Hezbollah: ఇజ్రాయెల్‌పై తొలిసారి బుర్కాన్‌ క్షిపణి.! ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు..

Hezbollah: ఇజ్రాయెల్‌పై తొలిసారి బుర్కాన్‌ క్షిపణి.! ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా దాడులు..

Anil kumar poka

|

Updated on: Nov 13, 2023 | 8:07 AM

ఇజ్రాయెల్‌పై లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ తొలిసారిగా బుర్కాన్‌ క్షిపణిని ప్రయోగించింది. మరిన్ని అధునాతన ఆయుధాలతో దాడులు చేయనున్నట్లు ఆ గ్రూప్‌ చీఫ్‌ హసన్‌ నస్రల్లా తెలిపారు. హమాస్‌తో భీకర యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్‌కు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ నుంచి కూడా దాడులు ఎదురవుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా ఈ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. కొన్ని రోజుల కిందట డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది.

ఇజ్రాయెల్‌పై లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ తొలిసారిగా బుర్కాన్‌ క్షిపణిని ప్రయోగించింది. మరిన్ని అధునాతన ఆయుధాలతో దాడులు చేయనున్నట్లు ఆ గ్రూప్‌ చీఫ్‌ హసన్‌ నస్రల్లా తెలిపారు. హమాస్‌తో భీకర యుద్ధం చేస్తోన్న ఇజ్రాయెల్‌కు లెబనాన్‌లోని హెజ్‌బొల్లా గ్రూప్‌ నుంచి కూడా దాడులు ఎదురవుతున్నాయి. పాలస్తీనాకు మద్దతుగా ఈ గ్రూప్‌ ఇజ్రాయెల్‌పై దాడులు చేస్తోంది. కొన్ని రోజుల కిందట డజన్ల కొద్దీ రాకెట్లు, మోర్టార్‌ షెల్స్‌ను ఇజ్రాయెల్‌ సైనిక స్థావరాలపై ప్రయోగించింది. ఇజ్రాయెల్‌ ప్రతిదాడికి దిగగా.. ఇప్పటి వరకు 68 మంది హెజ్‌బొల్లా ఫైటర్లు మృతి చెందినట్లు సమాచారం. దీనికి ప్రతీకారంగా ఇజ్రాయెల్‌పై కొత్త ఆయుధాలతో దాడులకు దిగనున్నట్లు హెజ్‌బొల్లా చీఫ్‌ హసన్‌ నస్రల్లా ప్రకటించారు. ఇజ్రాయెల్‌-హమాస్‌ యుద్ధం నేపథ్యంలో పాలస్తీనా మద్దతుదారులను ఉద్దేశించి హసన్‌ రెండోసారి టీవీ ఛానెల్‌ ద్వారా తాజాగా మాట్లాడారు. ఇరాన్‌ మద్దతుతో గత వారం రోజులుగా ఇజ్రాయెల్‌పై దాడులను, ఆపరేషన్లను ఉద్ధృతం చేశామన్నారు. అధునాతన ఆయుధాలతో దాడికి దిగబోతున్నామనీ శనివారం ఇజ్రాయెల్‌పై తొలిసారిగా బుర్కాన్‌ క్షిపణులను ప్రయోగించామని తెలిపారు. ఒక్కో క్షిపణి 300-500 పేలోడ్లను మోయగలవని అన్నారు. ఇజ్రాయెల్‌లో నిర్దేశించిన లక్ష్యాలపై దాడులు చేసేందుకు హెజ్‌బొల్లా మిలిటెంట్లు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. మిడిల్‌ఈస్ట్‌లో ఉన్న అమెరికా సైనిక స్థావరాలపై కూడా ఇరాన్‌ మద్దతున్న పలు గ్రూప్‌లు దాడులు చేస్తున్నాయి. ఈ దాడులపై స్పందించిన హసన్‌.. అమెరికా సైన్యంపై దాడులు ఆగాలంటే.. ఆ దేశం గాజాలో జరుగుతోన్న యుద్ధాన్ని ఆపాలని డిమాండ్‌ చేశారు.

మరిన్ని వీడియోస్ కోసం:
Videos

ప్రగతి రెండో పెళ్లి ఇదిగో క్లారిటీ.! ప్రగతి ఏం చేసిన హాట్ టాపికే.

అవును ప్రేమ పెళ్లి చేసుకోబోతున్న. కొంతకాలంగా రిలేషన్లో ఉన్నా: శ్రీదివ్య.

చేసింది 4 సినిమాలైనా.. కూడబెట్టింది మాత్రం కోట్లలో.. వరుణ్ కార్స్ కలెక్షన్స్.