AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Inspiring Person: కాళ్ళుచేతులు లేవని తల్లిదండ్రులు వదిలేస్తే.. పెంచిన తల్లి అతని జీవితాన్నే మార్చేసింది.. వీడియో వైరల్

Inspiring Person: కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదు.. ఆత్మస్థైర్యం ఉంటె అంగవైకల్యం కూడా తలవంచుతుంది.. అన్ని అవయవాలు ఉన్నవారే.. అవకాశాలు..

Inspiring Person: కాళ్ళుచేతులు లేవని తల్లిదండ్రులు వదిలేస్తే.. పెంచిన తల్లి అతని జీవితాన్నే మార్చేసింది.. వీడియో వైరల్
Makeup Artist
Surya Kala
|

Updated on: Nov 09, 2021 | 10:04 PM

Share

Inspiring Person: కృషి పట్టుదల ఉంటే మనిషి సాధించలేనిది ఏమీ లేదు.. ఆత్మస్థైర్యం ఉంటె అంగవైకల్యం కూడా తలవంచుతుంది.. అన్ని అవయవాలు ఉన్నవారే.. అవకాశాలు లేవంటూ నిరాశతో బతికేస్తుంటే.. పుట్టుకతోనే అరుదైన వ్యాధితో బాధపడుతున్న ఓ వ్యక్తి.. పట్టుదలతో తనకంటూ ఓ ఫేమ్ ను సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఇతని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

బ్రెజిల్‌కి చెందిన గేబ్ ఆడమ్స్-వీట్లీ అనే వ్యక్తి పుట్టుకతోనే హన్‌ హార్ట్‌ సిండ్రోమ్‌ అనే వ్యాధితో జన్మించాడు. దీంతో అతని తల్లిదండ్రులు పుట్టిన వెంటనే ఆసుపత్రిలోనే వదిలి వెళ్లిపోయారు. ఇది అవయవాలపై ప్రభావం చూపే అరుదైన వ్యాధి. ఈ సిండ్రోమ్‌ కారణంగా అతనికి దవడ, నాలుక, చేతులు, కాళ్లు పూర్తిగా ఏర్పడలేదు. అంతే కాదు తొమ్మది నెలల వయసులో ఉన్న గేబ్‌ని ఉటాకు చెందిన ఒక కుటుంబం దతత్త తీసుకుంది.

దీంతో అతని జీవితం ఊహించని మలుపు తిరిగింది. అతని దత్తత తల్లి ఇచ్చిన ప్రోత్సాహంతో … ఓ ప్రముఖ టీవీ షో ‘యుఫోరియా ప్రేరణతో తన ముఖానికి తాను చక్కగా మేకప్‌ వేసుకోవడం నేర్చుకున్నాడు. అంతేకాదు అతని మేకప్‌ కళకు సంబంధించిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేస్తుంటాడు. అంతేకాదు కాళ్లు, చేతులు లేకపోవడంతో తాను రోజువారీ పనులు చేసుకోవడంలో ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నాడో కూడా వివరిస్తుంటాడు. అయితే ప్రస్తుతం గేబ్‌ మేకప్‌ కళకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది. ఈ వీడియోను వీక్షిస్తున్న లక్షలమంది నెటిజన్లు అతని కళకు ఫిదా అయిపోతున్నారు. రెండు చేతులూ లేకపోయినా ఎంత చక్కగా మేకప్‌ వేసుకుంటున్నాడో అంటూ రకరకాల కామెంట్స్‌ పెడుతున్నారు.

Also Read: మరణాంతరం ఎస్పీబీకి పద్మ విభూషణ్‌తో సత్కారం.. తండ్రి తరపున అవార్డు అందుకున్న తనయుడు చరణ్