Viral: రోడ్డుపై భార్యకు డెలివరీ చేసిన భర్త.. బిడ్డ బొడ్డు తాడు కట్ చేయకుండా.. ఏం చేశాడో తెలిస్తే ఫ్యూజులౌట్
భార్య నిండు గర్భిణీ.. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న ఆ ఇంట్లోకి మరొకరిని ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూశారు. వారొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. భార్యకు నెలలు...

భార్య నిండు గర్భిణీ.. అప్పటికే ఇద్దరు పిల్లలు ఉన్న ఆ ఇంట్లోకి మరొకరిని ఆహ్వానించేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. బిడ్డ కోసం ఆతృతగా ఎదురు చూశారు. వారొకటి తలిస్తే విధి మరొకటి తలిచింది. భార్యకు నెలలు నిండటంతో పురిటి నొప్పులు ప్రారంభమయ్యాయి. వెంటనే అలర్ట్ అయిన భర్త ఆమెను కారులో ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. హాస్పిటల్ కు వెళ్తుండగా మధ్యలోనే ఆమెకు పురిటినొప్పులు అధికమయ్యాయి. తట్టుకోలేక విలవిల్లాడిపోయింది. ఇక చేసేదేమీ లేక భర్తే ఆమెకు డెలివరీ చేశాడు. పుట్టిన బిడ్డకు బొడ్డు తాడు కట్ చేయకుండా ఛార్జర్లతో ముడి వేశాడు. తర్వాత ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అమెరికాలోని ఇండియానా ప్రాంతానికి చెందిన స్టీఫెన్ కు ఎమిలీ అనే మహిళతో వివాహమైంది. ఈ దంపతులు ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చారు. అనంతరం ఎమిలీ మరోసారి గర్భం దాల్చింది. ఆమెకు నెలలు నిండటంతో ఈ నెల 12న పురిటినొప్పులు ప్రారంభమయ్యాయి. అంబులెన్స్ లో తీసుకువెళ్తే ఆలస్యమవుతుందని భావించిన స్టీఫెన్ ఎమిలీని కారులో ఎక్కించుకుని హాస్పిటల్ కు తీసుకువెళ్లాడు. ఆస్పత్రికి వెళ్తుండగా మార్గమధ్యంలో ఎమిలీకి నొప్పులు అధికమయ్యాయి. గత్యంతరం లేని పరిస్థితుల్లో స్టీఫెన్ ఆమెకు ప్రసవం చేశాడు.

Baby Delivery On Road
డెలివరీ చేసిన తర్వాత బిడ్డకు బొడ్డ తాడు కత్తిరించలేదు. రెండు ఐఫోన్ ఛార్జింగ్ వైర్లతో బొడ్డు తాడును కట్టిగా కట్టేశాడు. వెంటనే ఆలస్యం చేయకుండా ఆసుపత్రికి తీసుకెళ్లాడు. వెంటనే అలర్ట్ అయిన డాక్టర్లు తల్లీబిడ్డలకు వైద్య పరీక్షలు చేసి ఇద్దరూ ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పారు. ఇదిలా ఉంటే తన ప్రసవ సమయంలో జరిగిన షాకింగ్ విషయం గురించి ఎమిలీ తాజాగా ఫేస్‌బుక్‌లో పోస్ట్ పెట్టారు. తన భర్త ఛార్జింగ్ వైర్లతో బిడ్డ బొడ్డు తాడును కట్టడం చూసి భయాందోళనకు లోనయ్యానని చెప్పారు. దీంతో ఆమె పెట్టిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది.




మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..