AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

23rd TANA Conference: తెలుగు యువత కోసమే.. తానా యూత్ ఐడియాథాన్..

TANA Youth Ideathon: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కాన్ఫరెన్స్ లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.

23rd TANA Conference: తెలుగు యువత కోసమే.. తానా యూత్ ఐడియాథాన్..
Tana 2023
Shaik Madar Saheb
|

Updated on: Jun 21, 2023 | 12:35 PM

Share

TANA Youth Ideathon: తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 23వ మహాసభలకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఉత్తర అమెరికా తెలుగు సంఘం (తానా) కాన్ఫరెన్స్ లో భాగంగా పలు కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. అమెరికా ఫిలడెల్ఫియాలోని పెన్సిల్వేనియా కన్వెన్షన్‌ సెంటర్‌లో తానా 23వ మహాసభలను జూలై 7,8,9 తేదీల్లో జరగనున్నాయి. దీనిలో భాగంగా తానా కమిటీ తెలుగు వారి కోసం పలు రంగాల్లో పోటీలను నిర్వహించి.. ప్రతిభ ఆధారంగా పురస్కారాలను, బహుమతులు అందించేందుకు సిద్ధమవుతోంది.

అయితే, తెలుగు యువతలోని వినూత్నమైన ఆలోచనలను ఆవిష్కరించేందుకు తానా తొలిసారిగా “యూత్ ఐడియాథాన్” ఒక రోజు పెద్ద ఎత్తున (హ్యాకథాన్‌) కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. TANA యూత్ ఐడియాథాన్.. అర్థవంతమైన నమూనాలను రూపొందించడానికి వారి STEM లెర్నింగ్, కోడింగ్ సామర్థ్యాలను బయటకు తీసుకువచ్చి.. తద్వారా ఒత్తిడితో కూడిన ప్రపంచ సమస్యలకు పరిష్కారాలను ధైర్యంగా ఎదుర్కొనేలా యువకులను సిద్ధచేయడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

తానా యూత్ ఐడియాథాన్ భవిష్యత్ వ్యాపారవేత్తలకు, ఉన్నత స్థానానికి వెళ్లాలనుకున్న యువతకు ఒక ప్లాట్‌ఫాం ఏర్పాటు చేయాలని తానా యూత్‌ ఐడియాథాన్‌ను ఏర్పాటు చేస్తుందని ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకున్న అమెరికాలోని యువకులు ఈరోజే పేరును నమోదు చేసుకోవాలని తానా ప్రతినిధులు ప్రకటనలో కోరారు. యువతలో దాగి ఉన్న ప్రతిభను బయటకు తీసుకురావడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని.. యువతను ప్రోత్సహించేందుకు తోడ్పాటునందించాలంటూ కోరారు.

ఇవి కూడా చదవండి

దిగువ ఇచ్చిన లింక్‌ని ఉపయోగించి జూన్ 20, 2023లోపు తానా యూత్ ఐడియాథాన్ లో పాల్గొనేందుకు పేరును నమోదు చేసుకోవాలి.. జూన్‌ 24న ఈ కార్యక్రమం జరగనుంది.

రిజిస్ట్రేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం..

Follow Us
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
అసిడిటీ ఉన్నవారు ఈ పండ్లకు దూరంగా ఉంచండి.. లేకపోతే సమస్య డబుల్!
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
హోలీ, ఉగాది.. మార్చి నెలలో వచ్చే ప్రధాన పండగల పూర్తి జాబితా ఇదే..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
నడిచి వస్తుంటే రాజసమే.. ఆ ఫిట్నెస్ కోసం విజయ్ ఎంత కష్టపడ్డాడో..
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
షాప్ కట్టేసి ఇంటికొచ్చిన వ్యక్తి.. ఎవరూ లేని సమయంలో రూమ్‌కు
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
అల్లు అర్జున్ కోసం 15 రోజులు తిండి మానేసిన నటి.. కారణమిదే
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
LCU సీక్రెట్ ను రివీల్ చేసిన సంయుక్తా మీనన్
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
కోలీవుడ్ టు టాలీవుడ్.. సూర్య కెరీర్ ప్లాన్ మామూలుగా లేదుగా
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
భారత రూపాయి విలువ: రూ.100 ఇజ్రాయెల్- ఇరాన్‌కి వెళితే ఎంత విలువ చే
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
వరుస ఫెయిల్యూర్స్‌తో ఇబ్బందుల్లో హీరోయిన్స్‌
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..
గ్రహణం రోజు కూడా తెరిచి ఉండే ఆలయాలు ఇవే.. వీటి ప్రత్యేకత..