America: ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే.. లేదంటే స్వర్గం లభించిందట..

ఒక వ్యక్తికీ ఒకరు కంటే ఎక్కువమంది భార్యలు కలిగి ఉంటారు. కనీసం ముగ్గురు కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటె తమకు మరణాంతరం స్వర్గ ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు.

America: ఆ గ్రామంలో ఒక వ్యక్తికి కనీసం ముగ్గురు భార్యలుండాల్సిందే.. లేదంటే స్వర్గం లభించిందట..
Bizarre Commune
Follow us

|

Updated on: May 21, 2022 | 10:38 AM

America: ఒక భార్య తోనే వేగలేకపోతున్నాం.. ఇంకొక భార్య వద్దు అంటూ సరదగా కామెంట్ చేసేవారు చాలామంది ఉన్నారు. అయితే ఆ గ్రామంలో ఒక్కరు కాదు.. ఇద్దరు కాదు ముగ్గురు భార్యలు ముద్దు అంటారు.. అంతకు తక్కువ భార్యలైతే జీవితం వద్దు అంటారు. ఈ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుని ప్రపంచంలో అరుదైన గుర్తింపుని సొంతం చేసుకుంది.  మరి ఆ గ్రామం ఏమిటి? ఎక్కడ ఉందో తెలుసుకుందాం..

పశ్చిమ అమెరికాలోని ఈ రాష్ట్రం పేరు ఉటా. ఈ రాష్ట్రం అనేక విధాలుగా చాలా ప్రత్యేకమైంది. ఇక్కడ ఉన్న కొండల్లో ఒక కొండపై 100 మందికి పైగా నివాసం ఉంటారు. వీరు గిరిజనులు లేదా వలస వచ్చినవారు కాదు. అయినప్పటికీ సొంతంగా ఒక ప్రత్యేక సంప్రదాయాన్ని సొంతం చేసుకున్నారు.  ఒక ప్రత్యేక నమ్మకంతో సొంతం సమాజాన్ని (వికారమైన కమ్యూన్) ఏర్పాటు చేసుకున్నారు. ఇక్కడ నివసించేవారు ఒక ఫండమెంటలిస్ట్ మోర్మోన్స్‌ను నమ్ముతారు. ఒక వ్యక్తికీ ఒకరు కంటే ఎక్కువమంది భార్యలు కలిగి ఉంటారు. కనీసం ముగ్గురు కంటే ఎక్కువ మంది భార్యలు ఉంటె తమకు మరణాంతరం స్వర్గ ప్రాప్తి లభిస్తుందని నమ్ముతారు. ఓ కొండపై దాదాపు 15 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఈ రాయిని రాక్‌ల్యాండ్ రాంచ్ అంటారు.

ఈ సంఘం ఎప్పుడు ఏర్పడిందంటే..  రాక్‌ల్యాండ్ రాంచ్ ఇది చూడడనికి ఇతర రాక్ లాగా కనిపిస్తుంది కానీ ఇది నివాస ప్రాంతం. ఇక్కడ నివసించే మోర్మాన్‌లు 1970లలో ఇక్కడికి వచ్చారు. ఈ కల్ట్‌ను బాబ్ అనే ఫాస్టర్ ప్రారంభించారు. అతను ఒక ఉపాధ్యాయుడు. అతనికి 3 భార్యలు, 38 మంది పిల్లలు ఉన్నారు. బాబ్ ఫోస్టర్ బహుభార్యత్వం కోసం జైలు పాలయ్యాడు. అతను జైలు నుండి విడుదలైన తర్వాత తనకంటూ ఓ సొంత సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. అతను తన భార్యలతో కలిసి రాక్‌ల్యాండ్ రాంచ్‌కు చేరుకున్నాడు. అతని ఆలోచనతో ఏకీభవించిన కొందరు రాక్‌ల్యాండ్ రాంచ్‌లో అతనితో కలిసి జీవించడం ప్రారంభించారు. క్రమంగా అది పెద్ద కుటుంబంగా మారింది. ఇప్పటికీ అక్కడ నివసిస్తున్న చాలా మంది బాబ్ ఫోస్టర్ పిల్లలు అని నమ్ముతారు.

