AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Money Tree in UK: ఆ గ్రామంలో చెట్లకు డబ్బులు .. తీసుకుంటే వ్యాధులు వస్తాయంటున్న స్థానికులు

Money Tree in UK: సర్వసాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులనో.. స్నేహితులనే డబ్బులు అడిగితే.. సరదాగా కొందరు.. ఆ సమయంలో ఉన్న పరిస్థితులను బట్టి.. ఏంట్రా ఎన్నిసార్లు..

Money Tree in UK: ఆ గ్రామంలో చెట్లకు డబ్బులు .. తీసుకుంటే వ్యాధులు వస్తాయంటున్న స్థానికులు
Money Trees In Uk
Follow us
Surya Kala

|

Updated on: Sep 30, 2021 | 9:38 AM

Money Tree in UK: సర్వసాధారణంగా ఇంట్లో తల్లిదండ్రులనో.. స్నేహితులనే డబ్బులు అడిగితే.. సరదాగా కొందరు.. ఆ సమయంలో ఉన్న పరిస్థితులను బట్టి.. ఏంట్రా ఎన్నిసార్లు ఇవ్వాలి డబ్బులు..  చెట్లకు కాస్తున్నాయా అని అనేవారు కొందరైతే.. మరికొందరు ఉండు వెళ్లి.. చెట్లకు కాస్తున్నాయి డబ్బులు వెళ్లి తెంపుకుని వచ్చి ఇస్తాను అంటూ కొంచెం వెటకారం జోడించి సమాధానం చెప్పేవారు కొంటారు..అయితే చెట్లకు డబ్బులు కాయం అన్నమాట .. ఒక్క బ్రిటన్ లోని ఒక గ్రామంలో నిజం అనిపిస్తుంది. అవును ఆ గ్రామంలోని చెట్ల నిండా నాణేలు ఉంటాయి. ఒకొక్క చెట్టుకు వేల రూపాయల నాణేలు ఉంటాయి. అయితే ఈ చెట్లనుంచి ఒక్క కాయిన్  తీసుకోరు. తీసుకోవాలన్న ఆలోచన కూడా చేయరు. అలా ఎవరైనా తీసుకుంటే.. వారిని దరిద్రం వెంటాడుతాదని ఆ గ్రామస్థుల నమ్మకం. వివరాల్లోకి వెళ్తే..

యూకే లో కొండలపైన పోర్ట్ మేరియన్ అనే గ్రామం ఉంది. ఈ గ్రామంలోని పెద్ద పెద్ద చెట్లు పడిపోయినట్లు గా కిందకు వాలి ఉంటాయి. అయితే ఆ చెట్లపై చాలా నాణాలు ఉంటాయి. ఇలా ఈ చెట్లు కొన్ని వందల సంవత్సరాల నుంచి ఉన్నాయట. అంతేకాదు.. ఆ చెట్లకు దిగబడి ఉన్న నాణేల్లో చాలా ఇప్పడు చెలామణీలోలేవు.  ఈ నాణాల చెట్లను చూసేందుకే పర్యాటకులు ప్రత్యేకంగా వెళతారు. 2011 సంవత్సరంలో ఈ చెట్ల నాణేలు గురించి ప్రపంచంలోకి వెలుగులోకి వచ్చింది. అప్పుడు పరిశోధకులు  రంగంలోకి దిగి.. ఇలా చెట్లకు ఎవరు, ఎందుకు నాణాలను మేకుల్లా దిగకొట్టారని తెలుసుకునేందుకు  అన్వేషణ మొదలు పెట్టారు. చుట్టుపక్కల గ్రామస్థులతో మాట్లాడారు.. ముఖ్యంగా పెద్దవారితో నాణేల చెట్ల గురించి అడిగి తెలుసుకున్నారు.

డబ్బు చెట్టు-మూఢనమ్మకం: 

ఈ డబ్బుల చెట్లు స్థానికుల పురాతన సంప్రదాయం, మూఢనమ్మకాల వలన ఏర్పడ్డాయి. చెట్టు కాండం లోపల నాణెంను దిగ్గొడితే.. ఆ వ్యక్తులకు  అదృష్టం కలిసి వస్తుందని.. మంచి ఆరోగాన్ని ఇస్తుందని కొంతమంది నమ్మకం. ముఖ్యంగా అనారోగ్యంతో ఉన్న వ్యక్తి చెట్టులో నాణెం నొక్కితే అది వారి అనారోగ్యాన్ని దూరం చేస్తుందని స్థానికుల నమ్మకం. అంతేకాదు.. ఎవరైనా ఆ నాణేన్ని తిరిగి చెట్టునుంచి బయటకు తీయాలని చూస్తే అటువంటివారు తీవ్ర అనారోగ్యానికి గురవుతారని కొందరు నమ్ముతారు.

ఈ విచిత్రమైన సంప్రదాయం ఎలా మొదలైందంటే: 

చెట్లలో నాణేలను పెట్టె సంప్రదయం 1700 లలో ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఆ చెట్లలో ఉన్న నాణేలు ఎక్కువగా అప్పటికి చెందిన రెండణాలే ఎక్కువగా కనిపిస్తాయి.  ముఖ్యంగా పోర్ట్ మేరియన్ గ్రామస్థులు అప్పట్లోనే చెట్లను దేవతలుగాభావించేవారని తెలుస్తోంది. ఆ ఆకాలంలో ఈ చెట్లని వారు ఆరోగ్యాన్ని ప్రసాదించే దేవతలుగా కొలిచేవారు. దీంతో ఎవరైనా వ్యాధ్యుల బారిన పడితే.. మొక్కుకుని ఇలా ఒక నాణెం తీసుకుని చెట్టుకు మేకులా కొట్టేవారు. దీంతో ఇలా వేలాది మంది చేయడంతో చెట్లన్నీ నాణాలతో నిండిపోయాయి. అప్పటి ప్రజల్లో అనారోగ్యం పాలైన వ్యక్తి తన చేతులతో తానే ఆ నాణాన్ని చెట్టుకు కొట్టాలన్న నమ్మకం కూడా ఉండేదట . ఆ నాణాన్ని ఎవరైనా లాగే ప్రయత్నం చేస్తే రోగాలబారిన పడతారని నమ్మేవారు. అందుకే వాటిని తీయడానికి ఎవ్వరూ ప్రయత్నించలేదు. ఇదే విషయంపైనా గ్రామంలోని నేటి జనరేషన్ మాట్లాడుతూ.. తమకు ఇప్పుడు ఆ నమ్మకాలు, ఆచారాలు లేవని.. చెబుతున్నారు.

అయితే అప్పట్లో ఇలా చెట్లకు నాణేలు దింపడంవలన ఎంతవరకూ రోగాలు నయం అయ్యాయో తెలియదు కానీ.. ఈ చెట్లు చూడడగానే ఒక ప్రత్యేకమైన ఆధ్యాత్మిక ఫీలింగ్ ను కలిగిస్తున్నాయని పర్యాటకులు చెబుతున్నారు.

Also Read: Kanika Niti: అధికారం పొందాలంటే ఎదుటివారిపై కోపం వచ్చినా.. చిరునవ్వుతో డీల్ చేయాలంటున్న కణిక నీతి..

Dog Meat Ban: శతాబ్దాల సంప్రదాయ ఆహారం కుక్క మాంసంపై ఇక నిషేధం.. కీలక ఆదేశాలు జారీ చేసిన దేశ అధ్యక్షుడు..