AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Spider Web: చెవి నొప్పితో డాక్టర్ దగ్గరకు వెళ్లిన యువతికి షాక్.. గూడు కట్టి కాపురం పెట్టిన సాలీడు

చెవుల్లోకి ఏదైనా వెళ్లిన వెంటనే వాటిని బయటకు తీసేసేవరకూ ఏమీ తోచదు.. అంతగా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, చైనాకు చెందిన ఓ మహిళ చెవిలో ఓ సాలీడు కాపురం పెట్టేసింది. ఏకంగా తన కుటుంబం నివసించడానికి ఆ యువతి చెవిని ఆవాసంగా చేసుకుని ఒక గూడుని నిర్మించుకుంది.

Spider Web: చెవి నొప్పితో డాక్టర్ దగ్గరకు వెళ్లిన యువతికి షాక్.. గూడు కట్టి కాపురం పెట్టిన సాలీడు
Spider Weaves A Web
Surya Kala
|

Updated on: Apr 29, 2023 | 9:10 AM

Share

రాత్రివేళలో గాఢ నిద్రలో ఉన్నసమయంలో ఒకొక్కసారి చెవుల దగ్గర దోమలు తిరుగుతూ సందడి చేస్తూ చికాకు పెడతాయి. అంతేకాదు ఒకొక్కసారి చెవుల్లో, ముక్కుల్లో దోమలు, చిన్న చిన్న పురుగులు చేరుకుని చికాకు పెడుతూ ఉంటాయి. అంతేకాదు బాధను కలిగిస్తాయి. అయితే చెవుల్లోకి ఏదైనా వెళ్లిన వెంటనే వాటిని బయటకు తీసేసేవరకూ ఏమీ తోచదు.. అంతగా ఇబ్బంది కలిగిస్తాయి. అయితే, చైనాకు చెందిన ఓ మహిళ చెవిలో ఓ సాలీడు కాపురం పెట్టేసింది. ఏకంగా తన కుటుంబం నివసించడానికి ఆ యువతి చెవిని ఆవాసంగా చేసుకుని ఒక గూడుని నిర్మించుకుంది.

ఏప్రిల్ 20న సిచువాన్ ప్రావిన్స్‌కు చెందిన ఓ యువతి చెవి నొప్పితో వైద్యం కోసం ఆస్పత్రికి వెళ్ళింది. అప్పుడు వైద్యులు యువతి చెవిని ఎండోస్కోపీ చేయగా ఓ వింత సంఘటన జరిగింది. చెవిలో సాలీడు ఉన్నట్లు.. అందుకనే ఆ యువతి చెవి నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు తెలుసుకున్నారు వైద్యులు.

ఇవి కూడా చదవండి

ఎండోస్కోపీ వీడియో ఇప్పుడు ఆన్‌లైన్‌లో ఓ రేంజ్ లో హల్ చల్ చేస్తోంది. చెవి లోపల ఒక సాలీడు ఉన్నట్లు.. అది కర్ణభేరి దగ్గర అల్లిన ఒక సిల్కి సాలీడు గూడు వీడియోలో కనిపిస్తుంది.

అనంతరం వైద్యులు ఆ యువతికి ఆపరేషన్ చేసి.. చెవిలో సాలీడుని సాలీడు గూడుని తీశారు. ఇదే విషయాన్నీ ఆ దేశ మీడియా తెలియాజేస్తూ.. సాలీడు చెవిలో గూడు కట్టేవరకూ ఆ యువతి ఎలా ఉంది అని వ్యాఖ్యానిస్తున్నారు.

అయితే మన దేశంలో కూడా ఇలాంటి సంఘటన బెంగళూరులో చోటు చేసుకుంది. ఒక మహిళ తన చెవి నుండి స్పైడర్ బటయకు తీసుకున్న వీడియో నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ ఫుటేజ్ 2018లో వైరల్ అయ్యింది.

మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
హోర్ముజ్ దాటుతూ.. తొలి భారత నౌక ‘దిశా’ ప్రయాణం!
హోర్ముజ్ దాటుతూ.. తొలి భారత నౌక ‘దిశా’ ప్రయాణం!
వంటగదిలో ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఖాళీ కాకూడదట.. లేకపోతే అన్నపూర్ణమ్
వంటగదిలో ఈ 5 వస్తువులు ఎప్పుడూ ఖాళీ కాకూడదట.. లేకపోతే అన్నపూర్ణమ్
చుక్క నూనె లేకుండా బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్
చుక్క నూనె లేకుండా బరువు తగ్గాలనుకునేవారికి హెల్తీ బ్రేక్ ఫాస్ట్
గుడ్లను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌కు ఎదురొడ్డిన పక్షి.. వీడియో
గుడ్లను కాపాడుకోవడానికి ట్రాక్టర్‌కు ఎదురొడ్డిన పక్షి.. వీడియో
కాలు విరిగి ఇంట్లోనే ఉండిపోయా.. ఆ స్టార్ హీరో వచ్చి..
కాలు విరిగి ఇంట్లోనే ఉండిపోయా.. ఆ స్టార్ హీరో వచ్చి..
చనిపోయిన వ్యక్తి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా?
చనిపోయిన వ్యక్తి ముక్కులో దూది ఎందుకు పెడతారో తెలుసా?
తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే..
తొక్కలో ఏముందని తీసి పడేస్తున్నారా?.. ప్రయోజనాలు తెలిస్తే..
రాక్షసుడిగా మారిన 17 ఏళ్ల కుర్రాడు.. క్షణ క్షణం ఊహించని మలుపులు..
రాక్షసుడిగా మారిన 17 ఏళ్ల కుర్రాడు.. క్షణ క్షణం ఊహించని మలుపులు..
మొన్న విజయ్, నేడు అంబానీ.. కోరిన కోరికలు తీర్చే మూకాంబిక ఆలయం
మొన్న విజయ్, నేడు అంబానీ.. కోరిన కోరికలు తీర్చే మూకాంబిక ఆలయం
ధోని తర్వాత అతనే కెప్టెన్ అనుకున్న..!
ధోని తర్వాత అతనే కెప్టెన్ అనుకున్న..!