AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Titanic Menu: టైటానిక్ షిప్‌ ఆఖరి మెనూ వేలం.. ఎంత పలికిందో తెలిస్తే షాక్..

టైటానిక్ ఓడ గురించి వచ్చిన ఏ వార్త అయినా తెలుసుకునేందుకు ఇట్టే ఆసక్తి చూపుతారు కొందరు. దీని గురించి ప్రత్యేకంగా ఒక సినిమానే రూపొందించారు దర్శకులు. దీంతో మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే ప్రపంచంలో స‌ృష్టించింన ఏ వస్తువైనా చివరకు భూగర్భంలో కలిసిపోవాల్సిందే. ఈ ఓడ కూడా ఒక ప్రమాదానికి గురై కాల గర్భంలో కలిసిపోయింది. ఇందులో గదులు చాలా విలాసవంతంగా విశాలంగా ఉంటాయి.

Titanic Menu: టైటానిక్ షిప్‌ ఆఖరి మెనూ వేలం.. ఎంత పలికిందో తెలిస్తే షాక్..
The Final Menu Of The Titanic Ship Was Auctioned In England
Srikar T
|

Updated on: Nov 13, 2023 | 8:12 AM

Share

టైటానిక్ ఓడ గురించి వచ్చిన ఏ వార్త అయినా తెలుసుకునేందుకు ఇట్టే ఆసక్తి చూపుతారు కొందరు. దీని గురించి ప్రత్యేకంగా ఒక సినిమానే రూపొందించారు దర్శకులు. దీంతో మరింత ప్రాముఖ్యం సంతరించుకుంది. అయితే ప్రపంచంలో స‌ృష్టించింన ఏ వస్తువైనా చివరకు భూగర్భంలో కలిసిపోవాల్సిందే. ఈ ఓడ కూడా ఒక ప్రమాదానికి గురై కాల గర్భంలో కలిసిపోయింది. ఇందులో గదులు చాలా విలాసవంతంగా విశాలంగా ఉంటాయి. పైగా వివిధ దేశాల వాళ్లు ఇందులో ప్రయాణించేందుకు ఇష్టపడటంతో అన్ని ప్రాంతాల వారికి అనువైన ఆహారాన్ని వండుతూ ఉంటారు. ఇటీవల ఒక పరిశోధనలో ఒక మెనూ బయటపడింది. వాటి వివరాలు ఇప్పుడు చూద్దాం.

టైటానిక్ షిప్‌లో ప్రయాణించే వారి కోసం ప్రత్యేకంగా ఒక మెనూ ఉంటుంది. తాజాగా ఈ మెనూ ను విల్డ్‌షైర్‌కు చెదిన హెన్రీ ఆల్డ్రిడ్జ్ అండ్ సన్స్ అనే సంస్థ వేలం వేసింది. 1941 ఏప్రిల్ 14న జరిగిన ప్రమాదానికి మూడు రోజుల ముందు పడవలో ప్రయాణించే వారికి వండిన మెనూను శనివారం రోజు ఇంగ్లాండ్లో వేలం వేశారు. దీని విలువ దాదాపు 83వేల పౌండ్లు పలికినట్లు యూకేకి చెందిన ది గార్డియన్ వార్తాపత్రిక తన కథనంలో పేర్కొంది. మన కరెన్సీ ప్రకారం రూ. 84.5 లక్షలుగా తెలుస్తోంది.

ఐర్లాండ్‌లోని క్వీన్స్ టౌన్ నుంచి న్యూయార్క్‌కు బయలుదేరిన ఈ పడవలోని ప్రయాణీకులకు అందించిన భోజన వివరాలు వెలుగులోకి వచ్చాయి. ఇదే ఆ ఓడలోని ఆఖరి మెనూ. ఇందులో అన్ని దేశాలకు చెందిన వారు ప్రయాణిస్తున్నందున వారికి అవసరమైన అనేక రకాల వంటకాలను పొందుపరిచారు. ఆప్రికాట్లు, ఫ్రెంచ్ ఐస్‌క్రీమ్ వంటి డెసర్ట్‌లతోపాటు ఆయిస్టర్లు, సాల్మన్, బీఫ్, స్క్వాబ్, బాతు, చికెన్‌ వంటి నాన్‌వెజ్‌ రుచులతో ఇందులో ఉన్నాయి. అంతేకాకుండా శాఖాహారులకు కూడా నోరూరించే వెజిటేరియన్‌ వంటరాలను ఇందులో ఏర్పాటు చేశారు. ఈ మెనూ నీటిలో తడిసిన ఆనవాళ్లు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అయినప్పటికీ అందులోని అక్షరాలు కొన్ని చెక్కుచెదరకుండా ఉండటం గమనార్హం.

ఇవి కూడా చదవండి

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..