బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ చొరవ..అఫ్గానిస్తాన్ పై చర్చకు నేడు జీ-7 దేశాల కూటమి అత్యవసర సమావేశం..

| Edited By: Phani CH

Aug 24, 2021 | 10:46 AM

అఫ్గానిస్థాన్ పరిణామాలపై తీవ్రంగా కలత చెందుతున్న బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం జీ-7 దేశాలను అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు.

బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ చొరవ..అఫ్గానిస్తాన్ పై చర్చకు నేడు జీ-7 దేశాల కూటమి అత్యవసర సమావేశం..
Boris Johnson
Follow us on

అఫ్గానిస్థాన్ పరిణామాలపై తీవ్రంగా కలత చెందుతున్న బ్రిటిష్ ప్రధాని బోరిస్ జాన్సన్ మంగళవారం జీ-7 దేశాలను అత్యవసరంగా సమావేశపరుస్తున్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరగనున్న ఈ మీటింగ్ లో బ్రిటన్ తో బాటు అమెరికా, ఫ్రాన్స్, జపాన్, ఇటలీ, జర్మనీ తదితర దేశాలు పాల్గొంటున్నాయి. ఆగస్టు 31 లోగా కాబూల్ నుంచి బలగాలను ఉపసంహరించాలన్న అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ నిర్ణయం పట్ల అసంతృప్తిని వ్యక్తం చేస్తున్న బోరిస్ జాన్సన్..ఆఫ్ఘన్ పరిస్థితిపై అత్యవసరంగా చర్చలు జరపాలని కోరుతున్నారు. అందువల్లే జీ-7 దేశాల కూటమిని సమావేశపరచాలనుకుంటున్నట్టు ఈ నెల 22 న ఆయన ట్వీట్ చేశారు. ఆఫ్ఘన్ నుంచి ప్రజలను సురక్షితంగా తరలించేందుకు, మానవ సంక్షోభాన్ని నివారించడానికి అంతర్జాతీయ దేశాలు కలిసికట్టుగా కృషి చేయాలని ఆయన అభిలషిస్తున్నారు. నేడు జరగనున్న ఈ కూటమి సమావేశానికి ఆయన అధ్యక్షత వహించనున్నారు. ఈ నెల 31 డెడ్ లైన్ తరువాత కూడా అమెరికా, బ్రిటన్ దేశాలు కాబూల్ నగరంలో తమ బలగాలను కొనసాగిస్తాయా..అందుకు అవకాశాలు ఉన్నాయా అన్న ప్రధాన అంశంపై ప్రధానంగా ఈ సమావేశం చర్చించనున్నట్టు తెలుస్తోంది. అయితే సైనికుల పొడిగింపును తాము ఎంత మాత్రం అంగీకరించబోమని తాలిబన్లు ఇదివరకే హెచ్చరించారు. ఇదే జరిగితే తీవ్ర పరిణామాలను ఎదుర్కోవలసి ఉంటుందన్నారు.

ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గెటర్స్ కూడా మంగళవారం జరిగే జీ-7 దేశాల మీటింగ్ లో పాల్గొంటారని ఆయన తరఫు అధికార ప్రతినిధి ఒకరు ప్రకటించారు. అటు-ఆఫ్ఘన్ శరాణార్థులను తాము అదుకుంటామని, ఇందుకు 392 మిలియన్ డాలర్లను కేటాయించామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇదివరకే ప్రకటించారు. ఏమైనా..బలగాల పొడిగింపునకు సంబంధించిన అంశంపై 24 గంటల్లోగా తాము నిర్ణయం తీసుకుంటామని అమెరికా అధ్యక్షుడు జోబైడెన్ తాజాగా వెల్లడించారు. ఈ నెల 31 లోగా అమెరికన్లందరినీ సురక్షితంగా తరలించజాలమని ఆయన పేర్కొన్నారు. ఇంతకు ముందు ఈ డెడ్ లైన్ వరకే ఆఫ్ఘన్ లో తమ సైనికులు ఉంటారని ఆయన వ్యాఖ్యానించిన సంగతి గమనార్హం.

 

మరిన్ని ఇక్కడ చూడండి: కుల గణనకు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ అంగీకారం.. అయితే…

Zoo Bans Woman: జూకు వెళ్లి చింపాజీతో ప్రేమలో పడిన ఓ మహిళ.. ఆ మహిళను బ్యాన్ చేసిన అధికారులు.. ఎక్కడంటే