AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sri Lanka Political Crisis: శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రులకు పదవి గండం.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు

భారతదేశం పొరుగు దేశాలలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు శ్రీలంకలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది.

Sri Lanka Political Crisis: శ్రీలంక అధ్యక్షుడు, ప్రధానమంత్రులకు పదవి గండం.. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టిన ప్రతిపక్షాలు
Sri Lanka Political Crisis
Balaraju Goud
|

Updated on: May 04, 2022 | 11:48 AM

Share

No-Confidence Motion in Sri lanka: భారతదేశం పొరుగు దేశాలలో రాజకీయ అస్థిరత కొనసాగుతోంది. నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ తర్వాత ఇప్పుడు శ్రీలంకలో రాజకీయ ఉత్కంఠ నెలకొంది. శ్రీలంకలో ప్రభుత్వ వ్యతిరేక ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఆర్థిక సంక్షోభానికి తోడు రాజకీయ సంక్షోభం ఏర్పడింది. శ్రీలంక ప్రజలు ప్రస్తుత ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరంతరం ఆందోళనలు చేస్తున్నారు. అధ్యక్షుడు, ప్రధానమంత్రి రాజీనామా చేయాలని రోడ్డెక్క డిమాండ్ చేస్తున్నారు. ప్రతిపక్షం కూడా ప్రజలకు అండగా నిలుస్తోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా శ్రీలంక ప్రధాన ప్రతిపక్ష పార్టీ SJB మంగళవారం SLPP సంకీర్ణ ప్రభుత్వం, అధ్యక్షుడు గోటబయ రాజపక్సపై పార్లమెంటు స్పీకర్‌కి అవిశ్వాస తీర్మానం ఇచ్చింది.

పార్లమెంట్‌ స్పీకర్‌కు రెండు అవిశ్వాస తీర్మానాలు సమర్పించినట్లు సమగి జన బలవేగయ (ఎస్‌జేబీ) ప్రధాన కార్యదర్శి రంజిత్ మద్దుమ బండార తెలిపారు. రెండు అవిశ్వాస తీర్మానాల్లో ఒకటి రాష్ట్రపతికి, మరొకటి ప్రధానికి అని ఆయన చెప్పారు. దీనిపై త్వరలో ఓటింగ్‌ కోరనున్నారు. పార్లమెంట్ డిప్యూటీ స్పీకర్ పదవికి అభ్యర్థిని నిలబెడతామని ఎస్‌జేబీ కూడా చెప్పింది.

SJBతో పాటు, మాజీ ప్రధాని రాణిల్ విక్రమసింఘే, యునైటెడ్ నేషనల్ పార్టీ (UNP) సంయుక్తంగా అధ్యక్షుడు రాజపక్సేపై అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెట్టనుంది. ప్రస్తుత శ్రీలంక ప్రభుత్వం SJB అవిశ్వాస తీర్మానంపై అవసరమైన ఓట్లను పొందలేకపోతే, ప్రధానమంత్రి మహింద రాజపక్సే సహా మంత్రివర్గం రాజీనామా చేయవలసి ఉంటుంది. అదే సమయంలో, TNA,UNP ప్రతిపాదన విజయవంతమైతే, అధ్యక్షుడు తప్పనిసరిగా రాజీనామా చేయాల్సి ఉంటుంది.

అవిశ్వాస తీర్మానంపై ఓటింగ్ వేయకుంటే ప్రధాని కుర్చీ పోతుంది. కానీ రాష్ట్రపతి విషయంలో అలా జరగదు. రాష్ట్రపతిని తీసివేయడానికి రెండు బలమైన కారణాలు ఉన్నాయి. ఒకటి అభిశంసన, దీనికి చాలా సమయం పట్టవచ్చు. మరొకటి రాష్ట్రపతి స్వయంగా రాజీనామా చేయడం. మరోవైపు పెరిగిన ధరలతో లంకేయులు అల్లాడిపోతున్నారు. రోడ్డెక్కి పెద్ద ఎత్తున నిరసనలు తెలుపుతున్నారు.

Read Also… ప్రారంభమైన LIC-IPO.. షేర్ల కోసం అప్లై చేయాలనుకుంటున్నారా? ఆన్ లైన్ లో ఇలా చేయండి!

ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఈ కౌబాయ్‌ను గుర్తు పట్టారా? ఇప్పుడు టాలీవుడ్ హ్యాండ్సమ్ హీరో..
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
ఏడాదిలో కేవలం 15 రోజులు మాత్రమే దొరికే బీర్.. దీని స్పెషల్‌ ఏంటో
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
వామ్మో.. షాపింగ్ బుట్ట వెనక షాకింగ్ నిజాలు.. సూపర్ మార్కెట్‌కు..
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
తెలుగు రాష్ట్రాల్లో తొలి వందే భారత్ స్లీపర్ రైలు.. రూట్ ఫిక్స్..!
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
గుడ్డులో మిరియాల పొడి కలిపి తింటే ఏమవుతుందో తెలుసా?
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
జల్లికట్టును చూసేందుకు తమిళనాడుకు బీజేపీ అగ్రనేతలు..
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
దీప్తితో బ్రేకప్..కొత్త లవర్‌ను పరిచయం చేసిన షన్ను.. ఫొటోస్ వైరల్
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
అచ్యుత్ చనిపోయినప్పుడు వచ్చిన జనాన్ని చూసి షాకయ్యా..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
ఈ దేశంలో ఒక్క నది కూడా ఉండదు.. ప్రజలకు నీళ్లు ఎక్కడి నుంచి..
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?
Health tips: గుడ్లు తినడం వల్ల దగ్గు తగ్గుతుందా? ఏం చేయాలంటే?