AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sunfish: భారీ చేప చిక్కింది.. రెండు టన్నులున్నా వద్దనుకుని వదిలేశారు.. ఎందుకో తెలిస్తే షాకే..

Giant sunfish: మహాసముద్రపు లోతులలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అక్కడ లభించేవి చూస్తే సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఆశ్చర్య పోతున్నారు. మానవుడి చరిత్రకు చెందిన ఆదారాలు అక్కడ లభిస్తున్నాయి.

Sunfish: భారీ చేప చిక్కింది.. రెండు టన్నులున్నా వద్దనుకుని వదిలేశారు.. ఎందుకో తెలిస్తే షాకే..
Giant Sunfish
Sanjay Kasula
|

Updated on: Oct 21, 2021 | 2:46 PM

Share

మహాసముద్రపు లోతులలో చాలా రహస్యాలు దాగి ఉన్నాయి. అక్కడ లభించేవి చూస్తే సామాన్యుల నుంచి శాస్త్రవేత్తల వరకు ఆశ్చర్య పోతున్నారు. మానవుడి చరిత్రకు చెందిన ఆదారాలు అక్కడ లభిస్తున్నాయి. చాలా సార్లు అలాంటి విషయాలు మన ముందు సముద్రం నుండి బయటకు వస్తాయి. ఇప్పుడు సముద్రం చేపల నిలయం. కానీ ఈసారి అలాంటి చేప సముద్రంలో కనిపిస్తాయి. కొన్ని సార్లు భారీ నుంచి అతి భారీ చేపలు మనకు కనిపిస్తుంటాయి. అంతే కాదు ఎన్నో వింత చేపలు వేటగాళ్ల వలకు చిక్కుతుంటాయి. దీనిని చూసి ప్రజలు ఆశ్చర్యపోతుంటారు. నిజానికి ఇంత పెద్ద చేప వలలో చిక్కుడం ఇదే తొలిసారి.

ఒక నివేదిక ప్రకారం సీయూటా సముద్ర తీరంలో వలలో ఈ చేప చిక్కింది. ఇది సన్ ఫిష్ జాతికి చెందినదని సముద్ర శాస్త్రవేత్తలు నిర్ధారించారు. ఈ చేప పొడవు 9 అడుగుల కంటే ఎక్కువ అని తేల్చారు. అదే సమయంలో దాని బరువు 4,000 పౌండ్లు (1814 కిలోలు) అని పేర్కొన్నారు. ఈ వీడియోను చూసిన ప్రజలు ఆశ్చర్యపోయారు. చేప బరువు ఎంతగా ఉందంటే దాన్ని ఎత్తడానికి క్రేన్ ఉపయోగించాల్సి వచ్చింది. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ చేపలకు సంబంధించిన చాలా వీడియోలను నెటిజన్లు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. మీరు కూడా ఇంత పెద్ద చేపను నిజంగా చూశారా అని కామెంట్ చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి: 100 Crore Vaccination: 100 కోట్ల మార్కును దాటిందోచ్.. కొవిడ్‌ వ్యాక్సినేషన్‌లో దూసుకుపోతున్న భారత్..