AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kanika Niti: అధికారం పొందాలంటే ఎదుటివారిపై కోపం వచ్చినా.. చిరునవ్వుతో డీల్ చేయాలంటున్న కణిక నీతి

Kanika Niti: మహాభారతం నేటి మానవుడి జీవన ప్రయాణానికి ప్రామాణికంగా నిలుస్తుంది. భీష్ముడు, విదురుడు వంటివారు మంచి గురించి, మంచి పరిపాలన గురించి చెబితే.. శకుని..

Kanika Niti: అధికారం పొందాలంటే ఎదుటివారిపై కోపం వచ్చినా.. చిరునవ్వుతో డీల్ చేయాలంటున్న కణిక నీతి
Kanik Niti
Surya Kala
|

Updated on: Sep 30, 2021 | 9:01 AM

Share

Kanika Niti: మహాభారతం నేటి మానవుడి జీవన ప్రయాణానికి ప్రామాణికంగా నిలుస్తుంది. భీష్ముడు, విదురుడు వంటివారు మంచి గురించి, మంచి పరిపాలన గురించి చెబితే.. శకుని, శకుని తనయుడు కణికుడు వంటివారు దుష్టబుద్దితో.. చెడుని మంచిగా చూపిస్తూ.. వారి వేళ్ళతో వారి కన్నునే పొడిచే విధంగా చేశారు. ఇంకా చెప్పాలంటే నేటి సమాజంలోని మూర్ఖుల ఆలోచన ఎలా ఉంటుంది.. అనేది ఈ పాత్రల ద్వారా తెలుస్తుంది. కొందరి హితోక్తులు వినడానికి చాలా బాగుంటుంది. ఇంకా చెప్పాలంటే.. అవి నిజమేమో అలా చేస్తే.. మనం విజయాన్నీ పొందుతామేమో అనే ఆలోచన కలిగిస్తాయి.. మన మేలు కోరుకొనే ప్రత్యేకంగా చెబుతుంటే, వినకపోతే ఎలాగన్నట్లుగా అనిపిస్తాయి. దీనికి ఉదాహరణ కణికుడి హితోక్తులు. ధృతరాష్ట్రుడి మంత్రుల్లో కణికుడు ఒకడు. కూటనీతిని ఉపదేశించడంలో ఘటికుడు. కణికుడు రాజనీతి విశారదుడు. ‘పాండవుల విషయంలో ఎలాంటి రాజనీతిని పాటించాలి?’ అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు కణికుడి జవాబు ఇది- ‘శత్రువు ఎంత వేడుకున్నా విడిచిపెట్టకూడదు. ఏదో ఒక ఉపాయంతో శత్రువును నశింపజేయాలి. దుర్బలుడే గదా అని ఉపేక్షించకూడదు.  మనకు గురువైనా, పుత్రుడైనా, మిత్రుడైనా, తండ్రి అయినా, ఇంకెంత ఆత్మీయుడైనా శత్రుస్థానంలో ఉంటే చాలు… అతణ్ని తప్పక చంపాలి.  చిరునవ్వుతో మాట్లాడాలి. దెబ్బతీసి, తరవాత అతడి కోసం ఏడవాలి. అందర్నీ అనుమానిస్తూ ఉండాలి. అన్ని పనులూ రహస్యంగా చేయాలి.

దండం చేతగానీ దుష్టులు లొంగరు .. వారిని నిత్యమూ దండించాల్సిందే! తనలోపాలేవీ తెలియకుండా దండించాలి. దుష్టుడు అయిన శత్రువు దుర్బలుడే కదా అని ఉపేక్షించరాదు. చిన్నపాము నయినా పెద్దకర్రతో కొట్టాలి. ముందు వారిని అన్నివిధాలుగా నమ్మించి తరువాత తోడేలు మీద పడ్డట్లుగా వాళ్ళమీద పడి నశింపచేయాలి. అవసరమయితే కొంతకాలం శత్రువును కూడా భుజం మీద మోయాలి. సరైన సమయం చూసి కుండను రాయిమీద పడేసి బ్రద్దలుకొట్టినట్లు కొట్టివేయాలి. దుష్టుడైన శత్రువును ఎంతదీనంగా వేడుకున్నా విడిచిపెట్టరాదు. సామ, దాన, భేద దండోపాయాలలో ఒకటికానీ అన్నీకాని ప్రయోగించి శత్రువును నశింపచేయాలి.

పిరికి వాడిని భయం చూపి భేదించాలి శూరుడిని నమస్కరించి భేదించాలి ధనాశ కలవాడికి ధనం ఎర చూపి , సమబలుణ్ణీ, దుర్బలుణ్ణీ బలం ప్రయోగించి భేదించాలి. నీకు అభివృద్ధి కావాలనుకుంటే ఎదుటివాడు పుత్రుడైనా, మిత్రుడైనా, సోదరుడైనా, తండ్రియైనా, గురువైనా, శత్రుస్థానంలో ఉంటే వాడిని నిర్దాక్షిణ్యంగా పరిమార్చాలి. అబద్ధం చెప్పి అయినా సరే, డబ్బిచ్చి అయినా సరే, విషమిచ్చి అయినా, మాయచేతయినా శత్రువును సంహరించాలి. మంచిచెడ్డలు తెలియక చెడుమార్గంలో ప్రయాణిస్తున్న గురువునైనా శాసించి అదుపులో పెట్టాలి. ఎంతకోపం వచ్చినా కనపడ కూడదు, చిరునవ్వుతో మాట్లాడాలి కోపంతో ఎవ్వరినీ చీదరించుకొనరాదు. ఎదుటివాడిని దెబ్బతీసేముందు, దెబ్బతీసిన తరువాత కూడా ప్రియం గానే మాట్లాడాలి. దెబ్బతీసిన తరువాత జాలిపడాలి, పశ్చాత్తాపం చూపాలి అవసరమైతే వాడికోసం ఏడవాలి కూడా అని చెప్పాడు కణికుడు.

Also Read:   అర్ధరాత్రి పోలీసులకు షాక్ ఇచ్చిన సీఎం స్టాలిన్.. పోలీస్ స్టేషన్‌లో తనిఖీలు.. సమస్యలపై ఆరా..