రెండోసారి ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల ఫలితాలు ఆపాలంటూ వేసిన పిటిషన్ కొట్టివేత

మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు చుక్కెదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలనుకున్న అధ్యక్షుడు ట్రంప్‌నకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది.

రెండోసారి ట్రంప్ అభ్యర్థనను తిరస్కరించిన సుప్రీంకోర్టు.. ఎన్నికల ఫలితాలు ఆపాలంటూ వేసిన పిటిషన్ కొట్టివేత
Follow us

|

Updated on: Dec 13, 2020 | 4:31 AM

మరోసారి అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్‌నకు చుక్కెదురైంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను ప్రకటించకుండా అడ్డుకోవాలనుకున్న అధ్యక్షుడు ట్రంప్‌నకు సుప్రీంకోర్టు షాక్ ఇచ్చింది. నాలుగు కీలక రాష్ర్టాల్లో ఓటింగ్‌ ప్రక్రియ నిబంధనలకు విరుద్ధంగా జరిగిందని ఆరోపించారు. ఇందుకు అక్కడి ఎన్నికల ఫలితాలను నిలిపివేయాలని టెక్సాస్‌కు చెందిన రిపబ్లికన్లు దాఖలు చేసిన పిటిషన్‌ను కోర్టు కొట్టివేసింది. రిపబ్లికన్ల ఆరోపణలకు తగిన ఆధారాలు లేవని పేర్కొంటూ పిటిషన్‌ను తిరస్కరించింది సుప్రీంకోర్టు. రిపబ్లికన్ల పిటిషన్‌ను కోర్టు తోసిపుచ్చడం ఈ వారంలో ఇది రెండోసారి. ఎన్నికల ఫలితాల నిలుపుదలకు చివరి ప్రయత్నం విఫలమైంది. మరోవైపు, అధ్యక్ష ఎన్నికల ఫలితాలను సోమవారం అధికారికంగా ప్రకటించనున్నట్టు సమాచారం. తర్వాత ఎలక్టోరల్‌ కాలేజీ సమావేశమై నూతన అమెరికా అధ్యక్షుడిని ఎన్నుకొంటుంది. ఇక, ఇప్పటికే ఎన్నికలు పూర్తి చేసుకున్న అమెరికాలో 538 మంది సభ్యులున్న ఎలక్టోరల్‌ కాలేజీలో జో బైడెన్‌ 306, ట్రంప్‌ 232 ఓట్లు గెలుచుకున్నారు. దీంతో జో బైడెన్‌ను లాంఛనంగా కొత్త అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు.