter.com/aX5p2dfMfJ
— Shree Jagannatha Society UK (@JagannathaUK) April 24, 2023
బ్రిటన్, ఐర్లాండ్ నలుమూలల నుండి 600 మందికి పైగా భక్తులు ఆలయానికి విరాళాలు ఇచ్చారు. ముఖ్యంగా, బ్రిటన్‌లోని భారత రాయబార కార్యాలయంలో కాన్సుల్ జనరల్ సుజిత్ ఘోష్, మంత్రి మరియు రచయిత అమిష్ త్రిపాఠి విరాళాలు అందించిన ప్రముఖులలో ఉన్నారు. ప్రస్తుతం బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ తన ఎన్నికల ప్రచార సమయంలో జగన్నాథ స్వామి ఆలయ నిర్మాణానికి హామీ ఇచ్చినట్లు తెలుస్తోంది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి. .