Afghanistan Crisis: ఆఫ్ఘన్ శరణార్థులను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో గోడ కడుతున్న టర్కీ!

ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ తర్వాత ప్రజలు వలస వెళ్లడం గురించి పొరుగు దేశాల ఆందోళనలు పెరిగాయి.

Afghanistan Crisis: ఆఫ్ఘన్ శరణార్థులను అడ్డుకోవడానికి సరిహద్దుల్లో గోడ కడుతున్న టర్కీ!
Turkey Wall On Border
Follow us

|

Updated on: Aug 17, 2021 | 8:58 PM

Afghanistan Crisis: ఆఫ్ఘనిస్తాన్‌లో తాలిబాన్ల ఆక్రమణ తర్వాత ప్రజలు వలస వెళ్లడం గురించి పొరుగు దేశాల ఆందోళనలు పెరిగాయి. వాస్తవానికి, ఆఫ్ఘనిస్తాన్ పౌరులు సురక్షితమైన ప్రదేశం కోసం ఏదైనా మార్గం ద్వారా దేశం విడిచి వెళ్లాలనుకుంటున్నారు. చాలామంది తజికిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఇరాన్, టర్కీ, పాకిస్తాన్ లకు పారిపోతున్నారు. అందువల్ల టర్కీ ఇరాన్ సరిహద్దులో 295 కిమీ పొడవు గోడను నిర్మిస్తోంది, తద్వారా ఆఫ్ఘన్ శరణార్థులను నిలిపివేయవచ్చని భావిస్తోంది.

టర్కీ అధికారుల ప్రకారం, ఇప్పుడు ఈ సరిహద్దులో కేవలం 5 కిలోమీటర్ల పని మాత్రమే మిగిలి ఉంది. మిగిలిన సరిహద్దు అంటా గోడ నిర్మాణం పూర్తి అయింది.  టర్కీలో ఇప్పటికే మిలియన్ల మంది సిరియన్ శరణార్థులు ఉన్నారు. అటువంటి పరిస్థితిలో, శరణార్థుల భారం మరింత పెరగాలని టర్కీ కోరుకోవడం లేదు.

టర్కీ రక్షణ మంత్రి హులుసి అకర్ మాట్లాడుతూ, ”మేము మాడ్యులర్ వాల్ నిర్మిస్తున్నాం. అందులో ప్రధాన భాగం పూర్తయింది. సరిహద్దు ప్రాంతాల్లో భద్రతను పెంచాం. ఒక నివేదిక ప్రకారం, తూర్పు సరిహద్దు నుండి ప్రతిరోజూ కనీసం పది వేల మంది  ఆఫ్ఘన్ శరణార్థులు టర్కీలోకి ప్రవేశిస్తున్నారు.” అని చెప్పారు.

ఆఫ్ఘన్ శరణార్థుల కోసం సరిహద్దులను తెరిచి ఉంచండి

ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెర్రెస్ ఆఫ్ఘన్ పౌరుల ప్రాణాలను కాపాడటంలో, మానవతా సహాయం అందించడంలో సంయమనం పాటించాలని తాలిబాన్,  అన్ని ఇతర పార్టీలకు విజ్ఞప్తి చేశారు. మానవతా ప్రాతిపదికన ఆఫ్ఘన్ శరణార్థులను ఒప్పుకోవాలని అన్ని దేశాలకు గుటెర్రెస్ పిలుపునిచ్చారు.

ఆఫ్ఘన్ అధ్యక్షుడు..ఉపాధ్యక్షుడు తజికిస్తాన్‌కు పారిపోయారు

ఆఫ్ఘన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ, ఉపాధ్యక్షుడు అమృల్లా సలేహ్, పలువురు సైనిక అధికారులు రెండు రోజుల క్రితం తజికిస్తాన్‌కు పారిపోయారు. అంతకుముందు, కాబూల్‌లోని రష్యన్ రాయబార కార్యాలయం ఆఫ్ఘనిస్తాన్ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ గురించి దిగ్భ్రాంతికరమైన విషయాన్ని వెల్లడించింది.

సోమవారం, రష్యా యొక్క RIA వార్తా సంస్థ తన రాయబార కార్యాలయాన్ని ఉటంకిస్తూ – ఘని దేశం నుండి పారిపోతున్నప్పుడు తనతో పాటు నాలుగు కార్లు, నగదును హెలికాప్టర్‌లో తీసుకెళ్లారు. నగదు మొత్తం చాలా ఉంది. కాబూల్ విమానాశ్రయంలో చాలా నగదు దొరికిందని తాలిబాన్ ప్రకటించింది. ఇది 5 మిలియన్ డాలర్లకు దగ్గరగా ఉందని చెబుతున్నారు. కానీ దీనిని నిర్ధారించలేదు. ఇప్పుడు కాబూల్‌లోని రష్యా రాయబార కార్యాలయం దీనిని ధృవీకరించింది.

Also Read: Afghanistan Crisis: అఫ్గాన్ నుంచి పారిపోయినట్లే గతంలోనూ నాలుగుసార్లు చేతులెత్తేసిన అమెరికా! ఎక్కడెక్కడంటే..

RGV On Talibans: తాలిబన్లను సైతం వదలని రామ్‌ గోపాల్‌ వర్మ.. ట్వీట్‌ చూస్తే నవ్వు ఆపుకోలేరు.