AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: ఇలా చేస్తే భూమ్మీద ఎవరూ ఉండరమ్మా..! గబ్బిలాల పులుసు తింటూ ఎంజాయ్ చేసిన యువతి.. చివరకు

ప్రపంచం మొత్తాన్ని ఇప్పటికే కరోనావైరస్ అతలాకుతలం చేసింది.. ఇంకా వ్యాప్తిచెందుతున్న పలు వేరియంట్లతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే.. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా గబ్బిలాల నుంచి జంతువులకు.. ఆ తర్వాత మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి.

Watch: ఇలా చేస్తే భూమ్మీద ఎవరూ ఉండరమ్మా..! గబ్బిలాల పులుసు తింటూ ఎంజాయ్ చేసిన యువతి.. చివరకు
Thailand Youtuber
Shaik Madar Saheb
|

Updated on: Nov 13, 2022 | 5:45 AM

Share

ప్రపంచం మొత్తాన్ని ఇప్పటికే కరోనావైరస్ అతలాకుతలం చేసింది.. ఇంకా వ్యాప్తిచెందుతున్న పలు వేరియంట్లతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. అయితే.. ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా గబ్బిలాల నుంచి జంతువులకు.. ఆ తర్వాత మానవుల్లోకి వ్యాపించి ఉంటుందని పలు అధ్యయనాలు వెల్లడించాయి. గబ్బిలాలతో జగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరికలు చేశాయి. అయినా.. ఆ ప్రమాదకర విషయాన్ని బేఖాతరు చేస్తూ థాయిలాండ్‌కు చెందిన ఓ యువతి.. వాటినే తింటూ ఎంజాయ్ చేసింది. చనిపోయిన గబ్బిలాలతో కూడిన బ్యాట్ సూప్‌ తాగుతూ.. వాటిని తుంచుకుని తింటూ వీడియోను పోస్ట్ చేసింది. వీడియో పోస్ట్‌ చేసిన అనంతరం వైరల్ కావడంతో థాయ్‌లాండ్‌ ప్రభుత్వమే అలర్ట్ అయ్యింది. గబ్బిలాల పులుసును తిన్న యువతిని పోలీసులు అరెస్టు చేశారు. ఫోంచనోక్ శ్రీసునక్లువా అనే యువతి ఇటీవల తన యూట్యూబ్‌ ఛానల్‌, ఫేస్‌బుక్‌లో.. ఈ వీడియోను పోస్ట్‌ చేసింది. ఇంకేముంది ఇది తీవ్రంగా వైరల్ అయింది.

గబ్బిలం పులుసు తింటున్న వీడియోను సోమవారం తన ఫేస్‌బుక్ పేజీలో పోస్ట్ చేయడంతోపాటు ఈ ఆహారం రుచిగా ఉందంటూ వర్ణించింది. మొదటిసారి తాను ఈ జీవులను తింటున్నానని.. ఉత్తర థాయ్‌లాండ్‌లోని లావోస్ సరిహద్దు సమీప మార్కెట్ నుంచి గబ్బిలాలను కొనుగోలు చేసినట్లు వీడియోలో తెలిపింది. బ్యాట్‌ గోళ్లు ఎలుక వాసనతో ఉన్నాయని, చర్మం జిగురుగా ఉందని ఆమె చెప్పింది. తన ప్రాంతంలోని నివాసితులు కూడా గబ్బిలాలు తింటున్నందున, తాను ఎలాంటి కరోనా వైరస్‌ను వ్యాప్తి చేయడానికి ప్రయత్నించడం లేదని ఆమె వీక్షకులకు వెల్లడించింది.

అయితే, కోవిడ్‌-19 కారక ‘సార్స్‌-కోవ్‌-2’ను పోలిన వైరస్‌తో కూడిన గబ్బిలాలు ఈ ప్రాంతంలోనే కనిపిస్తాయంటూ స్థానిక వార్తాసంస్థలు వెల్లడించడంతో ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఫోంచనోక్ శ్రీసునక్లూవా ఉపాధ్యాయురాలను అధికారులు తెలిపారు. ఈ నేరానికి ఐదేళ్ల వరకు జైలు శిక్ష, లేదా 5 లక్షల బాత్‌ ( $13,800) వరకు జరిమానా విధించే అవకాశముందని పేర్కొంటున్నారు.

ఇవి కూడా చదవండి

వీడియో చూడండి..

కాగా.. ఈ వీడియోపై నెట్టింట తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అనేక మంది ఆరోగ్య సమస్యలపై ప్రశ్నలు లేవనెత్తడంతోపాటు.. యువతిపై ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఒకవేళ చనిపోవాలనుకుంటే.. ఒంటరిగా చనిపోండి. ఎవరూ ఏమనరు.. కానీ, మళ్లీ మహమ్మారి ప్రబలితే మాత్రం మీరే బాధ్యులంటూ నెటిజన్లు ఆమెపై దుమ్మెత్తి పోస్తున్నారు.

ఈ వీడియో చూసి షాక్‌కు గురైనట్లు.. స్థానిక వన్యప్రాణుల ఆరోగ్య నిర్వహణ విభాగం హెడ్‌ పటరాపోల్ మనీయోర్న్ వెల్లడించారు. గబ్బిలాలను తింటే తీవ్రమైన ఆరోగ్య సమస్యలు ఎదురవుతాయని హెచ్చరించారు.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..