ఇవి కూడా చదవండి

ఈ స్థలం ఎలా ఉంటుందంటే? రాక్‌ల్యాండ్ రాంచ్ చాలా చోట్ల డైనమైట్‌తో పేల్చి వేసి.. పెద్ద గుహలను సృష్టించారు. ఈ గుహలలో ప్రజలు ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారు. వారి కుటుంబం పెరిగే కొద్దీ ఇళ్ల సంఖ్య కూడా పెరుగుతుంది. తొలిదశలో ఒక్క జనరేటర్‌ ఉండగా మరుగుదొడ్లు కూడా లేవు. అయితే ఇప్పుడు ఈ మోర్మాన్ సంఘం స్వయం సమృద్ధిగా మారింది. స్వంత పొలాలు, సౌర శక్తి వనరులు, పౌల్ట్రీ ఫామ్‌లతో పాటు రహదారిని అనుసంధానించే మార్గాలను కలిగి ఉంది.

ఇంకా ఒంటరిగా ఎందుకు జీవిస్తున్నారంటే..  అమెరికాలో బహుభార్యాత్వానికి గుర్తింపు లేదు. దీని కారణంగా, బాబ్ ఫోస్టర్ జైలు పాలయ్యాడు. అందువల్ల, సమాజంలోని ప్రధాన స్రవంతి కాకుండా.. ఈ సంఘం తనదైన ప్రత్యేక ప్రపంచాన్ని ఏర్పరుచుకుంది.

ఇక్కడి ప్రజలు ఏమంటున్నారు: టెలిగ్రాఫ్‌లో ప్రచురించిన నివేదిక ప్రకారం ఇక్కడి ప్రజలు శాంతి కామ‌కులు.భార్యలందరూ ఒకరితో మరొక‌రు ప్రేమగా జీవిస్తారు.

పిల్లలు కూడా పొలాల్లో పని చేస్తారు:America ఇక్కడి నాగరికత హిప్పీలది. ఇక్కడ పాఠశాలకు వెళ్లడమే కాకుండా తమ పొలాల్లో, పౌల్ట్రీ ఫారాల్లో పిల్లలు పని చేస్తుంటారు. కుటుంబ సభ్యులతో సామరస్యంగా జీవించడం ఇక్కడి పురుషుల బాధ్యత. బహుభార్యత్వాన్ని పాటించని కొన్ని కుటుంబాలు ఇక్కడ ఉన్నాయి.. అయినప్పటికీ తమను తాము ఈ సంఘంలో భాగంగానే భావిస్తారు.

మరిన్ని అంతర్జాతీయం వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
మిచెల్ మార్ష్ స్థానంలో సీమ్ బౌలర్ ఆగయా.. ఢిల్లీ భారీ స్కెచ్..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
అందం ఈమెతో పోటీకి రావడానికి కూడా భయపడుతుంది.. ఓడిపోతానేమో అని..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
ఆస్ట్రేలియా క్రికెటర్‌ను డామినేట్ చేసిన మహేష్‌..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
పోకిరి సినిమాలో నటించిన ఈ అమ్మడు.. ఇప్పుడు అందాలతో..
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
తెలంగాణలో మరో ఎమ్మెల్సీ ఎన్నికకు గ్రీన్ సిగ్నల్.. పూర్తి షెడ్యూల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
ఈ వయ్యారి కట్టడం వల్ల ఆ చీరకె అందం వచ్చిందేమో.. తాజా లుక్స్ వైరల్
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
రోజూ ఉదయాన్ని ఈ వాటర్‌ తాగండి.. ప్రయోజనాలు తెలిస్తే షాకవుతారు
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
ఇటలీ ప్రధాని జార్జియా మొలోనీకి పీఎం మోదీ ఫోన్.. ఈ ఆంశాలపై చర్చ
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
పిల్లల్ని కనడం పై షాకింగ్ కామెంట్స్ చేసిన మృణాల్ ఠాకూర్..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..
ఈ పండ్లు తింటే.. డామేజ్‌ అయిన లివర్ తిరిగి చక్కగా పని చేస్తుంది..