Corona: మిలియన్ల మంది ప్రాణాలను బలిగొన్న కరోనా ఆ ఖైదీ ప్రాణాన్ని కాపాడింది.. ఎలాగంటే..

రోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎంతో మందికి ఆధారం లేకుండా చేసింది. కానీ అదే మహమ్మారి వైరస్‌ ఒకరి ప్రాణాలను కాపాడింది..

Corona: మిలియన్ల మంది ప్రాణాలను బలిగొన్న కరోనా ఆ ఖైదీ ప్రాణాన్ని కాపాడింది.. ఎలాగంటే..
Follow us

|

Updated on: Nov 09, 2021 | 10:40 PM

కరోనా వైరస్‌ ప్రపంచ వ్యాప్తంగా మిలియన్ల మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఎంతో మందికి ఆధారం లేకుండా చేసింది. కానీ అదే మహమ్మారి వైరస్‌ ఒకరి ప్రాణాలను కాపాడింది. మరికొన్ని గంటల్లో అమలయ్యే ఉరిశిక్షను తప్పించి మరికొన్ని రోజుల పాటు ఊపిరి తీసుకునేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. భారత సంతతికి చెందిన మలేషియా వాసి నాగేంద్రన్‌ ధర్మలింగం మాదక ద్రవ్యాలను అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడ్డాడు. సింగపూర్‌ న్యాయస్థానం అతనికి మరణశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. బుధవారం(నవంబర్‌10)న నాగేంద్రన్‌కు మరణశిక్ష అమలు కావాల్సి ఉంది.

మానవత్వంతో ఆలోచించాం.. అయితే తన మానసిక స్థితి బాగోలేనందున ఉరిశిక్ష అమలు నిలిపివేయాలంటూ నాగేంద్రన్‌ సోమవారం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. కానీ న్యాయస్థానం వీటన్నింటినీ తోసిపుచ్చింది. అప్పీలుకు వెళ్లేందుకు మాత్రం ఒకరోజు అనుమతినిచ్చింది. ఇదే సమయంలో నాగేంద్రన్‌ కొవిడ్ బారిన పడినట్లు జైలు అధికారులు వెల్లడించారు. దీంతో బుధవారం అమలుకానున్న మరణశిక్షను తాత్కాలికంగా వాయిదావేస్తున్నట్లు న్యాయస్థానం ప్రకటించింది. ‘ఇది ఊహించని పరిణామం. నిబంధనల ప్రకారం దోషికి కొవిడ్‌ సోకితే మరణశిక్షను అమలు చేయలేం. ఇలాంటి సమయాల్లో మనం మానవత్వం ప్రదర్శించాల్సిన అవసరం ఉంది’ అతడి కేసును విచారించిన న్యాయమూర్తి చెప్పుకొచ్చాడు. మలేషియాలో నివాసముండే నాగేంద్రన్‌ 42 గ్రాముల హెరాయిన్‌ సరఫరా చేశారని 2009లో అభియోగం నిరూపితమైంది. విచారణలో వాస్తవమని తేలడంతో 2010లో అతనికి న్యాయస్థానం మరణశిక్ష ఖరారు చేసింది. అయితే దీనిపై పలుసార్లు అప్పీలుకు వెళ్లాడు. కానీ ఫలితం లేకుండా పోయింది. చివరకు ఉరిశిక్ష నిలిపివేయాలని మలేషియా ప్రధాని స్వయంగా సింగపూర్‌కు లేఖ రాశారు. అయినా న్యాయస్థానం వినిపించుకోలేదు. నవంబర్‌ 10న నాగేంద్రన్‌కు ఉరిశిక్ష అమలు చేయాలని తీర్పు వెలువరించింది. తాజాగా అతనికి కొవిడ్‌ పాజిటివ్‌ తేలడంతో మరికొన్ని రోజులు భూమ్మీద ఊపిరి పీల్చుకునే అవకాశం దక్కింది.

Also Read:

Inspiring Person: కాళ్ళుచేతులు లేవని తల్లిదండ్రులు వదిలేస్తే.. పెంచిన తల్లి అతని జీవితాన్నే మార్చేసింది.. వీడియో వైరల్

Peruvian Family: కుక్క అనుకుని పెంచుకుంటే.. 6 నెలల తర్వాత అసలు విషయం తెలిసి షాక్..

Covid Vaccine: బ్రిటన్‌కు వెళ్లే భారత ప్రయాణికులకు శుభవార్త.. కోవాగ్జిన్ తీసుకున్నవారికి అనుమతి.. ఎప్పటి నుంచి అంటే?