అబ్బ అదృష్టం ఇదీ.. లాటరీలో అక్షరాలా రూ.13 వేల కోట్లు జాక్‌పాట్! రాత్రికి రాత్రే ఏళ్లనాటి శని
బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయనే.. సామెత వినే వుంటారు. కాలం ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెడుతుందో ఎవరూ ఊహించలేరు. అదృష్టం కలిసొస్తే రాత్రికి రాత్రే బిచ్చగాడు కోటీశ్వరుడైపోవచ్చు.. దురదృష్టం వెంటాడితే అంబానీ అయినా రోడ్డుపై నిలబడాల్సిందే. తాజాగా ఓ వ్యక్తికి లాటరీ టికెట్ ద్వారా సుమారు రూ.13 వేల కోట్లు జాక్‌పాట్ తగిలింది. దీంతో ఒక్కసారిగా బిలియనీర్ల లిస్టులో అతని పేరు చేరిపోయింది. ఇంతకీ ఎవరతను.. ఎక్కడ జరిగిందంటే..
ఫ్లోరిడా, ఆగస్టు 10: బండ్లు ఓడలవుతాయి.. ఓడలు బండ్లవుతాయనే.. సామెత వినే వుంటారు. కాలం ఎవరిని ఎప్పుడు ఎక్కడ నిలబెడుతుందో ఎవరూ ఊహించలేరు. అదృష్టం కలిసొస్తే రాత్రికి రాత్రే బిచ్చగాడు కోటీశ్వరుడైపోవచ్చు.. దురదృష్టం వెంటాడితే అంబానీ అయినా రోడ్డుపై నిలబడాల్సిందే. తాజాగా ఓ వ్యక్తికి లాటరీ టికెట్ ద్వారా సుమారు రూ.13 వేల కోట్లు జాక్‌పాట్ తగిలింది. దీంతో ఒక్కసారిగా బిలియనీర్ల లిస్టులో అతని పేరు చేరిపోయింది. ఇంతకీ ఎవరతను.. ఎక్కడ జరిగిందనే కదా మీ అనుమానం. ఆ వివరాల్లోకెళ్దాం రండి..
ఫ్లోరిడాకు చెందిన ఓ వ్యక్తి (విజేత వివరాలు తెలుపలేదు) నెఫ్యూన్ బీచ్‌లోని పబ్లిక్స్ స్టోర్ నుంచి ఓ లాటరీ టికెట్ విక్రయించాడు. దాదాపు నాలుగు నెలల నిరీక్షణ తర్వాత లాటరీ నిర్వాహకులు మంగళవారం డ్రా తీశారు. మొత్తం టికెట్లలో 13, 19, 20, 32, 33, 14 నంబరు టికెట్‌కు జాక్‌పాట్ తగిలినట్లు ప్రకటించారు. దాదాపు 1.58 బిలియన్ డాలర్లను విజేత గెలుచుకున్నాడు. అంటే భారతీయ కరెన్సీలో అక్షరాలా రూ.13 వేల కోట్లు. అమెరికా చరిత్రలోనే ఇది అత్యంత అరుదైన జాక్‌పాట్‌గా మీడియా వర్గాలు వెల్లడించాయి. ఇది మూడో అతి పెద్ద లాటరీ ప్రైజ్ మనీ వెల్లడించాయి.
ఈ రికార్డ్-బ్రేకింగ్ సక్సెస్ అందుకొన్న విజేత వివరాలు భద్రత రిత్య బయటపెట్టలేదు. ఇక డ్రాలో గెలుపొందిన 1.58 బిలయన్ డాలర్ల నగదును ఏడాదికి కొంత మొత్తం చొప్పున 30 ఏళ్లపాటు చెల్లిస్తామని లాటరీ నిర్వహకులు తెలిపారు. ఐతే మొత్తం నగదు ఒకేసారి పొందాలంటే అతనికి కేవలం 783.3 మిలియన్ డాలర్లు మాత్రమే దక్కుతాయని వారు తెలిపారు. అంటే రూ.6,488 కోట్లన్నమాట. మొత్తం లాటరీ బిజినెస్‌లోనే ఇది అరుదైన రికార్డుగా వారు పేర్కొన్నారు. గతేడాది (2022) నవంబర్‌లో కాలిఫోర్నియాలో ఓ వ్యక్తికి 2 బిలియన్ డాలర్ల జాకాపాట్ లాటరీలో తగిలింది. ఈ ఏడాది ప్రారంభంలో మైనేలో 1.35 బిలియన్ డాలర్ల లాటరీ తగిలింది. ఈ రెండింటి తర్వాత తాజాగా ఫోరిడాకు చెందిన వ్యక్తికి పెద్ద మొత్తంలో లాటరీ తగలడంతో ఈ విషయం కాస్తా సోషల్ మీడియాలో వైలర్‌గా మారింది.
మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.