Turkey Drought: నీటి కరువుతో 45 రోజుల్లో ఎడారిగా మారనున్న ఆ దేశం.. త్వరలో బంగారం కంటే నీరు విలువైంది కానుందా ..!

సేవ్ వాటర్ సేవ్ ఎర్త్.. ప్రకృతి ప్రసాదించిన నీటిని అవసరం ఉన్నంతమేరకే వాడుకుందాం.. నీటిని వృధా చేస్తే.. భావితరాలకు నీరు బంగారం కంటే విలువైన వస్తువుగా మారుతుందని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. జనజీవనం అస్త్యవ్యస్థంగా మారబోతుంది అనడానికి టర్కీ దేశం...

Turkey Drought: నీటి కరువుతో 45 రోజుల్లో ఎడారిగా మారనున్న ఆ దేశం.. త్వరలో బంగారం కంటే నీరు విలువైంది కానుందా ..!
Follow us

|

Updated on: Jan 15, 2021 | 5:38 PM

Turkey Drought:సేవ్ వాటర్ సేవ్ ఎర్త్.. ప్రకృతి ప్రసాదించిన నీటిని అవసరం ఉన్నంతమేరకే వాడుకుందాం.. నీటిని వృధా చేస్తే.. భావితరాలకు నీరు బంగారం కంటే విలువైన వస్తువుగా మారుతుందని ఎప్పటి నుంచో నిపుణులు హెచ్చరిస్తూనే ఉన్నారు. మరోవైపు పెరుగున్న మానవ అవసరాలకు అనుగుణం అడుగుల నరికివేత.. దీంతో కాలానుగుణంగా కురవని వర్షాలు.. జనజీవనం అస్త్యవ్యస్థంగా మారబోతుంది అనడానికి టర్కీ దేశం ఉదాహరణగా నిలిచింది.

టూరిజానికి ప్రసిద్జి చెందిన టర్కీలో త్వరలోనే తీవ్ర కరువు తాండవించబోతుందని ఆదేశ నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరికొన్ని రోజుల్లోనే టర్కీలోని చాలా ప్రాంతాలు ఎడారిగా మారబోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడూ నీటితో కళకళలాడే ఇస్తాంబుల్ త్వరలోనే ఎడారిలా మారబోతుందని వాపోతున్నారు. అవును రాబోయే 45 రోజుల్లో టర్కీలోని నదులు, జలాశయాలలో పాటు పలు డ్యామ్ ల్లో నీరు ఎడిపోయి తీవ్ర కరువు రాబోతుందట. ప్రధానం నగరాల్లో వచ్చే కొన్ని నెలల్లో నీళ్లు ఎండిపోయి ఎడారిని తలపించన్నాయని చెప్పారు.

నీటి ఎద్దటికి కారణం ఆదేశంలో గత కొన్నేళ్లుగా సరైన వర్షాలు కురవడం లేదని.. అతి తక్కువ వర్షపాతం నమోదవుతూ.. దశాబ్ద కాలం తర్వాత ఇప్పుడు కరువుకు కారణం అయ్యిందని తెలిపారు. ఇప్పుడు 17 మిలియన్ల టర్కీ ప్రజలు నీటి కొరతను ఎదుర్కోనున్నారు. మరో ఇప్పటికే ఓ వైపు ఆ దేశంలో అతిపెద్ద నగరాలైన ఇజ్మీర్ , బ్యుర్సాలోని డ్యామ్ ల్లో 36శాతం, 24శాతం మేర నీళ్లు ఎండిపోయాయి. రానున్న మరో 110 రోజుల్లో ఆదేశంలో మిగిలిన డ్యాములు, రిజర్వాయర్లలోని నీరు కూడా ఎండిపోయే పరిస్థితి రానుందని తెలుస్తోంది.  అయితే ప్రస్తుతం టర్కీ పరిస్థితి మిగిలిన దేశాలకు హెచ్చరిక అని చెప్పవచ్చనని కొంతమంది నిపుణులు అంటున్నారు. ఇప్పటికైనా మనిషి మేలుకుని నదులను సంరక్షించుకోవాలని.. వాటర్ ని జాగ్రత్తగా వాడుకోవాలని సూచిస్తున్నారు.

Also Read:  ఇంటర్నెట్ లో చూసి ఓ యువకుడు సొంత వైద్యం.. రక్తంలో పెరిగిన పుట్టగొడుగులు