Man Injects Mushrooms Tea: ఇంటర్నెట్ లో చూసి ఓ యువకుడు సొంత వైద్యం.. రక్తంలో పెరిగిన పుట్టగొడుగులు..ఆపై..
సొంత వైద్యంతో కొందరు... యూట్యూబ్ లో చూసి కొందరు వైద్యం చేసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అతి తెలివి త్వరగా తగ్గిపోవాలని అత్యుత్సాహంతో చేసిన పని ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది. భూమిమీద పెరగాల్సిన పుట్టగొడులు రక్తంలో...

Man Injects Mushrooms Tea: సొంత వైద్యంతో కొందరు… యూట్యూబ్ లో చూసి కొందరు వైద్యం చేసుకుని ప్రాణాలు మీదకు తెచ్చుకుంటున్నారు. తాజాగా ఓ యువకుడు అతి తెలివి త్వరగా తగ్గిపోవాలని అత్యుత్సాహంతో చేసిన పని ఏకంగా ప్రాణాల మీదకు తెచ్చింది. భూమిమీద పెరగాల్సిన పుట్టగొడులు రక్తంలో పెరిగేలా చేసింది.. ఇంటర్నెట్ ఆధారంగా చేసుకున్న వైద్యం ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలియజేస్తూ.. అకాడమి ఆఫ్ కన్సులేషన్-లియిసన్ సైకియాట్రీ’ జర్నల్‌లో ఓ అరుదైన కేసుని ప్రచురించింది
మాదకద్రవ్యాలకు బానిసైన అమెరికాకు చెందిన ఓ యువకుడు (బాధితుడి వివరాలను గోప్యంగా ఉంచారు) తన అలవాట్ల నుంచి బయటపడాలని భావించాడు. ఈ ప్రయత్నంలో బైపోలార్ డిజార్డర్ కు గురయ్యాడు. దీంతో డాక్టర్స్ కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చారు. అయితే కొన్నాళ్ళు వాడి..తర్వాత మందులు వాడడం మానేశాడు. అనంతరం సొంత వైద్యంపై దృష్టి పెట్టాడు. మానసిక ఆందోళన తగ్గడానికి మార్గాలను ఇంటర్నెట్‌లో వెదికాడు.. మానసిక ఆందోళనను, ఒత్తిళ్లను దూరం చేయడంలో సిలోసెబిన్ పుట్టగొడుగులు ఉపయోగపడతాయని తెలుసుకున్నాడు.
అయితే వాటిని ఆహారంగా తీసుకోవాలి.. అలా తింటే తన అనారోగ్యం తగ్గడానికి చాలా సమయం పడుతుంది.. త్వరగా తగ్గడానికి వేరే మార్గం ఎంచుకున్నాడు. పుట్టుగొడుగులను రక్తంలోకి నేరుగా ఎక్కించుకుంటే త్వరగా వ్యాధి నయమవుతుందని భావించాడు. వెంటనే అమలులో పెట్టాడు. పుట్టగొడుగులను సేకరించి మరగబెట్టాడు. ఆ నీటిని వడబోసి టీ తయారు చేశాడు. ఆ టీని ఇంజక్షన్ రూపంలో తన రక్తంలోకి ఎక్కించుకున్నాడు అంతే.. రెండు రోజులకే యువకుడు అస్వస్థతకు గురయ్యాడు. మొదట నీరసం, రక్తంతో వాంతులు జరిగాయి. ఆ తర్వాత కామెర్లు, డయేరియా వచ్చాయి. దీంతో కుటుంబసభ్యులు అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే డాక్టర్స్ వైద్యం చేస్తున్న సమయంలో కూడా తాను చేసిన పనిని చెప్పలేదు.. ఆ యువకుడికి పరీక్షలు నిర్వహించిన డాక్టర్స్ ఆశ్చర్య పోయారు. అతడి అవయవాలు పనిచేయడం మానేసినట్లు తెలుసుకున్నారు. వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయే ప్రమాదం ఉందని వైద్యులు అతడికి తెలిపారు. దీంతో అతడు అసలు విషయాన్ని తెలిపాడు.
అతడు తీసుకున్న పుట్టగొడుగుల టీ వల్ల రక్తంలో పుట్టగొడుగులు పెరగడం ప్రారంభించాయి. బాధితుడు పుట్టగొడుగులను వేడి చేయడం ద్వారా అందులో ఫంగస్‌ను నాశనం చేసినట్లు భావించాడు. కానీ, అది పూర్తిగా అంతం కాలేదు. అతడి శరీరంలోకి వెళ్లి పెరగడం మొదలయ్యాయి. దీంతో వైద్యులు అతడికి కృత్రిమ శ్వాస అందించి.. శరీరంలోని రక్తాన్ని ఫిల్టర్ చేయడం మొదలుపెట్టారు.యువకుడిని కాపాడేందుకు వైద్యులు శతవిధాల ప్రయత్నించారు. 22 రోజుల చికిత్స తర్వాత బాధితుడు కోలుకున్నాడు. చికిత్సంలో భాగంగా రక్తంలో పుట్టగొడుగులు పెరగకుండా వైద్యులు అతడికి కొన్ని యాంటీ ఫంగల్ డ్రగ్స్ అందించారు. దీంతో అతడు ప్రాణాలతో బయటపడ్డాడు నిజానికి బాధితుడు వాడిన పుట్టగొడుగులను మ్యాజిక్ మష్‌రూమ్స్ అని కూడా పిలుస్తుంటారు. నిజంగానే ఈ రకం పుట్టగొడుగులకు ఔషధ లక్షణాలు ఉన్నాయి. వీటితో వైద్యులు మెడికల్ ట్రయల్స్ కూడా చేస్తున్నారు. అయితే ఎవరైనా యూట్యూబ్ ల్లోనూ ఇంటర్నెట్ ల్లో చూసి సొంతం వైద్యం చేసుకుంటే ఒకొక్కసారి ప్రాణాలు కూడా పోయే అవకాశం ఉంది కనుక జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.
Also Read: అణ్వాయుధాలు రెట్టింపు చేస్తామంటూ ప్రపంచాన్ని ఉల్కిపడేలా చేస్తున్న ఆధునిక నియంత